Mega 154 : అక్కడ, ఇక్కడ కామన్ పాయింట్ ఒక్కటే.. కమల్ హాసన్ లా మెగాస్టార్‌కు భారీ హిట్ దక్కుతుందా..?

Mega 154 : విక్రమ్..ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్‌గా మాట్లాడుకుంటున్న సినిమా. లోకనాయకుడు కమల్ హాసన్ ఇందులో హీరోగా నటించారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్‌లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ముందునుంచి ఉన్న అంచనాలకు తగ్గట్టుగా విక్రమ్ సినిమా ఒక్క తమిళంలోనే కాకుండా మొత్తం సౌత్ సినిమా భాషలతో పాటు హిందీలోనూ భారీ సక్సెస్ సాధించింది.అంతేకాదు, కమల్ కెరీర్‌లో విక్రమ్ మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. అయితే, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తన 154వ సినిమాను కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో పోల్చి ఇదే రేంజ్ హిట్ దక్కడం గ్యారెంటీ అని మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

ఇలా చెప్పుకోవడానికి కారణం రెండిటికీ ఉన్న ఓ కామన్ పాయింట్. భారీ అంచనాల మధ్య రిలీజైన ‘ఆచార్య’ మెగా అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. అందరూ అనుకున్నట్టుగా ఈ సినిమా హిట్ కాకపోవడంతో చిరు కూడా బాగానే నిరాశ చెందారు.దీంతో ఈ సారి ఎలాగైనా మెగా అభిమానులకు భారీ హిట్ ఇవ్వాలని కసితో ఉన్నారు మెగాస్టార్. ఈ మేరకు తన కొత్త చిత్రాలపై గట్టిగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ‘గాడ్ ఫాదర్’ మూవీ షూటింగ్ ను చివరిదశకు తీసుకువచ్చారు. మరోవైపు ‘భోళా శంకర్’ సినిమాను చక చకా కంప్లీట్ చేస్తున్నారు. అయితే, అందరూ ఈ రెండు సినిమాలనే చిరు పూర్తి చేసే పనిలో ఉన్నారని భావించారు. కానీ, ‘భోళా శంకర్’, ‘గాడ్ ఫాదర్’ చిత్రాలతో పాటు సైలెంట్‌గా మెగా154 చిత్రాన్ని కూడా పూర్తి చేస్తున్నారని ఇన్‌సైడ్ టాక్.

Will Kamal Haasan La Chiranjeevi get a Mega 154 huge hit

Mega 154 : ఒక ఫ్యాన్, తన ఫ్యావరెట్ హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో..!

ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. టైటిల్ అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ, చిరు ఆల్రెడీ లీక్ చేశారు. ఈ సినిమాలో చిరు వింటేజ్ లుక్ మరియు మాస్, స్టైల్ మెగా అభిమానులకు సాలీడ్ ట్రీట్ గా ఉండనుందని ప్రీ లుక్ చూస్తే అర్థమైంది. మెగా అభిమానుల ఆశలన్ని ఈ సినిమా పైనే పెట్టుకున్నారు. ఎందుకంటే, డైరెక్టర్ బాబీ, చిరుకి వీరాఅభిమాని. ఒక ఫ్యాన్, తన ఫ్యావరెట్ హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో తాజాగా వచ్చి భారీ హిట్ సాధించిన విక్రమ్ మూవీతో లోకేష్ చూపించాడు. విక్రమ్ మూవీ ఇంత పెద్ద హిట్ అయ్యింది అంటే దానికి కారణం, లోకేష్ కమల్ హాసన్ కి డై హార్ట్ ఫ్యాన్ కావడమే. అక్కడ, ఇక్కడ కామన్ పాయింట్ ఓ అభిమాని తన స్టార్ హీరోను డైరెక్ట్ చేయడమే. కాబట్టి మెగాస్టర్ ఫ్యాన్ అయిన బాబీ, మెగాస్టార్‌కు కూడా విక్రమ్ రేంజ్ హిట్ ఇస్తాడని అందరూ ఎంతో నమ్మకంగా చెప్పుకుంటున్నారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago