Janaki Kalaganaledu 11 March Today Episode : జానకికి శాశ్వతంగా పిల్లలు పుట్టకుండా చేయడం కోసం మల్లిక స్కెచ్.. జుమాంజి ఇచ్చిన మందులు వేసుకున్న జానకికి ఇక పిల్లలు పుట్టరా?

Janaki Kalaganaledu 11 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 మార్చి 2022, శుక్రవారం ఎపిసోడ్ 255 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ ఆనందానికి కారణం అయిన నేను.. ఇప్పుడు మీ బాధకు కూడా కారణం అవుతున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య గారు అంటుంది జానకి. తన కాళ్ల మీద పడబోతుంది కానీ.. జ్ఞానాంబ మాత్రం అక్కడి నుంచి ఏం మాట్లాడుకుండా వెళ్లిపోబోతుంది. జ్ఞానం.. ఇందులో జానకి తప్పేముంది అని అంటాడు గోవిందరాజు. దీంతో నేను ఎవరి మీద కోప్పడట్లేదు. నేను చాలా ఊహించుకున్నాను. నేను ఇంత అమాయకురాలిని ఏంటి అని నా మీద నాకే జాలి వేస్తోంది.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu 11 march 2022 full episode

ఇక.. జానకి ప్రెగ్నెంట్ కాదని తెలుసుకొని మల్లిక సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. చాలా ఖుషీగా ఉంటుంది మల్లిక. వెంటనే లీలావతికి ఫోన్ చేసి.. మనం జూమాంజి డాక్టర్ దగ్గరికి రేపు వెళ్దాం. నేను త్వరలో కొడుకును కనాల్సిందే అంటుంది మల్లిక. మనలో మనమాట.. జానకికి పిల్లలు కలగకుండా మందులు కూడా జుమాంజి డాక్టర్ ఇస్తాడా అని లీలావతిని అడుగుతుంది. దీంతో దానికేం భాగ్యం.. ఎటువంటి మందులైనా ఇస్తాడు అంటుంది లీలావతి. దీంతో ఓకే అయితే.. ఎలాగోలా జానకిని కూడా ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అని అంటుంది మల్లిక.

కట్ చేస్తే తెల్లారుతుంది. జ్ఞానాంబ.. ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. రామా, జానకి ఇటు రండి అని పిలుస్తుంది జ్ఞానాంబ. వస్తున్నాం అమ్మా అని ఇద్దరూ అక్కడికి వస్తారు. అత్తయ్య గారు అని పిలుస్తుంది జానకి. మనవడు.. మనవరాలి కోసం నేనే ఇంతలా ఆరాటపడుతున్నాను.. అలాంటిది పిల్లల కోసం మీరు ఎంత తపన పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను అంటుంది జ్ఞానాంబ.

కానీ.. మీ నుంచి నాకు ఒక నిజం తెలియాలి అంటుంది జ్ఞానాంబ. మీరేమైనా ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నారా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో జానకి షాక్ అవుతుంది. అమ్మ.. అలాంటిదేం లేదమ్మా అంటాడు రామా.

మీకు పెళ్లి అయి ఇంత కాలం అయినా.. ఎలాంటి విశేషం లేదంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయించుకోండి అంటుంది జ్ఞానాంబ. నేను ఇవాళ కోడలును తీసుకొని ఆసుపత్రికి వెళ్తాను. మరోరోజు రామాను తీసుకొని మీరు వెళ్లండి అని గోవిందరాజుతో అంటుంది.

Janaki Kalaganaledu 11 March Today Episode : డాక్టర్ జుమాంజి దగ్గరికి జానకిని తీసుకెళ్లిన మల్లిక, లీలావతి

ఇంతలో మల్లిక వచ్చి.. మన ఊరిలోకి నాటు వైద్యుడు డాక్టర్ జుమాంజీ వచ్చాడంట.. అని చెబుతుంది. అతడు పిల్లలను కనడానికి మందులు ఇస్తాడంట. ఆ మందు తింటే నెల తిరిగే సరికి నెల తప్పుతారంట అంటుంది మల్లిక. అందుకని నేను జానకి వెళ్లి జుమాంజి దగ్గర చెకప్ చేయించుకొని మందులు తెచ్చుకుంటాం అత్తయ్య గారు అంటుంది.

దీంతో మల్లిక.. నువ్వు ఏ కాలంలో ఉన్నావు అని అడుగుతుంది జానకి. దీంతో ఎండాకాలంలో అంటుంది. ఈ కాలంలో ఈ మూడనమ్మకాలు ఏంటి బుద్ధి లేకుండా అంటుంది జానకి. ఇంతలో లీలావతి అక్కడికి వస్తుంది. మూడనమ్మకం కాదు అమ్మాయి అంటుంది.

నమ్మి తీరాల్సిన నిజం అంటుంది. ఇదుగో మల్లిక.. రెండు రకాల కూరగాయలు ఉంటే బదులు ఇస్తావా అని అడుగుతుంది. ఏం లేదు జానకి.. మా అమ్మాయికి కూడా పెళ్లి అయిన మూడు ఏళ్ల వరకు పిల్లలు లేరు. తిరగని హాస్పిటల్ లేదు అంటుంది.

అప్పుడే డాక్టర్ జుమాంజి దగ్గరికి వెళ్లాం. 9 నెలలు తిరిగే సరికి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది నా కూతురు. నువ్వూ వెళ్లి మందు తెచ్చుకొని తిను అమ్మాయి.. ఖచ్చితంగా కడుపు పండుతుంది అంటుంది లీలావతి. దీంతో నేను ఇలాంటివి నమ్మను.. పాటించను అంటుంది.

ఇదిగో జ్ఞానాంబ.. నీకోడలు చదువుకున్న ఈ కాలం అమ్మాయివి కాబట్టి ఇలాగే మాట్లాడుతుంది. నువ్వు నలుగురు పిల్లలను కన్నావు. మంత్రసానే కదా.. మనకు పురుడు పోసింది. పూర్వకాలంలో మనకు ఆసుపత్రులు ఎక్కడివి.. అని చెబుతుంది.

ఇదిగో జ్ఞానాంబ.. మంచి అవకాశం జుమాంజి రూపంలో వెతుక్కుంటూ వచ్చింది. లేకపోతే మీ ఇష్టం.. అంటుంది లీలావతి. జానకి.. మంచి జరుగుతుందని చెప్పినప్పుడు నమ్మడంలో తప్పు లేదు కదా.. పైగా వాళ్ల అమ్మాయికి కూడా పిల్లలు కలిగారు అని చెబుతోంది కదా.. ఇద్దరూ ఒకసారి వెళ్లిరండి అంటుంది జ్ఞానాంబ.

అత్తయ్య గారు.. అలాంటి వాటిని గుడ్డిగా నమ్మకూడదు అంటుంది జానకి. దీంతో వెళ్లిరా అమ్మా.. ప్రయత్నించి చూడటంలో తప్పేముంది అంటుంది జ్ఞానాంబ. మరోవైపు డాక్టర్ జుమాంజి.. మహిళలకు నాటు వైద్యం చేస్తుంటాడు.

జానకిని తీసుకొని మల్లిక, లీలావతి ఇద్దరూ హాస్పిటల్ కు వెళ్తతారు. మీరు ఇక్కడే ఉండండి.. నేను వెళ్లి డాక్టర్ గారు ఎప్పుడు రమ్మంటారో కనుక్కొని వస్తాను అంటుంది లీలావతి. నీకు ఇక జన్మలో పిల్లలు పుట్టరు అని మనసులో అనుకుంటుంది మల్లిక.

ముందు లీలావతి వెళ్లి డాక్టర్ కు అసలు విషయం చెబుతుంది. ఒకరికి పిల్లలు పుట్టకుండా మందులు ఇవ్వాలి అంటుంది లీలావతి. తర్వాత వాళ్లను లోపలికి తీసుకెళ్తుంది. డాక్టర్ కు చెబుతుంది. మందులు ఇవ్వమని చెబుతుంది. దీంతో మందులు ఒక పేపర్ లో పెట్టి జానకికి ఇస్తాడు.

కానీ.. జానకి తీసుకోదు. వీటిని దేనితో తయారు చేశారు అని ప్రశ్నిస్తుంది. ఏ ఔషధ మూలికలు వాడారు అని అడుగుతుంది. దీంతో వైద్యుడు తడబడతాడు. ఆ తర్వాత ఆయన ఇచ్చిన మందుల ప్యాకెట్లను తీసుకొని బయటికి వస్తారు.

మీరు వెళ్లండి నాకు కొంచెం పని ఉంది అని చెబుతుంది జానకి. మరోవైపు వెన్నెల పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకుంటారు జ్ఞానాంబ, గోవిందరాజు. తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago