Home » Entertainment » Jabradsth Rakesh Proposes And Sujatha Kisses In Saravan Sandadi Show
Entertainment

Rakesh – Sujatha : మా ప్రేమ నిజం.. స్టేజ్ మీద ముద్దులతో రెచ్చిపోయిన సుజాత రాకేష్ జోడి

Authored By
aruna
The Telugu News | Published on: August 14, 2022, 3:20 pm
Advertisement

Rakesh – Sujatha : బుల్లితెరపై ఒక్కోసారి ఏది నిజం ఏది అబద్దం.. ఏది నాటకం.. ఏది టీఆర్పీ స్టంట్ అన్నది చెప్పడం కష్టం అవుతుంటుంది. ఓ జంట మీద లవ్ ట్రాక్ పుట్టించి వారిని ఫేమస్ చేసేస్తుంటుంది డైరెక్షన్ టీం అండ్ ఎడిటింగ్ టీం. అలా ఫేమస్ అయిన జంటలు ఆఫ్ స్క్రీన్‌లోనూ రెచ్చిపోతుంటారు. అసలు సమస్య అక్కడే వస్తుంది. సుధీర్ రష్మీ ఆన్ స్క్రీన్ మీద ఎంత చేసినా.. ఆఫ్ స్క్రీన్‌లో సైలెంటె‌గా ఉంటారు. వీరిద్దరూ కలిసి తిరిగినట్టుగా, ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఎక్కడా కూడా కనిపించరు..

Advertisement

కానీ రాకేష్, సుజాత జోడి మాత్రం ఇప్పుడు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అన్న తేడా లేకుండా రెచ్చిపోతోన్నారు. ఆన్ స్క్రీన్‌లోనే ముద్దులు, హగ్గులు అంటూ దుమ్ములేపుతున్నారు. ఇక ఆఫ్ స్క్రీన్‌లో అయితే గోవాలంటూ బీచుల్లో హంగామా చేస్తున్నారు. పెళ్లి కాక ముందు అత్తింట్లో సుజాత సందడి చేస్తోంది. మొన్నటికి మొన్న వరలక్ష్మీ వ్రతం అంటూ రాకేష్ ఇంట్లో సుజాత సందడి చేస్తోంది. పెళ్లి కాక ముందే ఇలా అత్తింట్లో సందడి చేస్తోందని, అత్త కూడా తనకు కాబోయే కోడలితో బాగానే ఉంటోందని నెటిజన్లు కామెంట్లు చేస్తూ వచ్చారు.

Jabradsth Rakesh Proposes And Sujatha Kisses in Saravan Sandadi SHow

Advertisement

Rakesh – Sujatha : షోలో రాకేష్ రచ్చ..

ఇక తాజాగా మరోసారి వీరి ప్రేమ, పెళ్లి మీద చర్చలు జరుగుతున్నాయి. అలీతో సరదాగా షో నిర్మాత అయితే ప్రవీణ ఓ కొత్త ఈవెంట్‌తో ముందుకు వచ్చింది. శ్రావణ సందడి అనే ఈ ఈవెంట్‌లో అనసూయ, రవి కలిసి సందడి చేశారు. వారితో పాటుగా కొంత మంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు, జబర్దస్త్ ఆర్టిస్టులు కనిపించారు. ఇక ఇందులోనూ అనసూయ తెగ సందడి చేసేసింది. అయితే రాకేష్, సుజాతలు మాత్రం ఇక్కడా కూడా తమ లవ్ ట్రాక్‌ను కంటిన్యూ చేస్తూ అందరి ముందు రెచ్చిపోయారు.

Rakesh – Sujatha : ముద్దులతో సుజాత..

మాది షో కోసం షో చేసే లవ్ కాదు.. నిజమైన ప్రేమ.. ఎప్పటికీ ఉంటుందన్నట్టుగా రాకేష్ అంటే.. ఇక సుజాత ఇంకా రెచ్చిపోయింది. సుజాత పెట్టిన ముద్దులు, రాకేష్ సిగ్గు పడిన తీరు అందరినీ అనుమానాల్లోకి నెట్టేస్తోంది. వీరిద్దరూ నిజంగా పెళ్లి చేసుకుంటారా? లేదా? అన్నది కాలమే చెప్పాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి