Pawan Kalyan About Mahesh Babu Mejar movie
Mahesh Babu : రీసెంట్ గా రిలీజై మంచి టాక్ ని సొంతం చేసుకున్న సినిమా మేజర్. మోస్ట్ సక్సెస్ ఫుల్ యంగ్ హీరో అడివి శేష్, శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. అలాగే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, రేవతీలు నటించారు. కాగా సోనీ పిక్చర్స్ ఇటర్నేషనల్, సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.2008 నవంబర్ 26న ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. మేజర్ సందీప్ పాత్రలో అడవి శేష్ నటించి మెప్పించారు.
కాగా ఈ సినిమాపై సినీ రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ ఓ లెటర్ రాశారు. మేజర్ చిత్ర యూనిట్ ని అభినందిస్తూ ప్రశంసల జల్లు కురిపించారు.పార్టీ పనులతో బిజీగా ఉన్నందున ఈ సినిమాను చూసేందుకు వీలుపడలేదని అన్నారు. త్వరలోనే వీలు చూసుకుని సినిమాను చూస్తానని తెలిపారు. మేజర్ చిత్రం కథానాయకుడు, సోదరుడు అడివి శేష్ కు హృదయపూర్వక అభినందనలు. ప్రఖ్యాత రచయిత, దివంగత అడివి బాపిరాజు గారి మనవడైన శేష్ సినిమా రంగంలో భిన్న శాఖలపై అభినివేశం ఉన్న సృజనశీలి అని కొనియాడారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నట్లు తెలుసుకున్నానని.. ఇది ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ చిత్రం తెలుగు చిత్రసీమ నుంచి రావడం ఆనందంగా ఉందని అన్నారు.
Pawan Kalyan About Mahesh Babu Mejar movie
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వంటి సైనికాధికారులు, సిబ్బంది దేశభద్రత కోసం ఎంతగా పోరాడుతున్నారో అందరికీ తెలియాలని పవన్ ఆకాంక్షించారు. మేజర్ చిత్ర నిర్మాణంలో భాగస్వాములైన మహేశ్ బాబును, చిత్ర నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డిలను అభినందిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఈ చిత్రంలో నటించిన ప్రకాశ్ రాజ్, రేవతి, సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, మురళీ శర్మ, ఇతర టెక్నీషియన్లకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. కాగా పవన్ లేఖపై అడవి శేష్ ట్విట్టర్ వేదికగా ఉప్పొంగి పోతున్నాడు. ఆనందంతో తన హార్ట్ నిండిపోయిందని.. తమ టీమ్ పై ప్రశంసలు కురిపించడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. మేజర్ సినిమా నాకు సర్వస్వం. అప్పుడు పంజా.. ఇప్పుడు మేజర్ ఇంకా ఎన్నో చెప్పాలి.. ఈ లెటర్ ని సేవ్ చేసుకుంటా అంటూ తన అభిమానాన్ని తెలియజేశాడు.
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
This website uses cookies.