
karthika deepam 15 november 2022 full episode
Karthika Deepam 15 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 నవంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 1510 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు కార్తీక్ ఏం చేస్తున్నాడు. కార్తీక్ ఎక్కడికి వెళ్తున్నాడు అని అనుకుంటుంది మోనిత. ఇంతలో కార్తీక్ కు ఫోన్ రావడంతో వస్తా సాయంత్రం.. అన్నీ రెడీ చేసుకోండి అంటాడు. అసలు సాయంత్రం ఎక్కడికి వెళ్తున్నాడు అని అనుకుంటుంది మోనిత. ఇక పాత మోనితను బయటికి తీయాలి అని అనుకుంటుంది మోనిత. ఇంతలో కార్తీక్ వచ్చి ఆనంద్ ఎక్కడ అని అడుగుతుంది. దీంతో ఏ ఆనంద్ అంటుంది మోనిత. దీంతో నీకేమైనా పిచ్చా అంటాడు కార్తీక్. దీంతో నీకు గుర్తుందా కార్తీక్ అంటుంది మోనిత. శివలత ఇంటికి పంపించావేమో అనుకున్నా అంటాడు కార్తీక్. ఇంతకీ ఆనంద్ ఎక్కడున్నాడు చెప్పు అని అడుగుతుంది. దీంతో లేడు.. పంపించేశా అంటుంది మోనిత. దీంతో పంపించేశావా ఎక్కడికి పంపించావు.. ఎప్పుడు పంపించావు అని అడుగుతాడు.
karthika deepam 15 november 2022 full episode
పిల్లాడిని నా ఫ్రెండ్ కు ఇచ్చేశా అంటుంది మోనిత. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. మన మధ్య ఎవరూ లేనప్పుడు నేనే తీసుకొస్తాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బిజీగా ఉన్నావు కదా అంటుంది మోనిత. దీంతో ఫ్రెండ్ తో బాబును వేరే దేశానికి పంపించడం ఏంటి.. విదేశాల్లో తనకు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు. ఒకవేళ నాకు గతం గుర్తొచ్చిందని తనకు అనుమానం వచ్చిందా. అందుకే టెస్ట్ చేస్తోందా. నిన్న గుడిలో జరిగిన దానికి అనుమానం వచ్చే ఉంటుంది. జాగ్రత్తగా కవర్ చేయాలి అని అనుకుంటాడు కార్తీక్. మరోవైపు దీప, దుర్గ ఇద్దరూ టీ తాగుతూ.. నీకు డాక్టర్ బాబులో ఏమైనా మార్పు కనిపిస్తోందా అని అడుగుతుంది దీప. దీంతో చాలా మార్పులు కనిపిస్తున్నాయి అంటాడు.
డాక్టర్ బాబుకు గతం గుర్తొచ్చినట్టు నీకేమైనా అనిపిస్తోందా అని అడుగుతుంది దీప. దీంతో అలా ఏం అనిపించలేదు దీపమ్మ అంటాడు దుర్గ. ఒకవేళ డాక్టర్ బాబుకు గతం గుర్తొచ్చిందేమో అనిపిస్తోంది అంటుంది దీప.
ఒకవేళ తెలిస్తే మోనిత చెంప చెళ్లుమనిపించి నిన్ను హైదరాబాద్ కు తీసుకెళ్లేవాడు కదా అంటాడు దుర్గ. కార్తీక్ సార్ కు నిజం తెలిసిన రోజు నాడే.. మోనిత అంతం జరుగుతుంది అంటాడు దుర్గ.
మరోవైపు సౌందర్య ఊరి నుంచి వస్తుంది. నానమ్మ ఆనంద్ అని అంటుంది హిమ. ప్రయాణం ఎలా జరిగింది సౌందర్య అని అడుగుతాడు ఆనంద రావు. దీంతో బాగానే జరిగింది అంటుంది సౌందర్య.
ఏంటే మనవరాలా.. తమ్ముడితో కాలక్షేపం సరిగ్గానే జరుగుతోందా అని అంటుంది సౌందర్య. దీంతో తమ్ముడు ఉన్నాడు కదా.. అంటుంది హిమ. ఆ మోనిత సంగతి మీకు తెలియదు. ఏ క్షణాన్నో అయినా ఇంటి మీద పడి తీసుకెళ్లిపోతుంది అంటుంది సౌందర్య.
దీంతో ఇప్పుడు కూడా ఆమె ఇవ్వలేదు. మేమే ఎత్తుకొచ్చేశాం అంటుంది హిమ. అవసరం కోసం మోనిత ఏదైనా చేస్తుంది అంటుంది సౌందర్య. మీరు నానమ్మకు జరిగింది చెప్పండి. ఎలాగైనా శౌర్యను తీసుకురండి అంటుంది హిమ.
దీంతో ఏం జరిగింది అని అడుగుతుంది. దీంతో ప్రయాణం చేసి బాగా అలసిపోయి వచ్చావు. తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు ఆనంద రావు. మరోవైపు ఆ మోనితను అస్సలు వదలను దుర్గ అంటూ మోనిత బట్టలు పిండుతూ ఆవేశంగా మాట్లాడుతుంది.
ఆ వాల్తేరు వాణి ద్వారా నా ప్రాణాలు తీయాలని చూస్తుందా? అంటూ సీరియస్ అవుతుంది దీప. దీంతో ఆ విషయం వింటాడు కార్తీక్. ఏం జరిగింది అని అడుగుతుంది. దీంతో దుర్గ ముందే పసిగట్టాడు కాబట్టి నేను బతికిపోయా అంటుంది దీప.
మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటాడు కార్తీక్. దీంతో ఎన్నని చెబుతాం. మోనిత వల్ల నాకు ప్రాణాపాయం ఉందని మీకు తెలియదా? ఒక సారి మీరే కాపాడారు. ఈసారి దుర్గ కాపాడాడు అంటుంది దీప.
అదృష్టానికి అందనంత దూరంలో ఉంది నా బతుకు అంటుంది దీప. నా తలరాత మారడం లేదు. అసలు నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందో నాకు అర్థం కావడం లేదు. కట్టుకున్న భర్త నా ఎదురుగానే ఉన్నా నేనే భార్య అని తెలియదు.
నేనే మీ భార్య అని మీకు తెలుసు. కానీ.. చెప్పలేకపోతున్నారు. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉంటున్నారు. కానీ.. గతం గుర్తు రాక నన్ను గుర్తుపట్టనందుకు నేను బాధపడలా అంటూ ఏడుస్తుంది దీప.
అంతా నా కర్మ డాక్టర్ బాబు.. నా కర్మ అంటుంది దీప. నాకు గతం గుర్తొచ్చిందని తెలిస్తే ఆ మోనిత నిన్ను బతకనివ్వదు అని అనుకుంటాడు. నేను మీ భార్యను కాబట్టే నా మీద హత్యాప్రయత్నం చేస్తోంది.
ఒకసారి ఆలోచించండి డాక్టర్ బాబు అని అంటుంది దీప. వెంటనే ఇంటికి వెళ్లి మోనిత మీద సీరియస్ అవుతాడు కార్తీక్. నీకు ఇంత కూడా జాలి లేదా అంటాడు కార్తీక్. ఆ వంటలక్క నీ భార్య కాదు అంటే.. నా భార్య అనేలా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటాడు కార్తీక్.
మరోవైపు మోనితను కలుస్తుంది సౌందర్య. పదా ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం అంటుంది. ఇంటి దగ్గర కార్తీక్, దీపను సౌందర్య చూస్తుందా? ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.