janaki kalaganaledu 10 may 2022 full episode
Janaki Kalaganaledu 10 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 మే 2022, మంగళవారం ఎపిసోడ్ 297 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. షాపులో ఉంటాడు రామా. ఇంతలో క్యారేజ్ తీసుకొని జానకి వస్తుంది. ఇంతలో వెన్నెల కూడా వస్తుంది. మదర్స్ డే గురించి ఓ పిల్లాడి ద్వారా తెలుసుకున్న రామా.. అమ్మను పూజించడానికి ఒక్క రోజు ఏంటి.. అమ్మను ప్రతిక్షణం గుండెల్లో పెట్టుకొని పూజిస్తూనే ఉండాలి అంటాడు రామా. అప్పుడే కదా అమ్మ మనకు ఇచ్చిన ఈ జన్మకు.. అమ్మ మనకోసం చేసిన త్యాగాలకు రుణం తీర్చుకునేది అంటుంది జానకి. మీరు చెప్పిన ప్రతి మాట అక్షరాలా నిజం రామా గారు అంటుంది జానకి. ప్రతిక్షణం.. అమ్మను గుండెల్లో పెట్టుకొని పూజించాలి అంటుంది జానకి.
janaki kalaganaledu 10 may 2022 full episode
అందరికీ అందమైన ఒక జ్ఞాపకంలా గుర్తుండిపోయేందుకు ఒక రోజును పెట్టుకున్నారు అంటుంది జానకి. అందుకే.. మనం కూడా మన ఇంట్లో మదర్స్ డే వేడుకలను జరుపుకుందాం. అత్తయ్య గారి కోసం ఒక వేడుక అంటే మనకు అంత కన్నా గొప్ప విషయం ఇంకేం ఉంటుంది అంటుంది జానకి. రామా గారు మన ఇల్లు కొన్ని రోజులుగా సంతోషానికి దూరం అయింది. ఈ మదర్స్ డే వేడుకతో తిరిగి ఆసంతోషం వస్తుంది అంటుంది జానకి. వెన్నెల కూడా చేద్దాం అంటుంది. రామా కూడా ఓకే అంటాడు. కట్ చేస్తే మల్లిక వంట వండుతూ ఉంటుంది. రామా.. ఎందుకు ఫైనాన్స్ ఆఫీసుకు వెళ్లాడో దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది మల్లిక.
మిక్సీలో ఏదో పడుతూ అలాగే మరిచిపోతుంది. దీంతో మిక్సీ నుంచి పొగలు వస్తాయి. దీంతో ఏమైందని జ్ఞానాంబ కిచెన్ లోకి వెళ్లి మల్లికపై సీరియస్ అవుతుంది. దీంతో మిక్సీ పాడు అయితే ఏంటి.. రుబ్బురోలు ఉంది కదా అని రుబ్బురోలు దగ్గరికి మల్లికను తీసుకొస్తుంది జ్ఞానాంబ.
ఇందులో రుబ్బి గారెలు చేసి పెట్టు సరేనా అంటుంది జ్ఞానాంబ. దీంతో మల్లిక షాక్ అవుతుంది. ఇప్పుడు సంతోషంగా ఉంది కదా అమ్మ అంటుంది జ్ఞానాంబ. చాలా సంతోషంగా ఉంది అంటుంది మల్లిక. సంతోషంలో కన్నీళ్లు కూడా వస్తున్నాయి అంటుంది మల్లిక.
రాత్రి అవుతుంది. మరోవైపు మల్లికను అందరూ పిలుస్తారు. రేపు మదర్స్ డే కదా.. మనం ఇంట్లో వేడుక చేద్దాం అని జానకి మల్లికతో చెబుతుంది. మనం ఇంట్లో మదర్స్ డే వేడుకలు చేస్తున్నట్టు జ్ఞానాంబకు తెలియకూడదని అందరూ చెబుతారు.
తర్వాత గోవింద రాజుకు కూడా ఈ విషయం చెబుతారు రామా, జానకి. దీంతో సూపర్ ఆలోచన అంటాడు గోవింద రాజు. ఇంతలో జ్ఞానాంబ డోర్ తీసుకొని బయటికి వస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంకా పడుకోకుండా ఏంటి అందరూ ముచ్చట్లు పెడుతున్నారు. వెళ్లి పడుకోండి అంటుంది జ్ఞానాంబ.
జ్ఞానం.. రేపు నువ్వు కాస్త ఉదయాన్నే లేవాలి.. పదా వెళ్దాం పడుకుందాం అంటాడు గోవింద రాజు. దీంతో ఎందుకు అంటుంది జ్ఞానాంబ. రేపు ఉదయాన్నే నువ్వు నాకు కాఫీ పెట్టి ఇవ్వాలి అంటాడు గోవింద రాజు. మరోవైపు కన్నబాబు సునందకు అసలు విషయం చెబుతాడు.
డాక్యుమెంట్ల మీద రామా సంతకం పెట్టించానని అంటాడు. మనం వాళ్లను మోసం చేసి ఆ స్వీటు షాపును లాక్కోబోతున్నాను అంటాడు కన్నబాబు. ఈ మధ్య ఆ రామచంద్ర వాళ్ల అమ్మకు తెలియకుండా లక్ష రూపాయలు అప్పు చేశాడు.. అని చెబుతాడు.
10 రోజుల్లో అప్పు తీర్చకపోతే.. ఆ స్వీటు షాపు మన సొంతం అని ఈ పేపర్ లో రాయించి వాడితో సంతకం పెట్టించాను అంటాడు. ఆ స్వీటు షాపు మన సొంతం కాకుండా అస్సలు ఆపలేడు అంటాడు కన్నబాబు. మనది అంతా కాంట్రాక్ట్ బిజినెస్ కదా. ఆ స్వీటు షాపు మనకెందుకురా అంటుంది సునంద.
అహం చల్లారడం కోసం అంటాడు కన్నబాబు. ఆ రామా, జానకి నన్ను కొట్టి నా అహం మీద దెబ్బకొట్టారు. ఆ జ్ఞానాంబ మన ఇంటికి వచ్చి నిన్నే బెదిరించింది.. అంటాడు కన్నబాబు. ఆ స్వీటు షాపు నీ చేతుల్లో పెట్టి.. ఆ జ్ఞానాంబ నీ ముందు తలదించుకొని వెళ్తే చూడాలని ఉంది అంటాడు కన్నబాబు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.