Janaki Kalaganaledu 15 Nov Today Episode : అఖిల్ కు ఉరిశిక్ష పడుతోందని తెలిసినా చలించని జానకి.. తనను ఇంట్లో నుంచి రామా వెళ్లగొడతాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 15 Nov Today Episode : అఖిల్ కు ఉరిశిక్ష పడుతోందని తెలిసినా చలించని జానకి.. తనను ఇంట్లో నుంచి రామా వెళ్లగొడతాడా?

 Authored By gatla | The Telugu News | Updated on :15 November 2022,9:20 am

Janaki Kalaganaledu 15 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 నవంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 432 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందు మీరు జానకితో కేసు వాపసు తీసేలా చేయండి అని లాయర్ కూడా రామాకు సలహా ఇస్తాడు. మరోవైపు జ్ఞానాంబ అఖిల్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పీటర్, ఆయన భార్య జ్ఞానాంబ ఇంటికి వస్తారు. వాళ్లను చూసి జెస్సీ పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ల నాన్నను హత్తుకుంటుంది. నాన్న అంటూ ఏడుస్తుంది. ఏడవకమ్మా.. అల్లుడు గారు ఎలాంటి సమస్య లేకుండా బయటికి వస్తారన్న నమ్మకం మాకుంది నువ్వు ధైర్యంగా ఉండు అంటుంది వాళ్ల అమ్మ. జ్ఞానాంబ గారు మీరు, మీ కుటుంబం అందరికీ ఆదర్శంగా ఉన్నారు. అలాంటి మీకు కొడుకు దోషి అన్నంత కష్టం రావడం నిజంగా బాధ కలిగించే అంశమే. కానీ.. ఏం చేస్తాం అండి. తలరాత మన చేతుల్లో ఉండదు కదా అంటాడు పీటర్. అధైర్యపడకండి. మీకు అండగా మేమున్నాం. అల్లుడు గారు తప్పకుండా నిర్దోషిగా తిరిగి వస్తారు అంటాడు పీటర్. ఇంతలో రామా, విష్ణు ఇద్దరూ లాయర్ ను కలిసి ఇంటికి తిరిగి వస్తారు.

janaki kalaganaledu 15 november 2022 full episode

janaki kalaganaledu 15 november 2022 full episode

లాయర్ గారిని కలిశావా.. ఏమన్నారు అని అడుగుతారు. బెయిల్ వస్తుందన్నారా అని అడుగుతాడు గోవిందరాజు. దీంతో అది మన చేతుల్లోనే ఉందన్నారు అంటాడు రామా. జానకి గారు కేసు వెనక్కి తీసుకుంటే తప్ప బెయిల్ కు అవకాశం లేదన్నారు అంటాడు రామా. దీంతో అందరూ షాక్ అవుతారు. దీంతో పీటర్, ఆయన భార్య వెళ్లి జానకిని బతిమిలాడుతారు. ఎప్పుడూ నీ కుటుంబం గురించి, ఎదుటి వాళ్ల సంతోషం గురించి ఆలోచించే నువ్వు.. అఖిల్ మీద ఎందుకు కేసు పెట్టావో తెలియదు కానీ.. అల్లుడు గారు అంత తప్పు చేసే వ్యక్తి అయితే కాదు. ఒకసారి ఆలోచించు అమ్మ అంటాడు పీటర్. జరిగిందేదో జరిగిపోయింది ఇక నైనా మీ అత్త గారి పరువు గురించి ఆలోచించి కేసు వెనక్కి తీసుకో అంటుంది పీటర్ భార్య.

కానీ.. జానకి ఏం మాట్లాడదు. కనీసం మా కుతురును అయినా కొన్ని రోజులు ఇంటికి తీసుకెళ్తాం అంటారు పీటర్. జ్ఞానాంబను అడుగుతారు కానీ.. నేను ఈ సమయంలో రాలేను అని అంటుంది జెస్సీ.

దీంతో సరే అమ్మ. బెంగ పెట్టుకోకు. అంతా మంచే జరుగుతుంది అంటారు. జ్ఞానాంబ గారు మేము వెళ్లొస్తాం. మాతో ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. తప్పకుండా వస్తాం అని చెప్పి పీటర్, ఆయన భార్య వెళ్లిపోతారు.

తన ప్లాన్ అంతా బెడిసికొట్టిందని బాధపడుతుంది మల్లిక. చా.. అని అనుకుంటుంది. జానకి గారు.. నిన్న గాక మొన్న మనింట్లో కోడలుగా అడుగుపెట్టిన జెస్సీ ఆలోచించినంత బాధ్యతగా మీరు ఎందుకు ఆలోచించడం లేదు అంటాడు రామా.

