
Janaki Kalaganaledu 15 August 2022 Full Episode
Janaki Kalaganaledu 15 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు. ఈ సీరియల్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు తాజాగా విడుదలైంది. 366 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. మల్లిక భోజనం ప్లేట్లు చాటుగా పెట్టుకొని ఎంతసేపటికి తీయకపోతే అప్పుడు గోవిందరాజు తన వెనక ఏదో ఉంది అని చూస్తూ ఉంటాడు. గోవిందరాజు తనని ఒక ప్లాన్ వేసి అది మౌనవ్రతం కాదు.. దొంగతనంగా భోజనం చేస్తుంది అని బయట పెట్టేస్తాడు. అప్పుడు జ్ఞానాంబ మల్లికను తిడుతూ నేను తిండికి చంపేంత మూర్ఖురాలు కాదు. ఇప్పుడు వచ్చి నిన్ను తినమని చెబుదామని అనుకున్న. ఇంతలో నువ్వు దొంగసాటుగా తింటావా.. ఇక ఈ రెండు రోజుల తో పాటు ఇంకొక రోజు ఎగస్ట్రా నువ్వు తిండి తిప్పల మానేయాలి అని అంటుంది. అప్పుడు గోవిందరాజు సంతోష్ పడిపోతూ ఉంటారు. మల్లిక ఏడుస్తూ మళ్లీ అలాగే అన్నం తింటూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ మల్లిక అని గట్టిగా పిలుస్తుంది. కట్ చేస్తే జెస్సి జ్ఞానాంబ అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు జానకి వచ్చి జెస్సిని పరిచయం చేసుకుంటుంది.
ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ అవును నువ్వు ఎందుకు చిరాగ్గా ఉన్నావు అని అంటుంది జానకి. అప్పుడు జెసి ఒక ఆవిడ ఇలా మొండిగా బిహేవ్ చేసింది అని చెప్తుంది. జానకి పెద్దవాళ్లు ఏది చెప్పిన మన మంచికే చెప్తారు అని చెప్తుంది. జానకి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మల్లిక పిండి ఇసురుతూ నా జీవితం ఏంట్రా ఇలా తగలబడింది ఏంటి.. పెద్ద కోడలు జీవితమేమో సంతోషాలతో వెలిగిపోతుంది అని అంటుండగా.. జానకి ఇంటికి వస్తుంది. జానకి పై సెటైర్ వేస్తుంది. అప్పుడు జానకి మల్లికకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. జానకి జ్ఞానంబ కి, గోవిందరాజుకి కాఫీ చేసి తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు గోవిందరాజు నువ్వు పెట్టిన షరతులు ఎలా పాటిస్తుందో చూడు అని అంటాడు. కట్ చేస్తే జానకి ఇంట్లో వంట అన్ని పనులు చకచక చేస్తుంది. అందరూ భోజనం చేస్తూ ఉంటారు. మల్లిక అదంతా చూస్తూ ఆకలితో మండిపోతూ ఉంటుంది. అప్పుడు జానకి మల్లికను చూసి.. జానకి అత్తయ్య గారు పాపం మల్లికా అస్సలు ఆకలికి భరించలేదు.
Janaki Kalaganaledu 15 August 2022 Full Episode
మీరు అనుమతిస్తే తనని కూడా భోజనానికి పిలుస్తాను అని అంటుంది. అప్పుడు ఈ ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే ఇలాగే చేస్తాను. రేపు నువ్వైనా అంతే జానకి అని అంటుంది. గుర్తుపెట్టుకోండి ఈ ఇంట్లో ఎవరైనా తప్పు చేయాలి అంటే భయపడాలి అని అంటుంది. కట్ చేస్తే జానకి చదువుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి రామ్మా వచ్చి జానకి గారు మీరు ఉదయమంతా వంట, ఇంటి పనులు చేశారు. చదువు కోసం అంత దూరం వెళ్లి వచ్చారు. ఇప్పుడేమో నిద్రపోకుండా చదువుకుంటున్నారు. ఇక రండి పడుకుందురు గాని అని అంటాడు.
అప్పుడు ఇప్పుడు పరీక్షలు ఉన్నాయండి కొద్ది సమయం ఉంది నాకు ఇది వృధా చేయకూడదు మీరు వెళ్లి పడుకోండి అని అంటుంది. నేను అమ్మతో మాట్లాడతాను ఈ చదువు అయిపోయే వరకు ఇంటి పనులు మీకు చెప్పవద్దు అని చెప్తాను అని అంటాడు రామ. వద్దండి అత్తయ్య గారు నాకు పెట్టిన నియమాలతో పాటు నేను చదువుకుంటాను. ఈ చదువు ఎంత ముఖ్యమో అత్తయ్య గారు చెప్పిన షరతులు కూడా అంతే ముఖ్యం అండి అని అంటుండగా జ్ఞానంబ అక్కడినుంచి వాళ్ళిద్దర్నీ చూస్తూ ఉంటుంది. జానకి అత్తయ్య గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపించాలని రామాతో అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
This website uses cookies.