Home » Entertainment » Rr And Sarkaru Vari Pata Collection Update News
Entertainment

Dil Raju : ‘ఆర్ఆర్ఆర్’, ‘సర్కారు వారి పాట’ వసూళ్ళు నిజం కాదా..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 22, 2022, 11:00 am
Advertisement

Dil Raju: ‘ఆర్ఆర్ఆర్’, ‘సర్కారు వారి పాట’ వసూళ్ళు నిజం కాదా..? తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్స్ చూస్తే అందరూ ఇదే అనుకుంటున్నారు. ఆయన నిర్మాణంలో ఎఫ్ 3 సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్‌గా ఎఫ్ 3 రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఇందులో విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు.

Advertisement

rr and sarkaru vari pata collection update news

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా – మెహ్రీన్ పిర్జాదా వెంకీ, వరుణ్‌లకు జంటగా నటించారు. కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఇందులో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనుంది. ఇప్పటికే, పూజా ఐటెం సాంగ్ వచ్చి ఆకట్టుకుంది కూడా. ఇక ఈ సినిమాను ఈ నెల 27 న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే, సాంగ్స్ హిట్ అని ప్రూవ్ చేసుకున్నాయి.

Advertisement

Dil Raju: ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజుసంచలన వ్యాఖ్యలను చేశారు. డిస్ట్రిబ్యూటర్ గా మాకు వచ్చిన లెక్కలు మేము ఆయా చిత్రాల నిర్మాతలకు అందిస్తాము. కానీ ఆ లెక్కలను వారు ఎంత
అనౌన్స్ చేసుకోవాలి..? అనేది వారి ఇష్టమే..మాకు సంబంధం ఉండదు అన్నారు. దాంతో ఇటీవల వచ్చిన పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్, తాజాగావచ్చిన సర్కారు వారి పాట సినిమాల వసూళ్లు నిజం కాదా అనే సందేహాలు చాలామందిలో కలుగుతున్నాయి. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.
దీనిపై మిగతా మేకర్స్ ఏమంటారో చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి