
janaki kalaganaledu 2 december 2021 full episode
Janaki Kalaganaledu 2 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు డిసెంబర్ 2, 2021 గురువారం 184 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబను అరెస్ట్ చేస్తున్నామని ఎస్ఐ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఫంక్షన్ కు వచ్చిన వాళ్లలో 10 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. మీ షాప్ మీద ఇతడు కంప్లయింట్ ఇచ్చాడు అని చెబుతాడు ఎస్ఐ. షాపు పేరు జ్ఞానాంబ పేరు మీద ఉంది కాబట్టి.. తననే అరెస్ట్ చేయడానికి వచ్చాం అంటాడు పోలీస్. ఎక్కడో పొరపాటు జరిగిందండి అంటుంది జ్ఞానాంబ. మేము పాతికేళ్ల నుంచి స్వీట్లు తయారు చేస్తున్నాం. మేము చాలా నాణ్యతతో పూతరేకులు తయారు చేస్తాం. అసలు.. అలాంటి సమస్యే ఉండదు.. అంటుంది జ్ఞానాంబ. కానీ.. పోలీసులు వినరు. ఇవన్నీ మీరు కోర్టులో చెప్పుకోండి. నాకు చెప్పి ఏం ఉపయోగం లేదు అంటారు పోలీసులు. జ్ఞానాంబను అరెస్ట్ చేయక తప్పదు అంటారు పోలీసులు.
janaki kalaganaledu 2 december 2021 full episode
ఎస్ఐ గారు మేము ఒకటికి పది సార్లు చెక్ చేసుకున్నాకే స్వీట్లు తయారు చేస్తాం. ఒకసారి ఆలోచించండి అంటాడు రామా. కానీ.. పోలీసులు వినరు. ఎస్ఐ గారు.. ప్లీజ్ సార్.. నన్ను అరెస్ట్ చేయండి. స్వీట్ షాపు చూసుకునేది నేను అంటాడు రామా. కానీ.. షాప్ పేరు ఎవరి పేరు మీద ఉంటే వారినే అరెస్ట్ చేయాలి అంటాడు పోలీసు. అత్తయ్య గారు మీరైనా చెప్పండి అని సునందను అడుగుతాడు రామా. మీరైనా పోలీసులను అరెస్ట్ చేయొద్దని చెప్పండి.. అంటాడు రామా. చిన్న చిన్న గొడవలు, ఆస్తి తగాదాలు అంటే నేను చెప్పగలను కానీ.. పెద్ద పెద్ద కేసులకు సంబంధించి నేను చెప్పినా పోలీసులు వినరు. నువ్వు అరెస్ట్ కాక తప్పదు జ్ఞానాంబ అంటుంది సునంద. రామచంద్ర.. పోలీసు కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధం అయిపోతాడు. దీంతో జానకి వచ్చి రామాను ఆపుతుంది.
ఏమండి.. మీరు ఆయన కాళ్లు పట్టుకోవడం ఏంటి. అత్తయ్య గారు అరెస్ట్ కారు.. నేను అరెస్ట్ కానివ్వను అంటుంది జానకి. దీంతో అందరూ షాక్ అవుతారు. ఏంటమ్మా ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నావు అంటాడు ఎస్ఐ. ఏదో రెండు డైలాగులు చెప్పగానే ఆగిపోతామనుకుంటున్నారా? అంటాడు పోలీస్.
ఇంతలో జానకి వచ్చి.. ఎలా అరెస్ట్ చేస్తారు. ఏ సాక్ష్యంతో అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి సార్ అని అడుగుతుంది జానకి. దీంతో ఫుడ్ పాయిజన్ అయిందని ఇతను ఫిర్యాదు చేశాడు అంటాడు పోలీస్. దీంతో నేను కూడా ఎవరి మీద అయినా కంప్లయింట్ ఇస్తా వెళ్లి అరెస్ట్ చేస్తారా అని అడుగుతుంది జానకి.
దీంతో అలా ఎలా చేస్తాం అంటాడు పోలీస్. మీరిచ్చిన కంప్లయింట్ కరెక్టో కాదో ఎంక్వయిరీ చేసి అరెస్ట్ చేస్తాం అంటారు. దీంతో మరి ఈ కేసులో ఎందుకు ఎంక్వయిరీ చేయలేదు అంటుంది జానకి. పూతరేకులు తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ అయిందని ఎలా తేల్చుతారు. పూతరేకులతో పాటు ఇతర ఫుడ్ కూడా వచ్చింది కదా. దాని ద్వారా కూడా ఫుడ్ పాయిజన్ అయి ఉండొచ్చు కదా అంటుంది జానకి.
ముందు పూతరేకులను ల్యాబ్ కు పంపించి.. రిపోర్ట్స్ పట్టుకొని వచ్చి అరెస్ట్ చేయండి. మీరు రూల్స్ అన్ని మరిచిపోయినందుకు మీమీద కూడా కేసు పెట్టొచ్చు అంటుంది జానకి. దీంతో రూల్స్ ప్రకారం.. రిపోర్ట్ తీసుకొని వచ్చి అరెస్ట్ చేయకుండా ఎలా ఆపుతావో చూస్తా అని చెప్పి పోలీసులు అక్కడి నుంచి వెళ్తారు.
దీంతో జ్ఞానాంబ.. జానకిని తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంది. అందరూ ఇంటికి తిరిగి వస్తారు. ఎంత పెద్ద కష్టం వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. నా పెద్ద కోడలు నాకు ఉంది అనే భరోసాను, ధైర్యాన్ని నువ్వు కలిగించావు జానకి అంటుంది జ్ఞానాంబ.
దీంతో మల్లికకు తెగ కోపం వస్తుంది. రామా కూడా జానకిని పొడుగుతాడు. ఒకవేళ ఈరోజు చదువుకోని జానకి అక్కడ ఉండి ఉంటే.. నువ్వు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేదానివి అంటుంది అని జ్ఞానాంబకు చెబుతాడు రామా. అయితే.. ఆ వాంతుల మందు ఇంట్లో ఉంటే తనకు ఎక్కడ సమస్య అవుతుందోనని వెంటనే మల్లిక ఆ మందును తీసుకెళ్లి పెరట్లో పడేస్తుంది. ఆ మందును చూసిన జానకి షాక్ అవుతుంది. ఇదే మందును మల్లిక నెయ్యిలో కలిపింది అని రామాకు చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన…
School Holidays : సంక్రాంతి పండుగతో ముగిసిన సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ, ఈ నెలాఖరులో విద్యార్థులకు…
Renu Desai Mahesh Babu : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్‌గా…
Mana Shankara Vara Prasad Garu Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…
Bhatti Vikramarka : ప్రజాభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…
Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…
Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…
Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన…
This website uses cookies.