Home » Entertainment » Janaki Kalaganaledu 16 September 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 16 Sep Today Episode : జెస్సీ సేఫ్.. కానీ ఈ విషయం తెలిసి అఖిల్ ఆత్మహత్య? ఈ విషయాన్ని జ్ఞానాంబ తట్టుకుంటుందా?

Authored By
Varun G
The Telugu News | Updated on: September 16, 2022, 10:00 am
Advertisement

Janaki Kalaganaledu 16 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 సెప్టెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 390 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి పరీక్ష రాయడానికి వెళ్లిందో లేదో ఇంతలో తనకు ఫోన్ వస్తుంది. జెస్సీ తల్లిదండ్రులు జానకికి ఫోన్ చేస్తారు. దీంతో వెంటనే వాళ్ల దగ్గరికి వెళ్తుంది. ఏమైంది అని అడుగుతుంది. మేము రావడం కాస్త ఆలస్యమైతే జెస్సీ పరిస్థితి ఏమయ్యేదో.. సమయానికి మేరీ చూసింది కాబట్టి సరిపోయింది అని జానకికి అసలు విషయం చెబుతాడు. దీంతో జెస్సీ దగ్గరికి వెళ్తుంది జానకి. తనను చూసి జెస్సి ఏడుస్తుంది. నువ్వు దూరం అయితే జీవితాంతం మీ అమ్మానాన్న ఏడుస్తారు. ఒక్కగానొక్క కూతురువు. నువ్వు దూరం అయ్యావన్న బాధతో మాత్రమే కాదు. జనాలకు జరిగిన విషయం తెలిసి వాళ్ల సూటిపోటి మాటలకు తట్టుకోలేక వాళ్లు కూడా చనిపోతారు జెస్సీ. నీకెందుకు అంత తొందరపాటు. నేను, రామా గారు కలిసి అఖిల్ తో నీ పెళ్లి చేయాలని ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నామో తెలుసా? అని అంటుంది జానకి.

Advertisement

janaki kalaganaledu 16 september 2022 full episode

మీరు ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా నాకు ధైర్యం చెప్పాల్సింది.. ఈటైమ్ లో సపోర్ట్ గా ఉండాల్సింది అఖిల్. కానీ.. తనే ఫోన్ చేసి అబార్షన్ చేయించుకుంటావా? లేక జీవితాంతం నాకు దూరంగా ఉంటావా అని అంటే నేను బతికి ఉండి ఏం ప్రయోజనం అక్క అంటుంది జెస్సీ. ఏంటి నువ్వు మాట్లాడేది అంటుంది జానకి. దీంతో అవును అక్క.. మీరు ఎన్ని ప్రయోజనాలు చేస్తే మాత్రం ఏంటి అక్క అంటుంది జెస్సీ. చూడు జెస్సీ.. మనకు కష్టం వస్తే మనం కన్నీళ్లు పెట్టుకోవాలి కానీ.. మన కన్నవాళ్లు కన్నీళ్లు పెట్టుకునేలా చూడొద్దు అని అంటుంది జానకి. అఖిల్ తో నీకు పెళ్లి చేసే బాధ్యత నాది అని జెస్సీకి భరోసా ఇస్తుంది జానకి. ఇంకోసారి ఇలాంటి అఘాయిత్యాలు చేసుకోను అని నాకు మాటివ్వు జెస్సీ అంటుంది జానకి. దీంతో అలాగే అక్క అంటుంది జెస్సీ.

Advertisement

నువ్వు జాగ్రత్త. నేను బయలుదేరుతాను అని చెప్పి బయటికి వస్తుంది. నేను జెస్సీతో మాట్లాడాను. మీరేం టెన్షన్ పడకండి. నేను మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. నేను బయలుదేరుతారు. జెస్సీ జాగ్రత్త అంటుంది జానకి.

ఇంతలో బయటికొచ్చిన జెస్సీ.. అక్క కొంచెం సేపు నా దగ్గర ఉండి వెళ్లు అక్క. నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అంటుంది జెస్సీ. దీంతో సరే అంటుంది జానకి. జీవితంలో మనం ఎన్నో సమస్యలకు దాటాం కానీ.. ఇప్పుడు వచ్చిన సమస్య మాత్రం మనల్ని ఇరకాటంలో పడేసింది అంటాడు గోవిందరాజు.

Advertisement

Janaki Kalaganaledu 16 Sep Today Episode : జానకి కాలేజీ నుంచి జ్ఞానాంబకు ఫోన్ చేసిన ప్రిన్సిపల్

దీంతో మీరు చెప్పేది నిజం అండి అంటుంది జ్ఞానాంబ. కానీ.. నాకు ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. జానకి నిరూపిస్తా అంటుంది కదా.. దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం అంటుంది జ్ఞానాంబ.

ఇంతలో జానకి కాలేజీ నుంచి ప్రిన్సిపల్ ఫోన్ చేస్తుంది. మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా జ్ఞానాంబ గారు అని అడుగుతుంది ప్రిన్సిపల్. ఎగ్జామ్ రాయకుండా జానకి వెనక్కి తిరిగి వెళ్లిపోయింది అని చెబుతుంది.

దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. ఏంటి అని అడిగితే ఎమర్జెన్సీ అని చెప్పింది. పెద్ద ప్రాబ్లమ్ అయితే తప్ప జానకి పరీక్షను మిస్ చేయదు కదా.. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అండి అని అడుగుతుంది ప్రిన్సిపల్.

త్వరలో మెయిన్ ఎగ్జామ్స్ జరుగుతాయి. వాటిని అస్సలు మిస్ చేసుకోవద్దు అని చెప్పండి అంటుంది. దీంతో సరే అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత పరీక్ష రాయకుండా కాలేజీ నుంచి జానకి వెళ్లిపోయిందట అని గోవిందరాజుతో అంటుంది.

Advertisement

తర్వాత రామాను పిలుస్తుంది. జానకి పరీక్ష రాయకుండా ఎటో వెళ్లిపోయిందని ఇప్పుడే ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి చెప్పారు అని చెబుతుంది జ్ఞానాంబ. మల్లిక కూడా అక్కడికి వస్తుంది. ఆ జెస్సీ దగ్గరికే వెళ్లి ఉంటుంది అంటుంది మల్లిక.

జానకికి మీరంటే లెక్క లేదు అత్తయ్య గారు. మీరు ఏం చెప్పినా చేస్తా అని తలాడిస్తుంది కానీ.. బయటికెళ్లాక తనకు నచ్చింది చేస్తుంది అంటుంది మల్లిక. దీంతో ఏదేదో మాట్లాడి అనవసరంగా జానకి గారి మీద నిందలు వేయకు అంటాడు రామా.

మల్లిక అన్నదాంట్లో తప్పేముంది అంటుంది జ్ఞానాంబ. జానకి ప్రవర్తన మారింది. తను నమ్మిందే నిజం అని సొంత నిర్ణయాలు తీసుకుంటోంది అంటుంది జ్ఞానాంబ. ఇంతలో జానకి ఇంటికి వస్తుంది.

పరీక్ష రాశావా జానకి అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో రాయలేదు అత్తయ్య గారు అంటుంది జానకి. దీంతో ఎందుకని అని అడుగుతుంది జ్ఞానాంబ. జెస్సీ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది అని చెబుతుంది జానకి. ఈ విషయం అఖిల్ వింటాడు.

Advertisement

సరిగ్గా ఎగ్జామ్ మొదలయ్యే ముందు నాకు తన తల్లిదండ్రులు ఫోన్ చేయడంతో కాపాడుదామని వెళ్లాను. కడుపుతో ఉన్న ఆడపిల్లకు జరగరానిది ఏదైనా జరిగితే ఆమె తల్లిదండ్రులు ఏమౌతారు. ఆమె ఆత్మహత్యకు మన అఖిల్  కారణం అయితే అది మన కుటుంబానికి ఎంత అవమానం. అందుకే వెళ్లాను అత్తయ్య గారు అంటుంది జానకి.

నువ్వు ఏం చేసినా కానీ.. అత్తయ్య గారు నిన్ను నమ్మరు. వాళ్ల పెళ్లికి ఒప్పుకోరు అంటుంది మల్లిక. దీంతో అర్థం లేకుండా మాట్లాడకు. కడుపుతో ఉన్న ఆడపిల్లకు న్యాయం చేయడానికి చావును అడ్డం పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు అంటుంది జానకి.

చూడు జానకి. నీ చదువుకు, ఈ ఇంటి బాధ్యతలకు ఆటంకం కలగకుండా నువ్వు నిజాన్ని నిరూపించేలా చేయమన్నాను కానీ.. నీ పరీక్షలు ఆపేసి కాదు. ఇంకోసారి ఇలా జరిగితే నేను ఊరుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ.

మరోవైపు అఖిల్ తో మాట్లాడుతాడు రామా. నేను నిజమే చెబుతున్నా అంటాడు అఖిల్. నేను అమ్మ మీద కూడా ఒట్టేశా కదా అంటాడు అఖిల్. అందరికీ చెప్పే సమాధానమే నాకు చెప్పకు. ఒకవేళ నిజంగా నువ్వు తప్పు చేస్తే అమ్మకు ఎంత భయపడతావో నాకు తెలుసు.

ఆ భయంతోనే కడుపు తీయించుకో అని జెస్సీని బెదిరించి ఉంటావు అంటాడు రామా. నువ్వు ఒప్పుకుంటే నీకు ఎలాంటి సమస్య లేకుండా పరిష్కారం చేసే బాధ్యత నాది అంటాడు రామా. దీంతో నాకు ఏ సంబంధం లేదు అంటాడు అఖిల్.

రామా నిలదీసే సరికి కోపంతో ఇంట్లోకి వెళ్లి విషం తాగబోతాడు అఖిల్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి