
janaki kalaganaledu 13 june 2022 full episode
Janaki Kalaganaledu 13 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 జూన్ 2022, సోమవారం ఎపిసోడ్ 321 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తను రూ.500 ఇవ్వడంతో మిగిలిన డబ్బులకు కూడా పాయసం ఇస్తాను. తీసుకెళ్లి ఇంట్లో వాళ్లకు ఇవ్వండి అంటాడు. ఆ తర్వాత వరుస పెట్టి మరీ అందరూ తన దగ్గరే పాయసాన్ని కొంటారు. దీంతో రామా సంతోషిస్తాడు. పోటీ ముగిశాక.. సెమీఫైనల్స్ కు వెళ్లే ఐదుగురి పేర్లు ప్రభా గారు చెబుతారు. మొదటి విజేత టేబుల్ నెంబర్ 4 అని చెబుతుంది. రెండో విజేత టేబుల్ నెంబర్ 10 అని చెబుతుంది. మూడో విజేత టేబుల్ నెంబర్ 7 అని అంటుంది. నాలుగో విజేత టేబుల్ నెంబర్ 2 అని అంటుంది. ఇక ఆఖరుగా సెమీ ఫైనల్స్ లో లాస్ట్ పార్టిసిపెంట్ ఐదో విజేత.. అంటూ ఆ విజేతను మన మహేశ్ అనౌన్స్ చేస్తాడు అంటుంది. దీంతో ఐదో విజేత మరెవరో కాదు.. అంటూ చెప్పడం కాదు.. నేనే స్వయంగా వచ్చి అతడికి షేక్ హ్యాండ్ ఇస్తాను అని అంటాడు మహేశ్. అటూ ఇటూ తిరిగి.. రామా దగ్గరికి వచ్చి మిస్టర్ రామచంద్ర అంటాడు మహేశ్.
janaki kalaganaledu 13 june 2022 full episode
వెంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చిందని.. వాళ్లు హైదరాబాద్ వెళ్లడం ఏమో కానీ.. స్వీటు షాపు పనులు కూడా నేనే చూసుకోవాల్సి వస్తోంది అని అనుకుంటుంది మల్లిక. మరోవైపు సునంద, కన్నబాబు ఇద్దరూ జ్ఞానాంబ ఇంటికి వస్తారు. వీళ్లేంటి ఇక్కడికి వచ్చారు అని షాక్ అవుతుంది మల్లిక. రామచంద్ర ఎక్కడున్నాడు అని అడుగుతాడు కన్నబాబు. దీంతో మా బావ.. హైదరాబాద్ లో నేషనల్ చెఫ్ చాంపియన్ షిప్ కు వెళ్లాడు. సెమీ ఫైనల్స్ లో కూడా అడుగుపెట్టాడు. రేపో మాపో రూ.5 లక్షలు గెలుచుకొని పెద్ద కప్పు పట్టుకొని ఆత్రేయపురం వచ్చినా వస్తాడు అంటుంది మల్లిక. దీంతో సునంద, కన్నబాబు షాక్ అవుతారు.
అక్కడి నుంచి కారు ఎక్కి.. వాడు ఆ చెఫ్ పోటీల్లో గెలవకూడదు.. అంటుంది సునంద. మరోవైపు రామా, జానకి ఇద్దరూ కారులో హైదరాబాద్ అంతా తిరుగుతారు. గోల్కొండ వెళ్తారు. జ్ఞానాంబ, గోవిందరాజు కూడా వాళ్లతో పాటు వెళ్తారు. మరోవైపు కొంచెం కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రారంభిస్తాడు రామా.
రామా.. ఇంగ్లీష్ నేర్చుకోవడం చూసి సంతోషిస్తుంది జానకి. తనకు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో కొన్ని సలహాలు ఇస్తుంది. ఆ తర్వాత మీ చేయిని ఒకసారి ఇలా ఇవ్వండి అంటుంది. కళ్లు మూసుకోండి అంటుంది. నేను చెప్పేవరకు మీరు కళ్లు తెరవకూడదు అంటుంది.
తన చేతికి వాచ్ పెడుతుంది జానకి. తనకు వాచ్ పెట్టడం చూసి జ్ఞానాంబ, గోవిందరాజు మురిసిపోతారు. ఇప్పుడు కళ్లు తెరవండి అంటుంది జానకి. ఇప్పుడు ఈ వాచ్ ఎందుకు అంటాడు. దీంతో వాచ్ మీ చేతుల్లో ఉంటే.. మీరే టైమ్ చూసుకుంటూ వంట చేయొచ్చు కదా అంటుంది జానకి.
నా విషయంలో మా అమ్మ కూడా ఇంతే శ్రద్ధగా ఆలోచిస్తుంది అంటాడు రామా. మరోవైపు సెమీ పైనల్ రౌండ్ మొదలవుతుంది. అక్కడికి సునంద వచ్చింది. తనను చూసి జ్ఞానాంబ షాక్ అవుతుంది. తను ఎందుకు వచ్చింది అని వాళ్లు అనుకుంటారు.
మీకోసమే వచ్చాను అంటుంది. దీంతో మాకోసం వచ్చావా ఎందుకు అని అడుగుతాడు గోవిందరాజు. దీంతో కొన్ని కాంట్రాక్ట్ బిల్లుల కోసం హైదరాబాద్ వచ్చాం. టీవీలో రామచంద్ర కనిపించాడు. మీ అబ్బాయిని చూసి ఆల్ ది బెస్ట్ చెబుదామని వచ్చాను అంటుంది సునంద.
నువ్వు గెలిచి.. మన ఊరి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోవాలి అంటుంది సునంద. ఇంతలో పోటీలో పాల్గొనే వాళ్లకు స్టేజ్ మీదకి కోరుతుంది యాంకర్. మరోవైపు ఈరోజు చీఫ్ గెస్ట్ గా బిగ్ బాస్ అరియానా వచ్చినట్టు అరియానా చెబుతుంది. తనను అందరూ ఆహ్వానిస్తారు.
ఈ సెమీ ఫైనల్ లో ఇద్దరు మాత్రమే ఫైనల్స్ కు వెళ్తారని సంజయ్ చెబుతాడు. ఈ కాంపిటిషన్ లో మీకు ఇస్తున్న టాస్క్ నాన్ వెజ్ స్పెషల్ అని అంటాడు సంజయ్. దీంతో రామా షాక్ అవుతాడు. మీ అందరి టేబుల్స్ మీద నాన్ వెజ్ ఐటెమ్స్ ఉన్నాయి. వాటిలో మీకు ఇష్టమైన స్పెషల్ ను తయారు చేయండి అని అంటాడు చెఫ్.
దీంతో రామాకు ఏం చేయాలో అర్థం కాదు. విన్నారు కదా.. ఈ సెమీ ఫైనల్స్ లో నాన్ వెజ్ రెసీపీలతో అదరగొట్టేయండి అంటాడు. ఇంతలో సార్ అది అంటూ రామచంద్ర ఏదో అనబోతాడు. నేను మాంసం ముట్టుకోను సార్. అందుకని వేరే ఏదైనా ఇవ్వండి అని అంటాడు. దీంతో సారీ రామచంద్ర అలా ఇవ్వడం కుదరదు. మీరు ఇదే వంట చేయాలి అంటాడు చెఫ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.