Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 30 మే 2022 ఎపిసోడ్ 310 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామా, జానకి ఇద్దరూ ఎలా హైదరాబాద్ వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు వీళ్లను ఎలా హైదరాబాద్ పంపించాలా అని ఆలోచిస్తుంటాడు గోవిందరాజు. జ్ఞానాంబను ఒప్పించేందుకు తెగ ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో అటుకుల చిట్టిబాబు.. రామాకు ఫోన్ చేసి.. ఒకసారి మీ అమ్మగారికి ఫోన్ ఇవ్వు అంటాడు. తను తీసుకుంటుంది. పెళ్లి క్యాన్సిల్ అయింది. మళ్లీ ముహూర్తం పెట్టుకున్నప్పుడు ఫోన్ చేస్తా అంటాడు చిట్టిబాబు. దీంతో సరే అంటుంది జ్ఞానాంబ. ఆ విషయం విని గోవిందరాజు సంతోషం వ్యక్తం చేస్తాడు. ఇక.. రామా, జానకి పెళ్లికి వెళ్లడానికి లైన్ క్లియర్ అయింది అంటాడు గోవిందరాజు.
జ్ఞానం.. స్వీట్ల ఆర్డర్ ఎలాగూ క్యాన్సిల్ అయింది కాబట్టి రామా, జానకి ఇద్దరినీ వైజాగ్ కు పెళ్లికి పంపిద్దాం అంటాడు గోవిందరాజు. దీంతో సరే అంటుంది జ్ఞానాంబ. మరోవైపు చిట్టిబాబు ఇచ్చిన లక్ష రూపాయలు ఎలాగైనా అత్తయ్య గారి నుంచి తీసుకోవాలని వెళ్లి అత్తయ్య గారు.. ఆ లక్ష రూపాయలు ఇస్తే వెళ్లి చిట్టిబాబుకు ఇస్తా అంటుంది మల్లిక. దీంతో ఆ చిట్టిబాబు నీకు తెలుసా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో అతడిని పంపించిందే నేను కదా అని నోరు జారుతుంది మల్లిక. దీంతో జ్ఞానాంబతో పాటు అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత అతడు వచ్చి జ్ఞానాంబ గారు ఎక్కడున్నారు అని అడిగితే నేనే లోపలికి పంపించాను అని చెబుతుంది మల్లిక.
ఆ తర్వాత అతడు మళ్లీ ముహూర్తం పెట్టుకున్నాక చెప్తా అన్నాడు. ఒకవేళ పెళ్లి క్యాన్సిల్ అయితే అతడే వచ్చి డబ్బులు తీసుకెళ్తాడులే అని చెబుతుంది జ్ఞానాంబ. ఆ తర్వాత సునంద, కన్నబాబు ఇద్దరూ జ్ఞానాంబ ఇంటికి వస్తారు. జ్ఞాన ప్రసుమాంబ అని పిలుస్తుంది.
తన మాట విని అందరూ అక్కడికి వస్తారు. కన్నబాబు, సునంద ఇద్దరూ వస్తారు. అసలు.. వీళ్లెందుకు వచ్చారు ఇప్పుడు అని అనుకుంటాడు గోవిందరాజు. దీంతో తాము స్వీట్ షాపు ఓపెన్ చేస్తున్నామని.. మీరు అంతా తప్పకుండా రావాలని స్వీట్ బాక్స్ తో పాటు ఆహ్వాన పత్రికను జ్ఞానాంబకు అందిస్తుంది సునంద.
షాపు కూడా మీ షాపు పక్కనే పెడుతున్నామని.. వచ్చే సోమవారం తప్పకుండా రావాలని చెబుతుంది. సునంద స్వీట్స్ ఓపెనింగ్ అని చెబుతుంది. మొదటి ఆహ్వాన పత్రిక మీకే ఇస్తున్నాం అని చెబుతుంది సునంద. మీరు తప్పకుండా రావాలి అంటుంది.
మరోవైపు షాపు.. సునంద సొంతం కాకుండా ఉండటానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు రామా, జానకి. అయినా మీరు చెఫ్ పోటీలకు వెళ్తున్నారు కదా. మీరు ఖచ్చితంగా గెలుస్తారు అంటుంది జానకి. కానీ.. డబ్బులు ఎలా కట్టాలి అని ఆలోచిస్తుండగా అప్పుడే అక్కడికి గోవిందరాజు వస్తాడు. హైదరాబాద్ గురించి మాట్లాడుతుంటే దొంగచాటుగా మల్లిక వింటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్లో కూడా…
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
This website uses cookies.