Janaki Kalaganaledu 06 September 2022 Episode : అఖిల్ ప్రేమ విషయాన్ని జ్ఞానాంబకి చెప్పేసిన జానకి.. నన్ను క్షమించు అంటున్న అఖిల్…!

Janaki Kalaganaledu 06 September 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఈ సీరియల్ తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 382 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… చికిత, మల్లికని మీరు అసలు గర్భవతులేనా అని అడుగుతుంది. అప్పుడు మల్లికా అదేంటే అలా అంటున్నావు అని అనగా… చికిత అప్పుడు అంటే కడుపుతో ఉన్నవాళ్లు కి ఏమీ తినబుద్ధి కాదు, వాంతులు అవుతూ ఉంటాయి. కానీ మీకేం మీరేమో కుంభల కుంబాలు తింటున్నారు అని అంటుంది. అప్పుడు మల్లికా ఒక్కొక్కళ్ళ శరీరం ఒకొక్క లాగా ఉంటుంది. అని అంటుంది. అప్పుడు జానకి వచ్చి చికితాన్ని అఖిల్ ఎక్కడున్నారు. అని అడుగుతుంది. అప్పుడు అఖిల్ బాబు రూమ్ లోనే ఉన్నాడని చికిత చెప్తుంది. అప్పుడు జానకి అఖిల్ దగ్గరికి వెళ్లి నేను చెప్పింది ఏం చేశావు అని అడుగుతూ ఉంటుంది. అంతలో జ్ఞానాంబ అందరికీ బట్టలు తీసుకొచ్చి పిలిచి ఇస్తూ ఉంటుంది. అందరూ ఆ బట్టలను చూసుకుంటూ సంబర్ పడిపోతూ ఉంటారు. కానీ జానకి అఖిల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.

మల్లిక వాళ్ళిద్దరిని గమనిస్తూ ఏమై ఉంటుంది.. ఫాలో అవుదాం అని అనుకుంటూ ఉంటుంది. అంతలో జెసి జానకి కి ఫోన్ చేసి వాళ్ళ అమ్మానాన్న గురించి చెప్పి అఖిల్ పేరు చెప్పానని, వాళ్ళిద్దరూ ఆవేశంగా ఇప్పుడు మీ ఇంటికి బయలుదేరారు అని చెప్తుంది. అప్పుడు జానకి ఇప్పుడు ఎలా వాళ్ళు ఇక్కడికి వస్తే పెద్ద గొడవ జరుగుతుంది. అదే గనుక జరిగితే నిన్ను అఖిల్ నీ ఒకటి చేసే అవకాశం ఇక ఉండదు అని అంటుంది. అదే భయంగా ఉంది అక్క అని జెసి చెప్తూ ఉండగా జానకి ఒక్కసారిగా ఫోన్ కట్ చేసి భయపడిపోతూ ఉంటుంది. వాళ్లని ఎలా ఆపాలి అని కంగారు పడుతూ ఉంటుంది. అంతలో రామ వచ్చి పక్క ఊర్లో ఒక పోలీస్ ఇంట్లో ఏం జరిగిందో చెపుతూ ఉంటాడు జానకికి, జానకి మాత్రం ఆ విషయం ఏమి పట్టించుకోకుండా వాళ్ల గురించి కంగారు పడుతూ ఉంటుంది. జెస్సి వాళ్ళ అమ్మానాన్న వచ్చేస్తారు. అప్పుడు జానకి జెసి పేరెంట్స్ మీరేనా నమస్కారం అండి నేను జ్ఞానాంబ పెద్ద కోడల్ని నేను చెప్పేది వినండి అని అంటుంది. అప్పుడు ఇక ఆగేదేం లేదు తేల్చుకుందాంమని వచ్చాము. మీ మరిది నా బేబీ నీ పెళ్లి చేసుకుంటారో లేరు అందరి ముందు అడుగుతాను అని ఆవేశపడుతూ ఉంటారు.

