Home » Entertainment » Janaki Kalaganaledu 1 September 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 1 September 2022 Episode : జెస్సీ ని అబార్షన్ చేయించుకోమంటున్న అఖిల్… అంతా నేను చూసుకుంటా అని జెస్సి కి మాట ఇచ్చిన జానకి…

Authored By
aruna
The Telugu News | Published on: September 1, 2022, 10:30 am
Advertisement

Janaki Kalaganaledu 1 September 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు. ఈ సీరియల్ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 379 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. అఖిల్ రామ దగ్గర బండి తీసుకొని వెళ్తూ ఉంటాడు. జెసి వాళ్లు ఎప్పుడు కలుసుకునే ప్లేస్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతలో అఖిల్ అక్కడికి వస్తాడు. జెసి పరిగెత్తుకుంటూ అఖిల్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు జెసి అఖిల్ ని చూసి నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావని ఎదురుచూస్తున్నాను. మీ ఇంట్లో నువ్వు మాట్లాడావా.. ఏమన్నారు మన పెళ్లికి ఓకే అన్నారా అని అంటూ ఉంటుంది. అప్పుడు అఖిల్ నేను ఇంట్లో చాలా రకాలుగా చెప్పడానికి ట్రై చేశాను. కానీ ఒప్పుకోవడం లేదు. ఇప్పుడే కాదు అమ్మ మన పెళ్లికి ఎప్పటికీ ఒప్పుకోదు అని అంటాడు. అప్పుడు జెసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు అఖిల్ మన చదువు పూర్తయిన తర్వాత అమ్మని నేను ఏదో ఒకలాగా ఒప్పిస్తాను అని అంటాడు. అందుకే ఇప్పటికైతే నువ్వు అబార్షన్ చేయించుకో అని అంటాడు అఖిల్. అప్పుడు జెస్సి ఒక్కసారిగా షాక్ అయ్యి నువ్వు అలా అనొద్దు.. ఇంట్లో ఈ విషయం తెలిస్తే.. మా అమ్మ వాళ్ళు చావడమే, నన్ను చంపడం చేస్తారు. పెళ్లి కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఎంత చీప్ గా చూస్తారో అది అర్థం చేసుకో అఖిల్ చేయించుకోవడం కుదరదు..  మనం పెళ్లి చేసుకోవడం తప్ప వేరే దారి లేదు.. కావాలంటే నేను మీదే మీ అమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడుతాను. అని అంటుంది.

Advertisement

అప్పుడు నువ్వు ఎంత చెప్పినా అమ్మ ఒప్పుకోదు జెసి నువ్వు నన్ను ప్రేమించింది నిజమైతే నేను చెప్పింది ఒప్పుకో… లేదంటే నా చావే దీనికి పరిష్కారం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జెస్సి బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే రామ, జానకి కూరగాయలు కొంటూ ఉంటారు మార్కెట్లో. అంతలో రామ బ్యాంగిల్ షాప్ చూసి జానకికి బ్యాంగిల్స్ కొనడానికి వెళ్తాడు. జానకి కూరగాయలు తీసుకుంటూ ఉండగా అటువైపుగా జెస్సీ వస్తూ.. కారు వస్తున్నా చూసుకోకుండా పరధ్యానంగా వెళుతూ ఉంటుంది. అంతలో జానకి తన దగ్గరికి వెళ్లి లాగుతుంది. అప్పుడు జానకి ఏమైంది జెస్సి ఒక్క క్షణం లో ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా అని అంటుంది… అప్పుడు జెస్సి ఈ ప్రమాదమే కాదక్కా అఖిల్ అన్న మాటకి నా గుండె పగిలిపోయింది అక్క. అఖిల్ వల్ల నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అక్క అని జానకికి జరిగిందంతా చెబుతుంది. అప్పుడు జానకి ఒక్కసారిగా షాక్ అయ్యి నువ్వేం మాట్లాడుతున్నావ్ జెస్సీ ఇలా జరిగి ఉండదు. అప్పుడు ఇది అబద్దం అయితే బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుందిఅక్క. అప్పుడు జానకి తనకంటే బుద్ధి లేదు.. నీ బుద్ధి ఏమైంది అని తిడుతుంది. అఖిల్ ఎంత చెప్పినా వినలేదు అక్క. అఖిల్ నన్ను అబార్షన్ చేయించుకోమన్నాడు అక్క.. ఈ విషయం మా ఇంట్లో కూడా తెలిసింది అక్క నన్ను కొట్టారు అక్క ఎవరో చెప్పమని అంటున్నారు.. నువ్వు ఏదో ఒకటి చేయాలి అక్క ప్లీజ్ అని జానకిని బ్రతిమిలాడుతుంది. అప్పుడు జానకి కి సరే నువ్వేం బాధపడకు నేను ఏదో ఒకటి చేస్తానులే..

Janaki Kalaganaledu 1 September 2022 Full Episode

Advertisement

మీరిద్దరూ ప్రేమించుకున్నట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా.. ఆ ఫొటోస్ ని నాకు పంపించు అని.. సరే ఇలా నువ్వు నడుచుకుంటూ వెళ్లడం బాగోదు కానీ నువ్వు ఆటోలో వెళ్ళు అని అంటుంది. అప్పుడు రామ వచ్చి నాకు పెద్ద ఆర్డర్ వచ్చిందండి నేను కొట్టుకి వెళ్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళిపోనని జానకిని పంపిస్తాడు. అప్పుడు జానకి ఇంటికి వెళుతూ వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అఖిల్ కూడా ఇంటికి వస్తాడు. అప్పుడు జానకి అఖిల్ ని అఖిల్ ని కోపంగా పిలుస్తుంది. అప్పుడు కంగారుతో నేను పొద్దున్నుంచి ఏమీ తినలేదు వదిన బాగా ఆకలిగా ఉంది. తిని వచ్చి నీతో మాట్లాడతాను అని అంటాడు. అప్పుడు జానకి నువ్వు వచ్చి మాట్లాడిన తర్వాతనే నేను ఇంట్లోకి వస్తాను.. అని జానకి బయటినే వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ అఖిల్ మాత్రం తినేసి ఇంట్లో కూర్చుని అందరితో కలిసి క్యారమ్ ఆడుతూ సంతోషంగా గడుపుతూ ఉంటాడు. అందులో జానకి లోపలికి వచ్చి చూస్తుండగా అఖిల్ సంతోషంగా కేరమ్ ఆడుతూ ఉంటాడు. అప్పుడు జానకి అఖిల్ దగ్గరికి వచ్చి గల్లా పట్టుకొని లాగిపెట్టి ఒకటి ఇచ్చినట్టుగా కలకంటుంది. మల్లికా మాత్రం తింటూ ఈ కడుపు డ్రామా చేయబటికి నన్ను ఏ ఆట ఆడనివ్వడం లేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అంతలో అక్కడికి చికిత వచ్చి ఎప్పుడు తినడమేనా అలాంటి ఆటలు ఆడడమేన్న ఉందా అని ఉంటుంది. అప్పుడు గోవిందరాజు మల్లికపై సెటైర్ వేస్తూ ఉంటాడు. అంతలో జానకి రామ రావడం చూసి.. జ్ఞానాంబ వచ్చారా నువ్వు కూడా ఆడు.. రా అని రామ అని పిలుస్తుంది. కానీ జానకి కోపంగా చూస్తూ ఉంటుంది. అఖిల్ కూడా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు మీరు చూడాల్సిందే…

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి