janaki kalaganaledu 17 january 2022 episode highlights
Janaki Kalaganaledu 17 Jan Tomorrow Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 17 జనవరి 2022, 216 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మైరావతి చెప్పినట్టు జానకిని తీసుకొని సునంద జ్ఞానాంబ ఇంటికి వస్తుంది. జానకిని అప్పగించి మీరు చెప్పినట్టే చేశాను మైరావతి గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లబోతుంది. కార్పొరేటరు అంటూ మైరావతి ఆపి.. దీన్ని బట్టి నీకు ఏం అర్థం అయింది. నీ కొడుకుతో పాటు నువ్వు కూడా తప్పు చేశాను. నీకు ఏదైనా పని కావాలంటే నీ కార్పొరేటర్ పనిని ఉపయోగించుకుంటావు కావచ్చు కానీ.. నేను నా పేరు చెప్పుకుంటాను అంతే.. ఇంకోసారి నా కుటుంబం జోలికి వస్తే నీ కార్పొరేటర్ పదవి ఉండదు. నువ్వు ఉండవు అని సీరియస్ వార్నింగ్ ఇస్తుంది మైరావతి.
janaki kalaganaledu 17 january 2022 episode highlights
పోయేముందు నన్ను క్షమించు అని జ్ఞానాంబతో అంటుంది సునంద. నువ్వు క్షమించే తప్పు చేయలేదు. నిన్ను జీవితంలో క్షమించను అని అంటుంది జ్ఞానాంబ. ఇదివరకులా మనం మంచిగా ఫ్రెండ్స్ గా ఉందాం అంటుంది సునంద. కానీ.. వద్దు నువ్వు చేసిన పనికి నిన్ను క్షమించే సమస్యే లేదు అని చెప్పి తక్షణమే ఈ ఇంట్లో నుంచి వెళ్లిపో అంటుంది జ్ఞానాంబ. తను వెళ్లిపోగానే.. జానకి వెళ్లి మైరావతి కాళ్లు మొక్కబోతుంది కానీ.. మైరావతి మాత్రం పట్టించుకోదు. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. పూజ గదిలోకి వెళ్లి పూజ చేస్తూ ఉంటుంది. అందరికీ హారతి ఇస్తుంది కానీ.. జానకికి ఇవ్వదు. దీంతో జానకి షాక్ అవుతుంది.
ఈ ఇంటి దేవుడికి దండం పెట్టుకునే అర్హత నీకు లేదు. ఆ ఆర్హతను చేతులారా.. నీ అంతట నువ్వే పోగొట్టుకున్నావు అంటుంది మైరావతి. గుమ్మానికి పసుపు ఎట్టాగో.. ఆడపిల్లకు అణకువ అటువంటిది. నువ్వు మాత్రం బయట గొడవలు పెట్టుకుంటున్నావు అంటూ జానకిపై సీరియస్ అవుతుంది మైరావతి.
జానకిని మైరావతి తిడుతుంటే.. మల్లిక చాలా ఖుషీ అవుతుంది. అసలు నిన్ను కాదు.. ఈ జ్ఞానాంబను అనాలి. ఏమే.. ఈ రోజే నీకు చిలక్కు చెప్పినట్టు చెప్పాను. నీ పెద్ద కోడలుకు పద్ధతి పాడు తెలియదు. చదువుకున్నాననే పొగరు ఉంది. తనను ఇంట్లో నుంచి.. రామయ్య జీవితంలో నుంచి పంపించేసేయ్ అని చెప్పా కదా.. అయినా ఇంకా తనను ఇంట్లో పెట్టుకున్నావు ఎందుకు అంటుంది మైరావతి.
అత్తయ్య గారు మీ మాటను కాదన్నందుకు నన్ను క్షమించండి. జానకిని మీరు చూసింది కొద్దిరోజులే. స్వతహాగా తను చాలా మంచిది. పెద్దలంటే ఎంత గౌరవమో.. సాంప్రదాయం అంటే కూడా అంతే విలువ. జానకిని ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే తల దించుకుంటుంది తప్పితే ఎదురు తిరిగి సమాధానం చెప్పదు.. అంటుంది జ్ఞానాంబ.
అలాంటిది కన్నబాబును రోడ్డు మీదే చేయి చేసుకుంది అంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉంటుంది.. అంటుంది జ్ఞానాంబ. అంత బలమైన కారణం ఉంటే ఆ విషయాన్ని పోలీసులకు చెప్పి వాడి మీద తిరిగి కేసు పెట్టొచ్చు కదా. అట్టా కాకుండా నోర్మూసుకొని ఎందుకు కూర్చుంది అని అడుగుతుంది మైరావతి.
అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి జానకి. నువ్వు కారణం లేకుండా ఏం చేయవని నాకు తెలుసు. కన్నబాబును ఎందుకు చేయి చేసుకున్నావు. ఏం జరిగిందో చెప్పు అంటుంది జ్ఞానాంబ. కానీ.. జానకి మాత్రం నోరు తెరవదు. అడుగుతుంది నిన్నే కదా.. మౌనం తప్ప సమాధానం లేదు ఏంటి అంటుంది జ్ఞానాంబ.
నీ కారణంగా అత్తయ్య గారి ముందు నాకు తల దించుకునే పరిస్థితి వచ్చినా కూడా చూస్తూ ఊరుకున్నావు తప్పితే సమాధానం చెప్పవు ఏంటి జానకి అని అడుగుతుంది జ్ఞానాంబ. ఇప్పుడు నేను ఏం చెప్పలేను. దయచేసి నన్ను క్షమించండి అత్తయ్య గారు అంటుంది జానకి.
మధ్యలో మల్లిక కలుగుజేసుకుంటుంది. దీంతో నిన్నెవరైనా అడిగారా.. ఇక్కడి నుంచి వెళ్లు అంటుంది మైరావతి. ఇక నువ్వు అడగడం.. జానకి చెప్పడం అయిపోయింది. ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం మీదనే జానకి భవిష్యత్తు ఆధారపడి ఉంది అంటుంది మైరావతి.
ఒకసారి నా నిర్ణయాన్ని కాదన్నావు. ఇప్పుడు చెప్పు. నీ కోడలు గురించి ఏ నిర్ణయం తీసుకుంటావో ఇప్పుడే చెప్పు అంటుంది మైరావతి. నీకు నీ కోడలు ముఖ్యమా ఇంటి పరువు ముఖ్యమా.. నీ నిర్ణయం చెప్పు అని జ్ఞానాంబను అడుగుతుంది మైరావతి.
అత్తయ్య గారు ఆరోజు మీ మాటను కాదని తప్పు చేశాను. ఈరోజు ఆ తప్పును సరిదిద్దుకుంటాను అంటుంది జ్ఞానాంబ. జానకి ఈక్షణం నుంచి నీకు ఈ ఇంటితో ఉన్న సంబంధం, రామాతో ఉన్న భార్యా అనే అనుబంధం తెగిపోయాయి. ఈ ఇంట్లో నుంచి రామా జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్లిపో జానకి అని అంటుంది జ్ఞానాంబ. దీంతో రామా, జానకి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో…
This website uses cookies.