Home » Entertainment » Jabardasth Show Going To New Anchor Sreemukhi Very Soon
Entertainment

Sreemukhi : జబర్దస్త్‌ లో అడుగు పెట్టబోతున్న శ్రీముఖి.. రచ్చ రచ్చ ఖాయం

Authored By
aruna
The Telugu News | Published on: February 14, 2023, 9:00 pm
Advertisement

Sreemukhi  : జబర్దస్త్ jabardasth కార్యక్రమం లో కొత్త మార్పులు జరగబోతున్నాయి. పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న జబర్దస్త్ కార్యక్రమం కి ఇప్పటి వరకు యాంకర్స్ గా అనసూయ. రష్మీ గౌతమ్‌ rashmi gautam, సౌమ్య sowmya వ్యవహరించారు. ఇటీవలే అనసూయ Anasuya వెళ్ళి పోవడంతో ఆమె స్థానంలో సౌమ్య ఎంట్రీ ఇచ్చింది. కన్నడ బ్యూటీ సౌమ్య ఎంత వరకు జబర్దస్త్ కార్యక్రమాన్ని ముందుకు సాగేలా చేస్తుందో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. అందుకే మల్లెమాల టీం త్వరలోనే కొత్త యాంకర్ ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసినట్లుగా సమాచారం అందుతుంది.

Advertisement

అన్ని అనుకున్నట్లుగా జరిగితే మల్లెమాల వారు త్వరలోనే జబర్దస్త్ యాంకర్ గా శ్రీముఖిని రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం శ్రీముఖి పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసింది. ఆమెకి ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో జబర్దస్త్ కి ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా మంచి రేటింగ్ దక్కే అవకాశం ఉంది. గతంలోనే యాంకర్ గా జబర్దస్త్ కార్యక్రమానికి రావాల్సిందిగా శ్రీముఖికి ఆహ్వానం అందిందట, కానీ ఆ సమయం లో ఆమె ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండడం వల్ల నో చెప్పింది. మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఆమెకి అవకాశం వచ్చింది.

jabardasth-show-going-to-new-anchor-sreemukhi-very-soon

Advertisement

మల్లెమాల వారితో కలిసి శ్రీముఖి sreemukhi చాలా కార్యక్రమాలు చేసింది, ఈటీవీ ప్లస్ లో వచ్చిన కార్యక్రమానికి మల్లెమాల వారు నిర్మాతలు అనే విషయం తెలిసిందే. అందుకే జబర్దస్త్ కార్యక్రమానికి కూడా శ్రీముఖిని తీసుకొచ్చి కార్యక్రమం యొక్క రేటింగ్ పెంచాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా జబర్దస్త్ కార్యక్రమం ఉండాలని మల్లెమాల వారు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే కొత్త కమెడియన్స్ మరియు యాంకర్స్ తో పాటు జడ్జిలను కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే కొత్త మార్పు, కొత్త జబర్దస్త్ చూడబోతున్నాం అంటూ ఈటీవీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి