Janaki Kalaganaledu 18 March Today Episode : వెన్నెల, దిలీప్ నిశ్చితార్థం ఆపేసిన మల్లిక.. జానకే ఇదంతా చేసిందని తెలుసుకున్న జ్ఞానాంబ షాకింగ్ నిర్ణయం

Janaki Kalaganaledu 18 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 మార్చి 2022, శుక్రవారం ఎపిసోడ్ 260 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మల్లిక.. ఒక్క నిమిషం ఇటురా.. నీతో మాట్లాడాలి అని జానకిని పిలుస్తుంది. ఏమైంది మల్లిక.. ఇంత అర్జెంట్ గా నాతో మాట్లాడాల్సిన విషయాలు ఏమున్నాయి అని అడుగుతుంది. ఉన్నాయి జానకి. ఏంటి అలా చూస్తున్నావు. సినిమాల్లో సెంటిమెంట్ సీన్ జరుగుతుంటే.. కామెడీ సీన్స్ వచ్చినట్టు ఈ సీన్ ఏంటనా అంటుంది. సరే.. డైరెక్ట్ గా పాయింట్ మాట్లాడుతాను.. నిశ్చితార్థం నువ్వు ఆపుతావా.. లేక నన్ను ఆపమంటావా అంటుంది మల్లిక.

janaki kalaganaledu 18 march 2022 full episode

దీంతో నిశ్చితార్థం నేను ఆపడం ఏంటి.. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతుంది జానకి. దీంతో మన అత్తయ్యను మోసం చేసి ఈ నిశ్చితార్థం జరుగుతుంటే ఆపకుండా నేను ఊరుకుంటానా అని అంటుంది మల్లిక. వెన్నెల ప్రేమ మ్యాటర్ నాకు ఎప్పుడో లీక్ అయిపోయింది. దిలీప్ వాళ్లు మీ బంధువులు అని చెప్పిన అబద్ధం కూడా నాకు తెలిసిపోయిందన్నమాట. అందుకని నువ్వు వెళ్లి టీవీ యాంకర్ న్యూస్ చదివినట్టు.. ఈ నిశ్చితార్థం ఆపేయవా అంటుంది మల్లిక. దీంతో మల్లిక పాపం వాళ్లు అంటుంది జానకి. కానీ.. నువ్వు ఏం చెప్పబోతున్నావో నాకు తెలుసు అంటుంది జానకి. మల్లిక ఇది జోక్ కాదు.. పెళ్లికి సంబంధించిన విషయం.. అర్థం చేసుకో అంటుంది జానకి.

కానీ.. మల్లిక వినదు. జానకి ఇవన్నీ కాదు.. రెండే రెండు విషయాలు. నువ్వు నిశ్చితార్థం ఆపుతావా.. లేక నన్ను ఆపమంటావా అని అడుగుతుంది మల్లిక. నీ అంతట నువ్వే వెళ్లి చెబితే నీకే మంచిది. అత్తయ్య గారు కొంచెమైనా క్షమిస్తారు. అదే నేను చెప్పాననుకో.. ఇక అత్తయ్య గారు నిన్ను ఈ జన్మలో క్షమించరు.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మల్లిక.

మరోవైపు నిశ్చితార్థం అయిపోతుంది. తాంబూలాలు మార్చుకుంటారు.ఏం చేయాలో జానకికి అర్థం కాదు. ఉంగరాలు మార్చుకునే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దీంతో జానకి ఎక్కడికి వెళ్లింది అని చూస్తారు. ఉంగరాలు ఇవ్వండి అనగానే జానకి అని పిలుస్తుంది జ్ఞానాంబ.

ఉంగరాలు ఇవ్వమంటే జానకి అంటావేంటి అని అంటుంది మైరావతి. ఇంతలో మల్లిక కూడా కనిపించదు. ఒరేయ్ విష్ణు నీ పెళ్లాం ఏదిరా అని అడుగుతుంది. నీ పెళ్లాం కూడా ఎక్కడుందో తెలియదా అని అడుగుతుంది. ఇంతలో మల్లిక వస్తుంది. ఎక్కడికి వెళ్లావు అంటే.. బాత్ రూమ్ కు వెళ్లాను అంటుంది మల్లిక.

Janaki Kalaganaledu 18 March Today Episode : వెన్నెల ఉంగరం తొడుగుతుండగా ఆపిన మల్లిక

ఇంతలో జానకి వస్తుంది. అబ్బాయి కోసం మనం తీసుకొచ్చిన ఉంగరం నీ బ్యాగులోనే ఉండిపోయింది. వెళ్లి తీసుకురా అంటుంది జ్ఞానాంబ. దీంతో తన చేతుల్లో ఉన్న ఉంగరాన్ని ఇచ్చేందుకు వెనకాడుతుంది జానకి. ఓయ్ పిల్ల.. ఉంగరాలు ఇవ్వమంటుంటే వినపడటం లేదా అని అంటుంది మైరావతి.

దీంతో జానకికి ఏం చేయాలో అర్థం కాదు. ఉంగరం ఇవ్వమంటే ఎందుకు ఆలోచిస్తున్నావు అని అంటారు అందరూ. కానీ.. జానకి మాత్రం ఏం మాట్లాడదు. జానకి నువ్వు ఏం చేస్తున్నావో అర్థం అవుతోందా నీకు. ఓవైపు ఉంగరం ఇవ్వమంటే దిక్కులు చూస్తున్నావేంటి.. ఏమైంది నీకు అంటుంది జ్ఞానాంబ.

ఇంతలో రామా ఆ ఉంగరం తీసుకొని జ్ఞానాంబకు ఇస్తాడు. దీంతో ఆ ఉంగరాలను వెన్నెల, దిలీప్ కు ఇచ్చి ఉంగరాలు మార్చుకోండి అని అంటాడు పంతులు. దీంతో వెన్నెల.. దిలీప్ కు ఉంగరం తొడగబోతుంది. ఇంతలో మల్లిక వచ్చి ఆగు వెన్నెల అంటుంది.

ఎందుకు ఆపమంటున్నావు అని అడుగుతుంది మైరావతి. దీంతో మా అత్తయ్య జ్ఞానాంబ పరువు కాపాడుదామని అంటుంది మల్లిక. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అర్థం అవుతుందా అని అంటుంది జ్ఞానాంబ. దీంతో జానకి నా పరువు తీయడం ఏంటి.. అని అడుగుతుంది.

జానకి మాత్రమే కాదు.. మీ పెద్దకొడుకు, వెన్నెల అందరూ కలిసి పెద్ద గూడుపుఠాణీ చేశారండి అంటుంది మల్లిక. అందరూ ఆస్కార్ స్థాయిలో నటించి మిమ్మల్ని పిచ్చోళ్లను చేశారండి అత్తయ్య గారు అంటుంది. ఈ దిలీప్ ఎవరో కాదు.. వెన్నెల ప్రేమించిన అబ్బాయి అంటుంది మల్లిక.

దీంతో అందరూ షాక్ అవుతారు. నిజం మొత్తం చెబుతుంది మల్లిక. కావాలంటే పెళ్లి కొడుకు తల్లిదండ్రులను అడగండి.. వాళ్లే చెబుతారు.. అంటుంది మల్లిక. ఎవరో ఎందుకు.. పెద్దకోడలునే అడగమనండి. అత్తయ్య గారి మీద ఒట్టు పెట్టి నిజమేదో చెప్పమనండి అంటుంది మల్లిక.

నాకెందుకో నమ్మకం కుదరడం లేదు. జానకికి మంచి చేయడం తప్ప మోసం చేయడం తెలియదు అని అంటుంది జ్ఞానాంబ. మన కుటుంబం పరువు కాపాడటం కోసమే తను ప్రయత్నిస్తుంది. నా పరువు పోయేలాగా తను ఎప్పుడూ ప్రవర్తించదు అంటుంది జ్ఞానాంబ.

అయినా కూడా మల్లిక వినదు. దీంతో జానకిని తీసుకొని వెళ్తుంది జ్ఞానాంబ. వెన్నెల కోసం నువ్వు మంచి సంబంధం చూశావని చెప్పగానే నా బాధ్యతగా నువ్వు చూశావని సంతోషపడ్డాను. నా పెద్ద కోడలు ఎప్పుడూ అలా చేయదని నీ మీద నాకు బలమైన నమ్మకం ఉంది.. అంటుంది జ్ఞానాంబ.

కానీ.. నీ మీద మల్లిక అన్ని నిందలు వేస్తుంటే నువ్వు మౌనంగా ఉండటం చూసి నాకు భయంగా ఉంది అంటుంది జ్ఞానాంబ. చెప్పు జానకి.. మల్లిక చెప్పింది అబద్ధం అని చెప్పు. నా నిర్ణయానికి వ్యతిరేకంగా నువ్వు అలా చేయవు అని చెప్పు అంటుంది జ్ఞానాంబ.

సమాధానం చెప్పవేంటి జానకి. ఇందాక మల్లిక మాట్లాడుతుంటే మౌనంగా ఉన్నావు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా మౌనంగా ఉన్నావు.. ఏంటి. అంటే మల్లిక నీ గురించి మాట్లాడిన విషయాలు అన్నీ మేము నిజమని నమ్మాలా అంటుంది.

ఆ తర్వాత జానకి తప్పుచేసిందని తెలుసుకున్న జ్ఞానాంబ.. తన గురించి ఎటువంటి నిర్ణయమైనా మీరే తీసుకోవాలని మైరావతితో అంటుంది. దీంతో మైరావతి.. జానకికి ఏ శిక్ష విధిస్తుందో తెలుసుకోవాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

10 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

11 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

11 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

13 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

14 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

15 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

16 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

16 hours ago