Anil Ravipudi – Koratala Siva : ఒక్క ఫ్లాప్‌తో ఇన్నేళ్ళ క్రెడిట్ కరిగినట్టేనా..?

Advertisement
Advertisement

Anil Ravipudi – Koratala Siva : ఒకే ఒక్క ఫ్లాప్ ప్రతీ డైరెక్టర్‌ను డైలమాలో పడేస్తుంది. వరుసగా సక్సెస్‌లు అందుకున్న దర్శకుడెవరైనా ఫ్లాప్ వస్తుందని కోరుకోడు..ఊహించడు. కానీ, ఆయన చేసే సినిమాల ప్రభావం జనాలపై ఎక్కువగా ఉండి అధికంగా అంచనాలు పెరగడం..కథలో కొత్తదనం లేకపోవడం..కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కావడం లాంటి అనేక కారణాల వల్ల ఫ్లాప్ చూడాల్సి వస్తుంది. నాలుగు హిట్స్ ఇచ్చిన దర్శకుడు కూడా ఒక్క ఫ్లాప్ పడితే కాస్త కంగారు పడిపోతారు. గతంలో సాధించిన సక్సెస్‌లను పక్కన పెట్టి ప్రస్తుతం వచ్చిన ఫ్లాప్‌ను పట్టుకొని కామెంట్స్ చేసేయడం మొదలైపోతుంది.

Advertisement

ఇప్పుడు అలాంటి ఒక్క ఫ్లాప్‌తో డైలమాలో పడ్డారు ఇద్దరు దర్శకులు. వారే కొరటాల శివ – అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడు విషయానికొస్తే..పటాస్ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాలో కామెడితో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా అన్నీ వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కింది. దాంతో వరుసగా సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. దాంతో టాలీవుడ్‌లో అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు. నిర్మాతలు, హీరోలు ఆయనతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే, మొదటిసారి అనిల్ రావిపూడికి ఎఫ్ 3 రూపంలో ఫ్లాప్ వచ్చిందని అంటున్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్ డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇది అనిల్ ఫస్ట్ ఫెల్యూర్ అంటున్నారు.

Advertisement

Anil Ravipudi Koratala Siva Years of credit with a single Flap‌

Anil Ravipudi – Koratala Siva : ‘సక్సెస్ ఫుల్ డైరెక్టర్’ అనే ట్యాగ్‌ను మిస్ చేసుకున్నారు.

ఇక కొరటాల శివకు ఆచార్య ముందు వరకు ఫ్లాప్ అంటే ఏంటో తెలీదనే చెప్పాలి. మంచి రచయిగా హీరోల వద్ద నిర్మాతల వద్ద పేరు తెచ్చుకున్న కొరటాల శివ పోసాని కృష్ణ మురళి సపోర్ట్‌తో దర్శకుడిగా మారాడు. ప్రభాస్‌తో ఆయన తీసిన మిర్చి భారీ కమర్షియల్ సక్సెస్ సాధించింది. ప్రేమిస్తే పోయిందేముంది డ్యూడ్ మహా అయితే తిరిగి ప్రేమిస్తారు..అనే మెసేజ్ ఇచ్చి భారీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చేసి వరుసగా భారీ హిట్స్ అందుకున్నాడు. కానీ, మెగా మల్టీస్టారర్‌గా వచ్చిన ఆచార్య మాత్రం పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఇలాంటి ఫ్లాప్ కొరటాల నుంచి వస్తుందని ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. ఈ రకంగా అటు కొరటాల, ఇటు అనీల్ రావిపూడి కెరీర్‌లో ఫస్ట్ ఫ్లాప్ చూసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనే ట్యాగ్‌ను మిస్ చేసుకున్నారు.

Advertisement

Recent Posts

Cashews : ప్రతిరోజు జీడిపప్పు తీసుకుంటే బరువు పెరుగుతారా లేక తగ్గుతారా… ఈ ముఖ్య విషయాలు మీకోసమే…??

Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…

58 mins ago

Rashmika Mandanna : నా మొగుడు అతనే.. రష్మిక కూడా ఓపెన్ అయ్యిందిగా.. నెక్స్ట్ ఇయర్ పెళ్లేనా..?

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…

2 hours ago

Cinnamon Tea : దాల్చిన చెక్క టీ లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే… అస్సలు వదలరు…??

Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…

3 hours ago

Margashira Masam : మార్గశిర మాసంలో ఈ రాశుల వారికి సంపద మూటలను అందించనున్న కుబేరుడు…!

Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…

4 hours ago

CDAC Project Enginee : సీడ్యాక్‌లో 98 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు

CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న 98 పోస్టుల…

5 hours ago

Utpanna Ekadashi : నేడే ఉత్పన్న ఏకాదశి… ఈ శుభ సమయంలో ఈ దానాలు చేస్తే..

Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…

6 hours ago

Maharashtra : చరిత్రలో తొలిసారి.. ప్రతిపక్ష నాయ‌కుడు లేని మహారాష్ట్ర

Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…

15 hours ago

Ajit Pawar : మ‌హారాష్ట్ర సీఎంను డిసైడ్ చేయ‌డంలో కీల‌కంగా ఎన్సీపీ అధినేత‌ అజిత్ ప‌వార్‌

Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే…

16 hours ago

This website uses cookies.