Home » Entertainment » Jabardasth Varsha To Kiss Rashmi Gautam In Sridevi Drama Company
Entertainment

Rashmi Gautam : స్టేజ్ మీద పిచ్చి చేష్టలు.. రష్మీని ముద్దు పెట్టుకోబోయిన వర్ష

Authored By
aruna
The Telugu News | Updated on: August 8, 2022, 12:53 pm
Advertisement

Rashmi Gautam : యాంకర్ రష్మి ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటూ నానా హంగామా చేస్తోంది. అన్నింట్లో కంటే శ్రీదేవీ డ్రామా కంపెనీలోనే రష్మీ ఎక్కువగా ఓపెన్ అయినట్టుంది. అక్కడ ఎంతో సరదాగా ఉంటోంది. అవలీలగా షోను ముందుకు తీసుకెళ్తోంది. అందరి మీరష్మి ద పంచులు వేస్తోంది. తన మీద ఎవరు ఎలాంటి పంచులు వేసినా కూడా ఏమీ అనడం లేదు. మొత్తానికి శ్రీదేవీ డ్రామా కంపెనీని మాత్రం బాగానే నడిపిస్తోంది. ఇక రష్మీని అందరూ కూడా సుధీర్ పేరుతో పరోక్షంగా ఆట పట్టిస్తున్నారు. బాబు అంటూ ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ కూడా రష్మీని ఆడుకుంటారు. బాబు ఏం చేస్తున్నాడు.. ఏం అంటున్నాడు. బాగానే ఉందని అంటున్నాడా? అక్కడ ఎలా ఉందట.. నీ యాంకరింగ్ ఎలా ఉందంటున్నాడు? అంటూ ఇలాంటి ప్రశ్నలతో రష్మీని ఏడిపిస్తుంటారు హైపర్ ఆది, రాం ప్రసాద్…

Advertisement

Rashmi Gautam : రష్మికి తప్పని పాట్లు..

ఇక వర్ష-Jabardasth Varsha ఈ మధ్య రష్మీని ఆడుకోవడం మొదలుపెట్టేసింది. అక్కా అంటూ రష్మీని వెంటపడి మరీ వేధిస్తోంది. అక్కా అక్కా అంటూ బావ గురించి చెబుతానంటూ వర్ష నాటకాలు ఆడుతుంటుంది. ఇక అప్పుడప్పుడు రష్మీకి చిరాకు వేస్తుంటుంది. ఎవరే నీకు వర్షఅక్కా అని అంటుంది. తాజాగా రష్మీ చేసిన ఎపిసోడ్‌లో ఓ వింత ఘటన జరిగేది. కాస్తలో ఆప్రమాదం తప్పిపోయింది.

Jabardasth Varsha To Kiss Rashmi Gautam In Sridevi Drama Company

Advertisement

Rashmi Gautam : వర్ష కొంటె చేష్టలు..

అక్కా అక్కా అని వర్ష పిలుస్తుంది. ఎవరే నీకు అక్కా.. ఆపు.. నువ్వూ నీ అక్కా అని అంటుంది. బావ ఒకటి ఇవ్వమన్నాడు.. కళ్లు మూసుకో చూపిస్తా? అని వర్ష అంటే.. నువ్ చూపిస్తావా? వామ్మో అని డబుల్ మీనింగ్‌లో అనేస్తుంది రష్మీ. దీంతో అందరూ నవ్వేస్తారు. అది కాదు..నువ్ కళ్లు మూసుకో అని వర్ష అంటుంది. కళ్లు మూసుకునేలోపు వర్ష వచ్చి ముద్దు పెట్టబోతోంది. దీంతో రష్మీ అవాక్కవుతుంది.. పక్కకి పో అన్నట్టుగా అనేస్తుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి