Janaki Kalaganaledu 16 June Today Episode : రామాను ఫైనల్స్ నుంచి తప్పిస్తారా? రామాను జ్ఞానాంబ గెలిపిస్తుందా? పూతరేకులు చేయడానికి సాయం చేస్తుందా?

Janaki Kalaganaledu 16 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 జూన్ 2022, గురువారం ఎపిసోడ్ 324 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామాకు ట్రీట్ మెంట్ చేసి చేయి కదపకుండా చూసుకోండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఒరేయ్ రామా ఇప్పుడు పర్వాలేదా అంటాడు గోవిందరాజు. మరోవైపు కన్నబాబు.. రామాను ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. జానకి డాక్టర్ ను పంపించి వస్తుండగా.. జానకిని అడ్డుకొని పాపం జానకి.. మీ వారికి పెద్ద ప్రమాదం జరిగిందట కదా. నాకు ఆ విషయం తెలియగానే నా ప్రాణం విలవిలలాడిపోయింది. ఇంతకీ ప్రమాదం ఎలా జరిగింది అని అడుగుతాడు కన్నబాబు. దీంతో మా ఆయన గార్డెన్ లో కూర్చొని ఉంటే పూలకుండి వచ్చి పడింది. గాయం అయింది అంటుంది జానకి. అయ్యో అవునా.. పూలకుండి చేయి మీద పడింది కాబట్టి గూడు జారిపోయింది అదే తల మీద పడి ఉంటే.. ఏమయ్యేది.. ప్రాణాలే గాల్లో కలిసిపోయేవి కదా అంటాడు కన్నబాబు.

janaki kalaganaledu 16 june 2022 full episode

దీంతో ఈ దేవుడికి అసలు జాలి లేదు అంటుంది. దీంతో  ఏం కాదు జానకి.. మీ ఆయన ఫైనల్స్ లో గెలవాలి.. రామా గెలిచినట్టే అని అందరూ అనుకుంటున్నారు. కానీ.. చేయి కదిపినా ప్రమాదం అని డాక్టర్ గారు చెప్పారు. మరి ఇప్పుడు ఎలా పోటీల్లో పాల్గొంటాడు. 5 లక్షలు ఎలా గెలిచి నా అప్పు తీరుస్తాడు. పాపం.. చిన్న దెబ్బే అయితే మామూలుగా చెప్పి ఉండేవాళ్లు డాక్టర్లు. చేయి కదపకూడదు అంటే.. చేయి కదపకూడదు అనే కదా. ఫైనల్ పోటీల్లో ఎలా పాల్గొంటాడు. నా అప్పు తీర్చకపోతే సునంద స్వీట్ షాపు త్వరలో ప్రారంభం. దానికి అందరూ ఆహ్వానితులే.. గుర్తుంచుకో అని చెప్పి వెళ్తాడు కన్నబాబు. మరోవైపు పోటీలకు సమయం అవుతుండటంతో వెళ్దామా అని గోవిందరాజు అంటాడు. దీంతో వెళ్దాం అంటుంది జానకి.

ఇంతలో జ్ఞానాంబ.. బ్యాగు పట్టుకొని వచ్చి రామా మనం పోటీలకు వెళ్లడం లేదు.. ఇంటికి వెళ్తున్నం.. పదా అంటుంది. అమ్మ ఒకసారి నేను చెప్పేది విను అంటాడు రామా. కానీ.. జ్ఞానాంబ మాత్రం వినదు. అది కాదు జ్ఞానం.. కష్టపడి ఇంత దూరం వచ్చాడు. చివరి పోటీల్లో పాల్గొనకపోతే ఎలా చెప్పు అంటాడు గోవిందరాజు.

దీంతో నాకు పోటీల కన్నా నా కొడుకు ఆరోగ్యమే ముఖ్యం అంటుంది జ్ఞానాంబ. కానీ.. రామా మాత్రం నేను రానమ్మా అంటాడు రామా.  నా మాటకు నువ్వు ఎదురు చెబుతున్నావా అని అడుగుతుంది జ్ఞానాంబ. నేను ఈ పోటీల్లో పాల్గొంటాను అంటాడు రామా.

అమ్మ.. ఇప్పటి దాకా నిన్ను నేను ఏదీ అడగలేదు. రామా నీకు ఏం కావాలో అమ్మను అడగవు ఏంట్రా అని నువ్వు ఎప్పుడూ అంటూ ఉండేదానివి. మొదటిసారి అడుగుతున్నాను. నన్ను ఈ ఫైనల్ పోటీలకు పంపించు అమ్మ అంటాడు రామా. నువ్వు నన్ను ఆశీర్వదించి పోటీలకు పంపించు అంటాడు రామా.

అభిమన్యుడిని ఆశీర్వదించి.. తన తల్లి పద్మవ్యూహానికి పంపించింది కానీ.. అక్కడికి వెళ్లిన అభిమన్యుడు తిరిగి రాలేదు అంటుంది జ్ఞానాంబ. దయచేసి కాదనకు అమ్మ. నేను మాత్రం పోటీల్లో గెలిచి తీరుతాను అంటాడు రామా. వాడు అంత బాధపడుతుంటే నేను చూడలేను అంటుంది జ్ఞానాంబ.

దీంతో  నేను పోటీలకు రాను… మీరే వెళ్లి రండి అంటుంది జ్ఞానాంబ. నీ గెలుపు కంటే నువ్వే నాకు ముఖ్యం. నువ్వు క్షేమంగా ఉండటం ముఖ్యం అంటుంది జ్ఞానాంబ. దీంతో రాముడు అమ్మను ఇబ్బంది పెట్టడం ఎందుకు.. టైమ్ అవుతోంది పదా వెళ్దాం అని గోవిందరాజు.. రామా, జానకిని తీసుకొని వెళ్తాడు.

Janaki Kalaganaledu 16 June Today Episode : రామా ఫైనల్స్ గెలవకుండా కన్నబాబు మరో ప్లాన్

మరోవైపు పోటీలు ప్రారంభం అవుతాయి. ఈ ఫైనల్ యుద్ధాన్ని ప్రారంభించడానికి వచ్చిన జడ్జిల గురించి చెబుతుంది యాంకర్. ఫైనల్స్ కు వచ్చిన కంటెస్టెంట్లకు ఆల్ ది బెస్ట్ చెబుతాడు సంజయ్. ఫైనల్స్ లో ఏం చేయాలో మరో చెఫ్ చెబుతాడు. మీకు నచ్చింది చేయండి కానీ.. అది యూనిక్ గా ఉండాలి.. ప్రాధాన్యత ఉన్న వంటకం అయి ఉండాలి అని అంటాడు.

దీంతో నాకు ఇష్టమైనది అంటే పూతరేకులు.. కానీ.. అవి ఎలా చేయాలి అని అనుకుంటాడు. జానకి కూడా గోవిందరాజుతో అదే చెబుతుంది. కానీ.. పూతరేకులు చేయాలంటే కుండ కావాలి.. చేయిని బాగా ఆడించాలి అంటాడు గోవిందరాజు. దీంతో జడ్జిలను ఎవరిదైనా ఒకరి హెల్ప్ ఇప్పించేలా చేయండి అని కోరుతుంది జానకి.

దీంతో ఓకే అలాగే హెల్ప్ తీసుకోండి అంటారు జడ్జిలు. దీంతో వెంటనే అత్తయ్య గారికి ఫోన్ చేద్దాం పదండి అని అంటుంది జానకి. దీంతో పదమ్మా అంటాడు గోవిందరాజు. వాళ్ల వెనుకే వెళ్తాడు కన్నబాబు. ఇంతలో హోటల్ కు ఫోన్ చేసి.. జ్ఞానాంబ రూమ్ కు ఫోన్ కనెక్ట్ చేయమని చెబుతుంది జానకి.

ఫోన్ ఎత్తిన జ్ఞానాంబకు అన్ని విషయాలు చెబుతుంది. మీరు త్వరగా రండి అత్తయ్య గారు అంటుంది జానకి. ఇదంతా విన్న కన్నబాబు.. మళ్లీ ఏదో ప్లాన్ వేస్తాడు. ఎవరికో ఫోన్ చేసి ఏదో చెబుతాడు. వెంటనే హోటల్ లో పని చేసే ఓ వ్యక్తి ఫోన్ కు వెళ్లే వైర్ ను కట్ చేస్తాడు. దీంతో ఫోన్ మధ్యలోనే కట్ అవుతుంది.

మరోవైపు ఫైనల్స్ ను టీవీలో మల్లిక, విష్ణుతో పాటు చికిత కూడా వీక్షిస్తుంటారు. ప్లాన్ అమలు చేశాక వచ్చి సీటులో కూర్చొంటాడు కన్నబాబు. మరోవైపు జ్ఞానాంబ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. కానీ.. జ్ఞానాంబ మాత్రం ఇంకా రాదు. మిస్టర్ రామచంద్రా వాట్ ఈజ్ దిస్. ఈ పాటికి ఫైనల్ కాంపిటిషన్ స్టార్ట్ అవ్వాలి అంటాడు చెఫ్ సంజయ్.

మీకు హెల్ప్ గా ఒక వ్యక్తిని తీసుకునే చాన్స్ ఇవ్వమని ఆడిగారు కదా. ఏమైంది మరి.. ఆ వ్యక్తి వస్తున్నారా అని అడుగుతాడు చెఫ్. దీంతో మా అత్తయ్య గారు వచ్చేస్తున్నారు సార్.. సారీ సార్ అంటుంది జానకి. గోవిందరాజు కూడా అదే చెబుతాడు.

దీంతో మీరు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి 5 నిమిషాల సమయం మాత్రమే ఇస్తాం. అంతకుమించి ఇంకో ఒక్క నిమిషం లేట్ అయినా.. మీ చేయి బాగాలేని కారణంగా రామా గారిని ఫైనల్ ఫోటీల నుంచి తప్పిస్తాం అని చెబుతాడు చెఫ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాల‌జీ.. ఇక‌పై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేదు

Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…

22 minutes ago

Nayanthara : నయనతార – విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!

Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…

1 hour ago

Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్

Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…

2 hours ago

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, పండుగ సాయ‌న్న మ‌ధ్య బాండింగ్ ఏంటి.. అస‌లుఎవ‌రు ఇత‌ను..?

Hari Hara Veera Mallu : పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…

3 hours ago

Jagadish Reddy : క‌విత‌ని ప‌ట్టించుకోన‌వ‌సరం లేదు… బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

4 hours ago

Tomatoes : టమెటా తినేవారికి ఇది తెలుసా… దీనిని తింటే శరీరంలో ఇదే జరుగుతుంది…?

Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…

5 hours ago

Hair Loss : అయ్యయ్యో.. బట్టతల వస్తుందని బాధపడుతున్నారా… ఇలా చేయండి వెంటనే వెంట్రుకలు మొలుస్తాయి…?

Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…

6 hours ago

Cluster Beans : గోరుచిక్కుడు కాయను చిన్న చూపు చూడకండి… దీని ఔషధ గుణాలు తెలిస్తే మతిపోతుంది…?

Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…

7 hours ago