janaki gets shock by jnanamba in janaki kalaganaledu
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు సీరియల్ 23 మే 2022, సోమవారం ఎపిసోడ్ 305 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామా పుట్టిన రోజు సందర్భంగా అతడికి తలంటు పెట్టి స్నానం చేయిస్తుంది జానకి. తర్వాత రామా కోసం కొత్త బట్టలు తెచ్చి వేసుకోమని చెబుతుంది జానకి. కొత్త బట్టల్లో రామాను చూసి మురిసిపోతుంది జానకి. నా ప్రతి సంవత్సరం పుట్టిన రోజునాడు.. మా అమ్మ నాకు తలస్నానం చేయించేది. కానీ.. ఈసారి మాత్రం మీరు ఆ బాధ్యతను తీసుకున్నారు. మా అమ్మను మీరు మైమరిపించడం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది అంటాడు రామా. మీ బాధ్యతను నన్ను తీసుకోమని.. అత్తయ్య గారు మన పెళ్లి అయిన కొత్తలో చెప్పిన మాట మీకు గుర్తుందా.. అందుకే ఇప్పుడు నేను ఆవిడ బాధ్యతను తీసుకున్నాను అని చెబుతుంది జానకి.
janaki gets shock by jnanamba in janaki kalaganaledu
మరోవైపు జ్ఞానాంబ… రామాకు స్నానం చేయించాలని అనుకుంటుంది. చికితను కుంకుడు కాయ రసం సిద్ధం చేయమని చెబుతుంది. కుంకుడు కాయ రసం సిద్ధం చేయలేదా అని అడిగితే.. చికిత చేశాను కానీ.. జానకి అమ్మ గారు తీసుకెళ్లారు అని చెబుతుంది. అంతే కాదు.. జానకి అమ్మ గారు పెద బాబు గారికి స్నానం చేయించి స్పెషల్ డ్రెస్ తీసుకొచ్చి వేయించారు. పెద బాబు గారికి పెళ్లి కాకముందుకు తన బాధ్యతలన్నీ కంటికి రెప్పలా మీరు చూసుకున్నారు. కానీ.. ఇప్పుడు ఆ బాధ్యతలను జానకి అమ్మ గారు తీసుకున్నారు అంటుంది చికిత. కానీ.. నా కొడుకును ఆ జానకి దూరం చేస్తోంది అని బాధపడుతుంది జ్ఞానాంబ.
ఆ జానకి వాడిని మార్చేసింది. తను వచ్చి సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే నా కొడుకును ఇంతలా మార్చేసింది అంటే.. తన చదువుకున్న తెలివి తేటలతో ముందు ముందు ఇంకెలా మార్చేస్తుందో. నా బిడ్డను ఈ అమ్మ నుంచి దూరం చేసినా చేసేస్తుంది అని భయపడుతుంది జ్ఞానాంబ.
రామా.. బర్త్ డే సందర్భంగా రెడీ అవుతుండగా.. కన్నబాబు రామాకు ఫోన్ చేస్తాడు. ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతాడు రామా. దీంతో గడువు దగ్గర పడుతోందని గుర్తు చేయడానికి ఫోన్ చేశాను అని అంటాడు కన్నబాబు. గడువులోగా నేను చెల్లిస్తా అని చెప్పా కదా అంటాడు రామా.
దీంతో నీ మాటల్లో భయం తప్ప ధైర్యం కనిపించడం లేదు అంటాడు కన్నబాబు. నువ్వు గడువులోపు డబ్బులు కట్టాలంటే.. మీ అమ్మను డబ్బులు అడగాలి.. లేదంటే ఏదైనా అద్భుతం జరగాలి.. ఈ రెండింట్లో ఏ ఒక్కటి జరగదు కానీ.. మా అమ్మ పేరు మీద బోర్డు రాయించేస్తున్నాను అంటాడు కన్నబాబు.
దీంతో నీ డబ్బు నీ మొహాన కొడతాను. నీ నీడను కూడా మా కొట్టు మీద పడకుండా చేస్తాను అని చెప్పి కోపంతో ఫోన్ కట్ చేస్తాడు రామా. ఇదంతా జానకి వింటుంది. రామాను సముదాయించి.. మీరు ఫుడ్ కాంపిటిషన్ కు వెళ్తేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది అని చెబుతుంది జానకి.
అందుకే.. లూసీకి ఫోన్ చేసి.. ఫుడ్ కాంపిటిషన్ కు దరఖాస్తు చేస్తా అని చెబుతుంది. కానీ.. అమ్మ ఒప్పుకోలేదు కదా అని అంటాడు రామా. అత్తయ్య గారితో ఈ విషయం గురించి మరోసారి మాట్లాడుదాం అంటుంది జానకి. ఆమెకు అర్థం అయ్యేలా చెప్పి మాట్లాడుదాం అంటుంది జానకి.
రామా పుట్టిన రోజు సందర్భంగా జ్ఞానాంబ ప్రత్యేక పూజ నిర్వహిస్తుంది ఇంట్లో. దీంతో అందరు బంధువులు వస్తారు. మరోవైపు లూసీ.. జానకికి ఫోన్ చేసి చెబుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిందని.. తన దగ్గర ఒకటే అప్లికేషన్ ఫామ్ ఉందని.. వెంటనే వచ్చి నింపాలని చెబుతుంది.
తన ఫోన్ లో మాట్లాడుతుండగా జ్ఞానాంబ చూసి జానకిని తిడుతుంది. పూజారి గారు వచ్చే టైమ్ అయింది. వెళ్లి మిగితా ఏర్పాట్లు చూడు అంటుంది జ్ఞానాంబ. వెంటనే వెళ్లి దరఖాస్తు నింపాలని అనుకుంటుంది. అదే విషయం వెళ్లి రామాకు చెబుతుంది జానకి.
ఇంతలో జ్ఞానాంబ వచ్చి రామా అని పిలుస్తుంది. ఇంతలో జానకి కాలు జారుతుంది. దీంతో రామా పట్టుకుంటాడు. ఇద్దరూ కౌగిలించుకొని ఉండటం చూసి జ్ఞానాంబ షాక్ అవుతుంది. నా మాటంటే అస్సలు లెక్క లేకుండా పోయిందా నీకు అంటుంది.
పూజ అయిపోయే వరకు ఎంత నియమ నిష్టలతో ఉండాలో నీకు చిలక్కు చెప్పినట్టు చెప్పాను అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత రేపు ఉదయం వరకు మీరు ఇంట్లోనే ఉండాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మం దాటకూడదని పూజారి గారు చెప్పారని అంటుంది జ్ఞానాంబ. దీంతో జానకి, రామా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
This website uses cookies.