Janaki Kalaganaledu 20 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 20 అక్టోబర్ 2021, బుధవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు.. జ్ఞానాంబ ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం కాక తెగ ఆలోచిస్తూ ఉంటుంది జానకి. ఇంతలో మంచం కింద ఒక కాగితం కనిపిస్తుంది. అదేంటి అని తీసి చూసేసరికి.. తన డిగ్రీ సర్టిఫికెట్ కనిపిస్తుంది. వామ్మో.. అత్తయ్య గారి కోపానికి కారణం ఇదా? భగవంతుడా అని తనలో తానే అనుకుంటుంది జానకి. ఏం చేయాలో అర్థం కాదు.
ఇంతలో గోవిందరాజు.. రామాకు జానకి చదువు గురించి చెబుతాడు. దీంతో రామా షాక్ అవుతాడు. మీ అమ్మ చాలా కోపంగా ఉందిరా అంటాడు గోవిందరాజు. జానకి వాళ్ల అన్నయ్య యోగిని కూడా పిలిపిస్తోంది. యోగి వచ్చాక తన నిర్ణయం ఏంటో మీ అమ్మ చెబుతానంది. మీ అమ్మ నిన్నటి నుంచి దేని గురించి ఆలోచిస్తోందో అనుకున్నా కానీ.. అగ్నిపర్వతం అంత కోపం, బాధ ఉన్నాయని అర్థం అయింది. మీ అమ్మ మౌనం వెనుక తను తీసుకోబోయే నిర్ణయం తాలుకు ఆలోచన ఉందని అర్థం చేసుకోలేదు. నీ కన్నా తక్కువ చదువుకున్న అమ్మాయితో నీ పెళ్లి చేయాలని మీ అమ్మ చాలా సంబంధాలు చూసింది. జానకి.. నీ కన్నా ఎక్కువ చదువుకోవడంతో జానకి నీ జీవితం నుంచి వెళ్లిపోక తప్పడం లేదు.. అంటాడు గోవిందరాజు. ఒరేయ్ రాముడు.. నాకు భయమేస్తోంది. యోగి వచ్చాక ఎలాంటి గొడవలు జరుగుతాయో.. ఎక్కడ నువ్వు కోడలు దూరం అవుతారో అని నాకు భయంగా ఉంది.. అనగానే నాన్నా బండి ఎక్కండి అని చెప్పి.. ఎక్కడికో తీసుకెళ్తాడు. ఇంతలోనే జానకి కొట్టుకు వస్తుంది. ఆ విషయం చెబుదామనేసరికి.. వాళ్లు ఇద్దరు బండి మీద వెళ్లిపోతారు. ఏమండి అని పిలుస్తూ వెళ్తుంది జానకి.
మరోవైపు జ్ఞానాంబ రెడీ అయి కూర్చుంటుంది. జానకి సర్టిఫికెట్లు పట్టుకొని కూర్చుంటుంది. ఇంతలో జానకి అన్నయ్య యోగి.. అమెరికా నుంచి వస్తాడు. జ్ఞానాంబ గారు నమస్కారం అండి. మీరు ఉన్నపళంగా రమ్మన్నారని మామయ్య గారు చెప్పారు. మేము అప్పటికే దసరా పండుగకు బయలుదేరిపోయాం… అందుకే ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చాను అని అంటాడు యోగి. దీంతో అతడి మీద జానకి చదువుకున్న పేపర్లను విసిరికొడుతుంది జ్ఞానాంబ. ఎందుకు ఇలా నన్ను మోసం చేశావు అని ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ. ఎందుకు? ఎందుకు అని మళ్లీ ప్రశ్నిస్తుంది. దీంతో యోగికి ఏం అర్థం కాదు. చూస్తే.. అవి జానకి సర్టిఫికెట్లు. ఇంతలో రామా, గోవిందరాజు ఇంటికి వస్తారు. యోగిని చూసి షాక్ అవుతారు.
ఏం చదివింది నీ చెల్లెలు అని అడుగుతుంది జ్ఞానాంబ. ఏమని చెప్పాను నీకు. నా మాట చెప్పాను.. నా భయాన్ని చెప్పాను. నా తమ్ముడు పోవడం నా కళ్లారా చూసి భయంతో నిర్ణయం తీసుకున్నానని చెప్పాను. నువ్వు మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు నేను నిన్ను అడిగిన మొదటి ప్రశ్న ఏంటి? నీ చెల్లి చదువు ఏంటి అని.. ఒకటికి వందసార్లు అడిగాను. నీ చెల్లి నిజంగానే 5వ తరగతి చదువుకుందా? అని. ఇవన్నీ నీకు చెప్పినా కూడా నా చెల్లి చదువుకోలేదని ఎందుకు అబద్ధం చెప్పావు.. అని కాలర్ పట్టుకొని నిలదీస్తుంది జ్ఞానాంబ.
అబద్ధం చెప్పడంలో నీ ఉద్దేశం ఏంటి? ఎవరిని మోసం చేద్దామనుకున్నావు. నిజం తెలిశాక వాళ్ల కాపురం ఎలా నిలబడుతుందని అనుకున్నావు అని అంటుంది జ్ఞానాంబ. నేను తప్పు చేశానండి. నన్ను క్షమించండి.. అంటాడు యోగి. క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. దారుణమైన నమ్మకద్రోహం అంటుంది జ్ఞానాంబ. నువ్వు చేసిన మోసం వల్లే.. అని జ్ఞానాంబ అనేసరికి.. మీకు చేతులెత్తి దండం పెడతాను. నేను చెప్పేది ఒకసారి వినండి. మీ కుటుంబం గురించి విన్నాను. బావగారి మంచితనం గురించి తెలుసుకున్నాను. నేను ఎంతగా ప్రయత్నించినా ఎన్ని చోట్ల వెతికినా.. మీలాంటి గొప్ప కుటుంబంలోకి నా చెల్లెలిని కోడలుగా పంపించలేనని నాకు అర్థం అయింది. జ్ఞానాంబ గారికి నా చెల్లెలు కోడలు అయితే నా పుట్టింట్లో ఉన్నంత సంతోషంగా ఉంటుంది. కేవలం నా చెల్లి జీవితం బాగుంటుందనే ఆలోచనతో తన చదువు గురించి అబద్ధం చెప్పాను తప్పితే మిమ్మల్ని మోసం చేయాలని కాదు. మీ కొడుకు భవిష్యత్తుతో ఆడుకోవాలని కాదు.. అంటాడు యోగి.
నా చెల్లెలుకు గౌరవించడం తప్పితే అవమానించడం అస్సలు తెలియదు. తను అలాంటిది కాదు.. అనగానే ఈరోజు ఇలాగే ఉండొచ్చు.. రేపటి రోజున తను అవమానించదని ఏంటి నమ్మకం అంటుంది జ్ఞానాంబ. నా తమ్ముడికి కూడా ముందు అలాగే జరిగింది.. అని అంటుంది.
నీ చెల్లెలి గురించి అబద్ధం చెప్పి పెళ్లి చేసింది నువ్వు కాబట్టి.. నువ్వే ఈ నిర్ణయం తీసుకో. నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకుంటావో అది నీ మీదే ఆధారపడి ఉంది అని చెబుతుంది జ్ఞానాంబ. నువ్వే కాదు.. నీ చెల్లి కూడా తప్పు చేసింది.. ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం.. అని అంటుంది జ్ఞానాంబ. దీంతో జానకి ఇల్లు వదిలి తన అన్నతో వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.