Jabardasth Varsha Touches Emmanuel Feet In Sitaramula Kalyanam Chutamu Rarandi
వర్ష ఇమాన్యుయేల్ జోడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరూ ఎంత అతి చేసినా కూడా ప్రేక్షకులకు మాత్రం ఇట్టే నచ్చేస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం బార్డర్ దాటేస్తుంటారు. ఆ టైంలో ఈ ఇద్దరూ ట్రోలింగ్‌తో ఆడుకుంటారు. మొత్తానికి బుల్లితెరపై మాత్రం వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ బాగానే వర్కవుట్ అవుతూ వస్తోంది. ప్రతీ పండుగ ఈవెంట్లోనూ ఈ జోడి సందడి చేస్తుంటుంది.వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ బాగా వర్కవుట్ అవ్వడంతో మల్లెమాల టీం సైతం ఈ ఇద్దరిని ఫోకస్ చేస్తూ వచ్చింది. మధ్యలో పెళ్లి ఈవెంట్ కూడా చేసేశారు.
వర్ష ఇమాన్యుయేల్ పెళ్లి ఈవెంట్ మాత్రం దారుణమైన ట్రోలింగ్‌ను మూటగట్టుకుంది. ఇక ఆ తరువాత కొన్ని రోజులు ఈ ఇద్దరూ జంటగా నటించడం, కనిపించడం తగ్గిపోయింది. మళ్లీ కొన్ని రోజులు తరువాత షరా మామూలే అన్నట్టుగా స్కిట్లు చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు అన్ని చోట్లా ఈ ఇద్దరూ సందడి చేస్తున్నారు.ఇప్పుడు శ్రీరామనవమి స్పెషల్ ఈవెంట్ రానుంది. నేడు (ఏప్రిల్ 10) శ్రీరామనవమి. ఈ సందర్బంగా ఈటీవీలో ఓ స్పెషల్ ఈవెంట్ రాబోతోంది. మల్లెమాల నిర్వహిస్తోన్న ఈ ఈవెంట్ ప్రోమోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి.
Jabardasth Varsha Touches Emmanuel Feet In Sitaramula Kalyanam Chutamu Rarandi
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి అనే ఈవెంట్ నేడు హైలెట్ కానుంది. తాజాగా ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమో ఒకటి మళ్లీ విడుదల చేశారు.ఇందులో వర్ష ఇమాన్యుయేల్ బంధాన్ని చూపించారు. రాముడు, సీత అంటూ చిట్టీల ఆట ఆడారు. అందులో రాముడి చిట్టి వర్షకు రాగా.. సీత చిట్టి ఇమాన్యుయేల్‌కు వచ్చింది. రాముడు ఇమాన్యుయేల్, నేను సీత అంటూ చిట్టీ మార్చుకుంది వర్ష. అయితే నా కాళ్లకు దండం పెట్టు అని ఇమాన్యుయేల్ అంటాడు. సరే అని అందరి ముందే ఇమాన్యుయేల్ కాళ్లకు దండం పెట్టేస్తుంది వర్ష.
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
This website uses cookies.