Janaki Kalaganaledu 15 Nov Today Episode : తనను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదని బాధపడ్డ జానకి

దీంతో ఏడ్చుకుంటూ తన రూమ్ లోకి వెళ్తుంది జానకి. తనను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదని బాధపడుతుంది. మీ నిర్ణయం అందరినీ బాధపెడుతోంది. అఖిల్ భవిష్యత్తు, కుటుంబం పరువు మీ చేతుల్లో ఉంది అని రామా అనడంతో నా వ్యక్తిత్వం ఏంటో తెలిసి కూడా నన్నే ఎందుకు తప్పు పడుతున్నారు అని అనుకుంటుంది జానకి.

ఒక ఆడపిల్ల చావు బతుకుల మధ్య హాస్పిటల్ లో ఉంది. ఇప్పుడు నేను కేసు విత్ డ్రా చేసుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టే కదా. ఇదంతా ఎందుకు వీళ్లు ఆలోచించడం లేదు అని అనుకుంటుంది జానకి.

నా పెంపకం అంత పెద్ద తప్పు చేయదు అనే నమ్మకం ఓవైపు, నా పెద్ద కోడలు అలాంటి తప్పు చేయదు అని మరోవైపు. రామా ఎన్ని సార్లు చెప్పినా కూడా మనసు మార్చుకోవడం లేదు. ఓదార్చుతూనే తన మాటలతో గాయం చేస్తోంది. అల్లుడు అరెస్ట్ అయినందుకు మాటలు మాట్లాడలేక జెస్సీ తల్లిదండ్రులు మనల్ని ఓదార్చి వెళ్లారు అని గోవిందరాజుతో అంటుంది జ్ఞానాంబ.

కేసు కోర్టుకు వెళ్తే వాడి భవిష్యత్తు ఏమౌతుందో అని భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటుంది జ్ఞానాంబ. కోడలు వ్యక్తిత్వం మనకు బాగా తెలుసు. నేను ఒకసారి జానకితో మాట్లాడుతా అని చెప్పి వెళ్తాడు గోవిందరాజు.

మరోవైపు జెస్సీనే జానకి మీదికి ఉసిగొల్పాలి అని అనుకుంటుంది మల్లిక. దీంతో తన దగ్గరికి వెళ్లి అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది జెస్సీ అంటుంది. అమాయకుడు అయిన అఖిల్ మీద కేసు పెట్టి మనింట్లో వాళ్లే అరెస్ట్ చేయించడం తట్టుకోలేకపోతున్నాను.

నీ కన్నీళ్లను చూస్తుంటే నా గుండె చెరువైపోతోంది జెస్సీ. నీకు పెళ్లి చేసి నీకు జీవితాన్ని ఇచ్చిందని జానకిని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నావు. తను మాత్రం నీ గుండెల మీద తన్నింది. అసలు ఊళ్లో జనం ఏమనుకుంటున్నారో తెలుసా జెస్సీ అంటుంది మల్లిక.

దీంతో ఏం అనుకుంటున్నారు అక్క అని అడుగుతుంది జెస్సీ. కేసు కోర్టుకు వెళ్లి జానకి సాక్ష్యం చెబితే అఖిల్ కు ఉరి శిక్ష పడే అవకాశం ఉందని ఊళ్లో వాళ్లు చెవులు కొరుక్కుంటున్నారు అంటుంది మల్లిక.

దీంతో జెస్సీ షాక్ అవుతుంది. రామా కూడా మల్లిక చెప్పే మాటలు విని షాక్ అవుతాడు. ఒకవేళ అదే నిజం అయితే ఏంటి జెస్సీ పరిస్థితి అంటుంది మల్లిక. దీంతో జెస్సీ తట్టుకోలేదు. ఒకవేళ ఉరిశిక్ష తప్పినా కానీ.. జీవిత ఖైదు అయినా పడొచ్చు అని అంటున్నారు అంటుంది మల్లిక.

అదే నిజం అయితే 14 నుంచి 20 ఏళ్లు అఖిల్ జైలులోనే ఉండాలి అంటుంది మల్లిక. మల్లిక చెప్పే మాటలకు వెక్కి వెక్కి ఏడుస్తుంది జెస్సీ. ఏది ఏమైనా జానకి ఈ కేసును వెనక్కి తీసుకోకపోతే నీ భర్త జైలులో, నువ్వు ఇక్కడ శిక్ష అనుభవించక తప్పదు జెస్సీ అని అంటుంది మల్లిక.

ఇవన్నీ విన్న రామాకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది