Janaki Kalaganaledu 1 Nov Today Episode : జానకి ఐపీఎస్ అయ్యాక తన తొలి కేసు అఖిల్ దేనా. డ్రగ్స్ అమ్ముతూ జానకికి అడ్డంగా అఖిల్ దొరికిపోతాడా? ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?

Janaki Kalaganaledu 1 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 నవంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 1422 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పదా.. హాస్పిటల్ కు తీసుకెళ్తే అప్పుడు తెలుస్తుంది అని జ్ఞానాంబ.. మల్లికతో అంటుంది. దీంతో నాకు హాస్పిటల్ అంటే పడదు అని ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవాలని అనుకుంటుంది. దీంతో డాక్టర్ నే ఇంటికి పిలువు జానకి అంటాడు గోవిందరాజు. దీంతో వామ్మో.. ఎలాగైనా నా కడుపు గురించి అసలు విషయం తెలుస్తుందనుకొని వెంటనే వద్దు అత్తయ్య గారు.. నేనే అసలు విషయం చెబుతాను అని అత్తయ్య గారు ముందు కడుపు వచ్చింది కానీ.. తర్వాత అది కడుపు కాదని తెలిసింది అని అంటుంది మల్లిక. మీరు వారసుడు వస్తున్నాడని అనుకున్నారు కదా. అందుకని మీరు బాధపడతారని అసలు విషయం చెప్పలేదు అత్తయ్య గారు అంటుంది మల్లిక. కడుపు అని అబద్ధం చెప్పి ఇంట్లో అందరి మనోభావాలతో ఆడుకున్న నిన్ను అస్సలు వదిలిపెట్టేది లేదు అంటుంది జ్ఞానాంబ. విష్ణుకు చాలా కోపం వస్తుంది. నీ ద్వారా ఇంటికి వారసుడు రాబోతున్నాడని అమ్మ ఎంత సంబరపడిపోయిందో తెలుసా. ఈ ఇంట్లో నీకు ఎలాంటి లోటు జరగకూడదని చెప్పి మేము ఎంత ఆరాటపడ్డామో తెలుసా? ఎందుకు మల్లిక మా అందరి మనసులతో ఆడుకున్నావు అంటాడు రామా.

janaki kalaganaledu 01 november 2022 full episode

చివరకు చికిత కూడా మల్లికను అంటుంది. మామూలుగా తింటే ఇంట్లో ఎవరైనా వద్దంటారా? తినడం కోసం కడుపు వచ్చిందని చెప్పాలా అంటుంది చికిత. ఇంకా దీనితోటి మాటలు ఏంటి.. వెళ్లు ఇంట్లో నుంచి వెళ్లు. వెళ్లి మీ అమ్మానాన్నను తీసుకొనిరా అంటూ ఇంట్లో నుంచి గెంటేస్తాడు విష్ణు. దీంతో వద్దండి.. నన్ను ఇంట్లో నుంచి పంపించకండి అంటూ అతడి కాళ్లను పట్టుకొని వేడుకుంటుంది. అయితే.. అదంతా కల. నిజం కాదు. ఇదంతా కలా అని అనుకుంటుంది మల్లిక. మరోవైపు మాల్ కొనడానికి రూ.10 వేలు ఎలా తీసుకురావాలి అని తెగ ఆలోచిస్తూ ఉంటాడు అఖిల్. ఇంతలో అఖిల్ ను చూసి ఏంటి అఖిల్ ఇంత పొద్దున్నే రెడీ అయ్యావు. టెన్షన్ పడుతున్నావు ఎందుకు అని అడుగుతుంది. ఇంతలో అఖిల్ కు తన మెడ మీద ఉన్న గోల్డ్ చైన్ కనిపిస్తుంది. దీంతో ఎలాగైనా జెస్సీ మెడలోని చైన్ ను క్యాష్ చేసుకోవాలి అని అనుకుంటాడు అఖిల్. దీంతో నువ్వు, వదిన చెప్పింది కరెక్టే. అందుకే ఒక షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరుదామనుకుంటున్నా. కానీ.. ఫీజు పే చేయడానికి డబ్బులు కావాలి అంటాడు. దానికోసమే పార్ట్ టైమ్ జాబ్ లో చేరా అంటాడు.

ఇంతలో అక్కడికి వచ్చిన జానకి.. నిన్ను చదువుకొని లైఫ్ లో సెటిల్ అవ్వు అంటే మధ్యలో ఈ పార్ట్ టైమ్ జాబ్ ఏంటి అఖిల్ అని అడుగుతుంది జానకి. దీంతో వద్దు అనకు వదిన. నాకు నువ్వే ఇన్సిపిరేషన్. నీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి వదిన అంటాడు. ఇంతలో అఖిల్.. ఈ చైన్ తీసుకొని కోర్సు ఫీజు కట్టు అని అంటుంది జెస్సీ.

దీంతో చైన్ ఎందుకు.. మీ అన్నయ్యను అడిగి డబ్బులు అరేంజ్ చేస్తాను అంటుంది జానకి. దీంతో వద్దు వదిన. అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకుంటే రిలాక్స్ అవుతాను. అందుకే.. నేనే కష్టపడతాను అంటాడు. ఇంతలో అఖిల్ ఆగు.. నాదగ్గర ఒక 5000 ఉన్నాయి. అవి కూడా ఇస్తాను అంటుంది. దీంతో వద్దు వదిన అన్నా కూడా వినదు. పర్లేదు తీసుకో అంటుంది జానకి.

Janaki Kalaganaledu 1 Nov Today Episode : పెద్దమ్మ గారు పిలుస్తున్నారని మల్లికను పిలిచిన చికిత

మరోవైపు మల్లిక.. తన కడుపు విషయాన్ని పోలేరమ్మకు జానకి చెప్పిందా అని టెన్షన్ పడుతుంది మల్లిక. ఈరోజు గదిలో నుంచి బయటికి వెళ్లకూడదు. ఏం చేయాలి అని అనుకుంటుంది మల్లిక. చెద్దరు కప్పుకొని తన రూమ్ లో కూర్చొంటుంది. దీంతో అక్కడికి వచ్చిన చికిత.. ఉండండి మీ పని చెబుతా అని మంచం పైకి ఎక్కి తను కప్పుకున్న దుప్పటిని తీసి మల్లికమ్మ గారు అంటుంది.

దీంతో ఏంటి అంటుంది. దీంతో పెద్దమ్మ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అంటుంది చికిత. దీంతో అత్తయ్య గారు నన్ను పిలుస్తున్నారా.. ఎందుకు అని అడుగుతుంది మల్లిక. ఏమోనండి.. కోపంగా మాత్రం ఉన్నారు అంటుంది చికిత. వామ్మో.. జానకి ఆ విషయం చెప్పేసిందా ఏంటి అని అనుకుంటుంది మల్లిక.

ఎంత చెప్పినా చికిత వినకుండా.. తనను జ్ఞానాంబ దగ్గరికి తీసుకెళ్తుంది. బయట జ్ఞానాంబ కోపంగా ఉంటుంది. అక్కడే జానకి, గోవిందరాజు కూడా ఉంటారు. రాత్రి నాకు వచ్చిన కల నిజమయ్యేలా ఉంది అని అనుకుంటుంది మల్లిక. ఏంటి అత్తయ్య గారు రమ్మన్నారట అంటుంది మల్లిక.

దీంతో తమరి గురించి తెలిసింది కదా అమ్మ. అందుకే మాట్లాడాలి రమ్మన్నారు అంటాడు గోవిందరాజులు. అంటే నాది దొంగ కడుపు అని జానకి చెప్పేసిందన్నమాట అని అనుకుంటుంది మల్లిక. ఇన్నాళ్లు నిన్ను అడగకుండానే అన్నీ సమకూర్చాలని ఆరాటపడ్డాను. నిన్ను శ్రమ పెట్టకుండా, ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆలోచించాను.

కానీ.. నీ కడుపులో ఉన్నది వేరు.. బయట నిజం వేరు అనేది అర్థం అయ్యాక.. నీకోసం ఇంత తాపత్రయపడినందుకు బాధ అనిపించింది. కోపం వచ్చింది. ఆ విషయమే నీతో మాట్లాడాలని పిలిచాను అంటుంది జ్ఞానాంబ. దీంతో మల్లికకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మరోవైపు అఖిల్ మాల్ తీసుకొని అమ్మడానికి ప్రయత్నిస్తుంటాడు. జానకి ఐపీఎస్ చార్జ్ తీసుకోబోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

2 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

2 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

2 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

2 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

2 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

3 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

3 weeks ago