Janaki Kalaganaledu 06 September 2022 Full Episode

మీరు ఆవేశపడకుండా నేను చెప్పేది ఒకసారి వినండి. జరిగిన అనర్ధానికి కావలసింది ఆవేశం కాదమ్మా.. ఆలోచన అని అంటుంది. అప్పుడు వాళ్లు నా బిడ్డకి న్యాయం కావాలి అంటూ ఉంటారు. నాకు కొంత టైం ఇవ్వండి మీకు న్యాయం జరిగేలా చూస్తాను అని వాళ్ళకి సర్దు చెప్తూ ఉంటుంది. లేదమ్మా గొడవ జరగాల్సిందే.. మాకు ఏదో ఒకటి తేడాల్సిందే అని అంటూ ఉండగా. అయితే మీ ఇష్టం మరి అని గట్టిగా జానకి అంటుంది. అఖిల్ తో మీ బిడ్డ పెళ్లి జరగాలని అనుకుంటే ఆలోచించి ఇక్కడ నుంచి వెళ్లిపోండి. లేదు అనుకుంటే గొడవ చేయండి. అని అంటుంది. ఈ ఒక్కసారికి మీరు నా మాట వినండి అని బ్రతిమిలాడుతుంది వాళ్ళని. అప్పుడు సరే నీ మాట వింటాం అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మల్లిక ఇదంతా గమనిస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తర్వాత జానకి దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది. అంతలో అఖిల్ వస్తాడు జానకిని చూసి కంగారుపడుతూ ఫోన్ మాట్లాడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా… జానకి పిలుస్తుంది. అఖిల్ దగ్గరికి వెళ్లి జానకి అఖిల్ లాక్కొని వెళ్తూ ఉండగా.. మల్లిక అదంతా చూస్తూ గమనిస్తూ ఉంటుంది.

జానకి అఖిల్ ని పక్కకు తీసుకెళ్లి.. నువ్వు చేసిన తప్పు రోజు రోజుకి పెరుగి పెద్దవుతుంది. పెద్ద సమస్యగా మారుతుంది అది నీకు అర్థం కావడం లేదు.. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో చెప్పు అఖిల్ అని అడుగుతుంది. అప్పుడు అఖిల్ ఏమీ మాట్లాడ పోయేసరికి.. నేను ఇప్పుడే వెళ్లి మీ అన్నయ్యకి, అత్తయ్య గారికి చెప్తాను అని అంటుండగా.. అప్పుడు అఖిల్ వద్దు వదిన అమ్మకు తెలిస్తే నన్ను చంపేస్తుంది. అని ఏడుస్తూ ఏదో పొరపాటు జరిగింది. తొందరపడ్డాను జెసి ఒక్కసారిగా అలా చెప్పేసరికి నాకు భయమేసి తనని అబార్షన్ చేయించుకోమని చెప్పాను. ఏ సాక్ష్యం ఉండకూడదని నీ ఫోన్లో ఫోటోలు డిలీట్ చేశాను. అమ్మకి విషయం తెలిస్తే నేను నలుగురు ముందు తిరగలేను వదిన నా పరువు పోకుండా నువ్వే చూడు వదిన, నువ్వే నాకు హెల్ప్ చెయ్ వదిన.. అని అంటాడు. అప్పుడు జానకి వెంటనే అత్తయ్య గారితో మాట్లాడి మీ పెళ్లయితే చేయక తప్పదు పద వెళ్దాం అంటూ ఉండగా.. అఖిల్ వద్దు వద్దు అని అంటూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో తెలుసుకోవాల్సిందే…

Recent Posts

Coconut Oil : జిడ్డు వ‌ల‌న బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి..!

Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…

16 seconds ago

Gym : వ్యాయామ సమయంలో బిగుతైన దుస్తులు వేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో తెలుసా?

Gym  : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…

1 hour ago

Onions Black Spots : ఉల్లిపాయలపై నల్ల మచ్చలు.. నిపుణుల హెచ్చరిక..ఈ విష‌యంలో శ్రద్ధగా ఉండాలి..!

Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…

2 hours ago

Smartphone : రూ.15 వేల ధరలో బెస్ట్‌ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌… ఇది ట్రై చేయండి..!

Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…

3 hours ago

Tea BP : బీపీ ఉన్న వారు టీ తాగితే మంచిదేనా…ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి..!

Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…

4 hours ago

Varalakshmi Vratham : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం.. ఏయే నైవేధ్యాలు చేయాల‌ని ఆలోచిస్తున్నారా..?

Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…

5 hours ago

Pragya Jaiswal : బాబోయ్.. సెగ‌లు రేపుతున్న ప్ర‌గ్యా జైస్వాల్.. ఇంత అందమేంటి బాసు..!

Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ‌.. ప్ర‌గ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…

14 hours ago

Banakacherla Project : బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!

Banakacherla Project  : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…

15 hours ago