Janaki Kalaganaledu : తన కొట్టునే సునంద స్వాధీనం చేసుకుంటోందని జ్ఞానాంబకు తెలుస్తుందా? రామా, జానకి వల్లనే ఇదంతా జరిగిందని జ్ఞానాంబకు తెలుస్తుందా?

Authored By Varun G | The Telugu News | Published on: May 28, 2022, 11:30 am

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 30 మే 2022 ఎపిసోడ్ 310 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామా, జానకి ఇద్దరూ ఎలా హైదరాబాద్ వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు వీళ్లను ఎలా హైదరాబాద్ పంపించాలా అని ఆలోచిస్తుంటాడు గోవిందరాజు.  జ్ఞానాంబను ఒప్పించేందుకు తెగ ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో అటుకుల చిట్టిబాబు.. రామాకు ఫోన్ చేసి.. ఒకసారి మీ అమ్మగారికి ఫోన్ ఇవ్వు అంటాడు. తను తీసుకుంటుంది. పెళ్లి క్యాన్సిల్ అయింది. మళ్లీ ముహూర్తం పెట్టుకున్నప్పుడు ఫోన్ చేస్తా అంటాడు చిట్టిబాబు. దీంతో సరే అంటుంది జ్ఞానాంబ. ఆ విషయం విని గోవిందరాజు సంతోషం వ్యక్తం చేస్తాడు. ఇక.. రామా, జానకి పెళ్లికి వెళ్లడానికి లైన్ క్లియర్ అయింది అంటాడు గోవిందరాజు.

janaki gets shocked by sunandha and kanna babu visit in janaki kalaganaledu

janaki gets shocked by sunandha and kanna babu visit in janaki kalaganaledu

జ్ఞానం.. స్వీట్ల ఆర్డర్ ఎలాగూ క్యాన్సిల్ అయింది కాబట్టి రామా, జానకి ఇద్దరినీ వైజాగ్ కు పెళ్లికి పంపిద్దాం అంటాడు గోవిందరాజు. దీంతో సరే అంటుంది జ్ఞానాంబ. మరోవైపు చిట్టిబాబు ఇచ్చిన లక్ష రూపాయలు ఎలాగైనా అత్తయ్య గారి నుంచి తీసుకోవాలని వెళ్లి అత్తయ్య గారు.. ఆ లక్ష రూపాయలు ఇస్తే వెళ్లి చిట్టిబాబుకు ఇస్తా అంటుంది మల్లిక. దీంతో ఆ చిట్టిబాబు నీకు తెలుసా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో అతడిని పంపించిందే నేను కదా అని నోరు జారుతుంది మల్లిక. దీంతో జ్ఞానాంబతో పాటు అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత అతడు వచ్చి జ్ఞానాంబ గారు ఎక్కడున్నారు అని అడిగితే నేనే లోపలికి పంపించాను అని చెబుతుంది మల్లిక.

ఆ తర్వాత అతడు మళ్లీ ముహూర్తం పెట్టుకున్నాక చెప్తా అన్నాడు. ఒకవేళ పెళ్లి క్యాన్సిల్ అయితే అతడే వచ్చి డబ్బులు తీసుకెళ్తాడులే అని చెబుతుంది జ్ఞానాంబ. ఆ తర్వాత సునంద, కన్నబాబు ఇద్దరూ జ్ఞానాంబ ఇంటికి వస్తారు. జ్ఞాన ప్రసుమాంబ అని పిలుస్తుంది.

Janaki Kalaganaledu : స్వీట్ షాపు ఓపెనింగ్ కు జ్ఞానాంబను పిలిచిన సునంద

తన మాట విని అందరూ అక్కడికి వస్తారు. కన్నబాబు, సునంద ఇద్దరూ వస్తారు. అసలు.. వీళ్లెందుకు వచ్చారు ఇప్పుడు అని అనుకుంటాడు గోవిందరాజు. దీంతో తాము స్వీట్ షాపు ఓపెన్ చేస్తున్నామని.. మీరు అంతా తప్పకుండా రావాలని స్వీట్ బాక్స్ తో పాటు ఆహ్వాన పత్రికను జ్ఞానాంబకు అందిస్తుంది సునంద.

షాపు కూడా మీ షాపు పక్కనే పెడుతున్నామని.. వచ్చే సోమవారం తప్పకుండా రావాలని చెబుతుంది. సునంద స్వీట్స్ ఓపెనింగ్ అని చెబుతుంది. మొదటి ఆహ్వాన పత్రిక మీకే ఇస్తున్నాం అని చెబుతుంది సునంద. మీరు తప్పకుండా రావాలి అంటుంది.

మరోవైపు షాపు.. సునంద సొంతం కాకుండా ఉండటానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు రామా, జానకి. అయినా మీరు చెఫ్ పోటీలకు వెళ్తున్నారు కదా. మీరు ఖచ్చితంగా గెలుస్తారు అంటుంది జానకి. కానీ.. డబ్బులు ఎలా కట్టాలి అని ఆలోచిస్తుండగా అప్పుడే అక్కడికి గోవిందరాజు వస్తాడు. హైదరాబాద్ గురించి మాట్లాడుతుంటే దొంగచాటుగా మల్లిక వింటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp