Janaki Kalaganaledu 15 Nov Today Episode : అఖిల్ కు ఉరిశిక్ష పడుతోందని తెలిసినా చలించని జానకి.. తనను ఇంట్లో నుంచి రామా వెళ్లగొడతాడా?

Advertisement
Advertisement

Janaki Kalaganaledu 15 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 నవంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 432 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందు మీరు జానకితో కేసు వాపసు తీసేలా చేయండి అని లాయర్ కూడా రామాకు సలహా ఇస్తాడు. మరోవైపు జ్ఞానాంబ అఖిల్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పీటర్, ఆయన భార్య జ్ఞానాంబ ఇంటికి వస్తారు. వాళ్లను చూసి జెస్సీ పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ల నాన్నను హత్తుకుంటుంది. నాన్న అంటూ ఏడుస్తుంది. ఏడవకమ్మా.. అల్లుడు గారు ఎలాంటి సమస్య లేకుండా బయటికి వస్తారన్న నమ్మకం మాకుంది నువ్వు ధైర్యంగా ఉండు అంటుంది వాళ్ల అమ్మ. జ్ఞానాంబ గారు మీరు, మీ కుటుంబం అందరికీ ఆదర్శంగా ఉన్నారు. అలాంటి మీకు కొడుకు దోషి అన్నంత కష్టం రావడం నిజంగా బాధ కలిగించే అంశమే. కానీ.. ఏం చేస్తాం అండి. తలరాత మన చేతుల్లో ఉండదు కదా అంటాడు పీటర్. అధైర్యపడకండి. మీకు అండగా మేమున్నాం. అల్లుడు గారు తప్పకుండా నిర్దోషిగా తిరిగి వస్తారు అంటాడు పీటర్. ఇంతలో రామా, విష్ణు ఇద్దరూ లాయర్ ను కలిసి ఇంటికి తిరిగి వస్తారు.

Advertisement

janaki kalaganaledu 15 november 2022 full episode

లాయర్ గారిని కలిశావా.. ఏమన్నారు అని అడుగుతారు. బెయిల్ వస్తుందన్నారా అని అడుగుతాడు గోవిందరాజు. దీంతో అది మన చేతుల్లోనే ఉందన్నారు అంటాడు రామా. జానకి గారు కేసు వెనక్కి తీసుకుంటే తప్ప బెయిల్ కు అవకాశం లేదన్నారు అంటాడు రామా. దీంతో అందరూ షాక్ అవుతారు. దీంతో పీటర్, ఆయన భార్య వెళ్లి జానకిని బతిమిలాడుతారు. ఎప్పుడూ నీ కుటుంబం గురించి, ఎదుటి వాళ్ల సంతోషం గురించి ఆలోచించే నువ్వు.. అఖిల్ మీద ఎందుకు కేసు పెట్టావో తెలియదు కానీ.. అల్లుడు గారు అంత తప్పు చేసే వ్యక్తి అయితే కాదు. ఒకసారి ఆలోచించు అమ్మ అంటాడు పీటర్. జరిగిందేదో జరిగిపోయింది ఇక నైనా మీ అత్త గారి పరువు గురించి ఆలోచించి కేసు వెనక్కి తీసుకో అంటుంది పీటర్ భార్య.

Advertisement

కానీ.. జానకి ఏం మాట్లాడదు. కనీసం మా కుతురును అయినా కొన్ని రోజులు ఇంటికి తీసుకెళ్తాం అంటారు పీటర్. జ్ఞానాంబను అడుగుతారు కానీ.. నేను ఈ సమయంలో రాలేను అని అంటుంది జెస్సీ.

దీంతో సరే అమ్మ. బెంగ పెట్టుకోకు. అంతా మంచే జరుగుతుంది అంటారు. జ్ఞానాంబ గారు మేము వెళ్లొస్తాం. మాతో ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. తప్పకుండా వస్తాం అని చెప్పి పీటర్, ఆయన భార్య వెళ్లిపోతారు.

తన ప్లాన్ అంతా బెడిసికొట్టిందని బాధపడుతుంది మల్లిక. చా.. అని అనుకుంటుంది. జానకి గారు.. నిన్న గాక మొన్న మనింట్లో కోడలుగా అడుగుపెట్టిన జెస్సీ ఆలోచించినంత బాధ్యతగా మీరు ఎందుకు ఆలోచించడం లేదు అంటాడు రామా.

Janaki Kalaganaledu 15 Nov Today Episode : తనను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదని బాధపడ్డ జానకి

దీంతో ఏడ్చుకుంటూ తన రూమ్ లోకి వెళ్తుంది జానకి. తనను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదని బాధపడుతుంది. మీ నిర్ణయం అందరినీ బాధపెడుతోంది. అఖిల్ భవిష్యత్తు, కుటుంబం పరువు మీ చేతుల్లో ఉంది అని రామా అనడంతో నా వ్యక్తిత్వం ఏంటో తెలిసి కూడా నన్నే ఎందుకు తప్పు పడుతున్నారు అని అనుకుంటుంది జానకి.

ఒక ఆడపిల్ల చావు బతుకుల మధ్య హాస్పిటల్ లో ఉంది. ఇప్పుడు నేను కేసు విత్ డ్రా చేసుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టే కదా. ఇదంతా ఎందుకు వీళ్లు ఆలోచించడం లేదు అని అనుకుంటుంది జానకి.

నా పెంపకం అంత పెద్ద తప్పు చేయదు అనే నమ్మకం ఓవైపు, నా పెద్ద కోడలు అలాంటి తప్పు చేయదు అని మరోవైపు. రామా ఎన్ని సార్లు చెప్పినా కూడా మనసు మార్చుకోవడం లేదు. ఓదార్చుతూనే తన మాటలతో గాయం చేస్తోంది. అల్లుడు అరెస్ట్ అయినందుకు మాటలు మాట్లాడలేక జెస్సీ తల్లిదండ్రులు మనల్ని ఓదార్చి వెళ్లారు అని గోవిందరాజుతో అంటుంది జ్ఞానాంబ.

కేసు కోర్టుకు వెళ్తే వాడి భవిష్యత్తు ఏమౌతుందో అని భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటుంది జ్ఞానాంబ. కోడలు వ్యక్తిత్వం మనకు బాగా తెలుసు. నేను ఒకసారి జానకితో మాట్లాడుతా అని చెప్పి వెళ్తాడు గోవిందరాజు.

మరోవైపు జెస్సీనే జానకి మీదికి ఉసిగొల్పాలి అని అనుకుంటుంది మల్లిక. దీంతో తన దగ్గరికి వెళ్లి అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది జెస్సీ అంటుంది. అమాయకుడు అయిన అఖిల్ మీద కేసు పెట్టి మనింట్లో వాళ్లే అరెస్ట్ చేయించడం తట్టుకోలేకపోతున్నాను.

నీ కన్నీళ్లను చూస్తుంటే నా గుండె చెరువైపోతోంది జెస్సీ. నీకు పెళ్లి చేసి నీకు జీవితాన్ని ఇచ్చిందని జానకిని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నావు. తను మాత్రం నీ గుండెల మీద తన్నింది. అసలు ఊళ్లో జనం ఏమనుకుంటున్నారో తెలుసా జెస్సీ అంటుంది మల్లిక.

దీంతో ఏం అనుకుంటున్నారు అక్క అని అడుగుతుంది జెస్సీ. కేసు కోర్టుకు వెళ్లి జానకి సాక్ష్యం చెబితే అఖిల్ కు ఉరి శిక్ష పడే అవకాశం ఉందని ఊళ్లో వాళ్లు చెవులు కొరుక్కుంటున్నారు అంటుంది మల్లిక.

దీంతో జెస్సీ షాక్ అవుతుంది. రామా కూడా మల్లిక చెప్పే మాటలు విని షాక్ అవుతాడు. ఒకవేళ అదే నిజం అయితే ఏంటి జెస్సీ పరిస్థితి అంటుంది మల్లిక. దీంతో జెస్సీ తట్టుకోలేదు. ఒకవేళ ఉరిశిక్ష తప్పినా కానీ.. జీవిత ఖైదు అయినా పడొచ్చు అని అంటున్నారు అంటుంది మల్లిక.

అదే నిజం అయితే 14 నుంచి 20 ఏళ్లు అఖిల్ జైలులోనే ఉండాలి అంటుంది మల్లిక. మల్లిక చెప్పే మాటలకు వెక్కి వెక్కి ఏడుస్తుంది జెస్సీ. ఏది ఏమైనా జానకి ఈ కేసును వెనక్కి తీసుకోకపోతే నీ భర్త జైలులో, నువ్వు ఇక్కడ శిక్ష అనుభవించక తప్పదు జెస్సీ అని అంటుంది మల్లిక.

ఇవన్నీ విన్న రామాకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Legs Arms : కాళ్లల్లో, చేతులలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా… అయితే విటమిన్ డి లోపం ఉన్నట్లే…!

Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…

19 mins ago

Prabhas : పెళ్లి ప‌క్క‌న పెట్టి వ‌రుస సినిమాలు చేస్తున్న ప్ర‌భాస్.. అస‌లు ఎలా మేనేజ్ చేస్తున్నాడు..!

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ఎవ‌రంటే మ‌న‌కు ఠ‌క్కున గుర్తిచ్చే పేరు ప్ర‌భాస్. మ‌నోడు పెళ్లి విష‌యాన్ని…

1 hour ago

Tea : ఉదయాన్నే ఛాయ్ తో పాటు బిస్కెట్ తింటే… మీ ప్రాణాలు డేంజర్ లో పడ్డట్టే… జాగ్రత్త…??

Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…

2 hours ago

Zodiac Signs : శుక్రుడు అనుగ్రహంతో కార్తీకమాసంలో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…

3 hours ago

NIRDPR Notification 2024 : పంచాయతి రాజ్ జాబ్స్.. పరీక్ష లేకుండా గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ శాఖలో జాబ్స్..!

NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…

4 hours ago

Utthana Ekadashi : ఉత్తాన ఏకాదశి ప్రాముఖ్యత… ఏ రోజు ఎలా జరుపుకోవాలంటే..!

Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…

5 hours ago

Telangana Cabinet : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఇప్ప‌ట్లే లేన‌ట్లేనా.. ఈ అగ్ర పోటీదారుల‌కు నిరాశే

Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…

14 hours ago

Telangana : సమగ్ర కుటుంబ సర్వే : వివరాల నమోదుకు సొంతూరు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉందా.. లేదా..?

Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్ర‌భుత్వం సమగ్ర కుటుంబ సర్వే…

15 hours ago

This website uses cookies.