karthika deepam 21 october 2021 full episode
Karthika Deepam 20 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదైంది. 20 అక్టోబర్ 2021, బుధవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. విహారి.. కార్తీక్ ఇంటికి రాగానే.. హిమ అతడిని చూసి మీరు ఎవరు? మీరు మా అమ్మకు ఎలా తెలుసు? అంటూ సవాలక్ష ప్రశ్నలు వేస్తుంది. దీంతో హిమకు అన్ని విషయాలు తెలుసు కావచ్చు అని అనుకొని.. అనవసరంగా గొడవ పెట్టడం ఎందుకు అని అలా ఏం లేదు. మీ నాన్న, నేను ఫ్రెండ్స్ అని చెబుతాడు విహారి. అయినా కూడా హిమ నమ్మదు. చూడమ్మా.. మీ డాడీ నేను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కాకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాను అంటాడు విహారి. అమెరికా వెళ్తుంటే ఆల్ ది బెస్ట్ చెప్పడానికి ఎందుకు వస్తాను అంటాడు విహారి. ఏంటి కార్తీక్ గారు మీరు మాట్లాడరు ఏంటి? మనం మనం మంచి ఫ్రెండ్స్ కదా అంటాడడు విహారి. సరే.. మీరంతా తింటూ ఉంటే మేము రావడం మర్యాద కాదు. బై నాన్నా మీ డాడీ నేను ఫ్రెండ్స్ అంతే.. అని చెప్పి విహారి, తులసి అక్కడి నుంచి వెళ్లిపోతారు.
karthika deepam 20 october 2021 full episode
ఆ విహారి అంకుల్ కూడా మీలాగే అబద్ధాలు చెబుతున్నాడు కదా నానమ్మా అంటుంది హిమ. నేను డైరీ చదివాను నానమ్మా అంటుంది హిమ. అందులో ఇంకా చాలా చాలా ఉన్నాయి తెలుసా? అని చెబుతుంది. ఆ విహారి అంకుల్ పేరు, దీపారాధన బుక్ సంగతి నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి.. అని అంటుంది హిమ. ఇంకా ఏదో చెప్పబోతుంటే ఇక ఆపు హిమ అంటాడు కార్తీక్. అన్నం మధ్యలోనే వదిలేస్తాడు కార్తీక్. అన్నం తినకుండానే అక్కడి నుంచి బయటికి వస్తాడు. కార్తీక్, దీప.. ఇద్దరూ బయటికి రావడంతో విహారి, తులసి దగ్గరికి వస్తారు. అక్కడ.. అందరి ముందు ఏం మాట్లాడాలో తెలియలేదు.. అంటాడు కార్తీక్. పర్లేదు కార్తీక్ గారు మేమే టైమ్ గాని టైమ్ లో వచ్చాం అంటాడు విహారి. మీరు ఎప్పుడూ ఇలాగే బాగుండాలి అంటాడు. ఆల్ ది బెస్ట్ చెబుతాడు విహారి.
కట్ చేస్తే.. విహారి కారు నడుపుతూ.. ఒక చిన్న అపార్థం వాళ్లను 11 ఏళ్లు విడదీసింది.. అని తులసితో అంటాడు విహారి. కార్తీక్.. దీపను అనుమానించాడు కానీ.. నేను మిమ్మల్ని అనుమానించలేదు అంటుంది తులసి. ఇది నిజమే కావచ్చు.. ఏది ఏమైనా కార్తీక్ అలా ఆలోచించాల్సింది కాదేమో.. మొత్తానికి వాళ్లిద్దరిని అలా చూడటం నాకు సంతోషంగా ఉంది అంటాడు విహారి. దీప విషయంలో కార్తీక్ ది తప్పు కావచ్చు కానీ.. మోనిత విషయంలో కార్తీక్ తప్పేమీ లేదు తులసి అంటాడు విహారి.
కట్ చేస్తే.. సౌందర్య, ఆనంద రావు దీనంగా కూర్చొని ఉంటారు. ఇంతలో కార్తీక్ వచ్చి మమ్మీ.. నేను ఒకసారి హాస్పిటల్ కు వెళ్లి వస్తాను అంటాడు కార్తీక్. హాస్పిటల్ ను వాళ్లను హ్యాండోవర్ చేసి వస్తాను అంటాడడు కార్తీక్. నా అనుకునే ఆసుపత్రిని నేనే దూరంగా వెళ్తున్నాను. ఒకరకంగా పారిపోతున్నాను అని అనుకోవడం కరెక్ట్ కావచ్చు అని అంటాడు కార్తీక్. ఇంతలో ఆనందరావు కార్తీక్ ను పిలిచి నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని చెప్పి తనను హగ్ చేసుకుంటాడు. దీంతో సౌందర్య వెక్కివెక్కి ఏడుస్తుంది.
ఇంతలో బయటికి వెళ్లి వస్తుంది దీప. వారణాసి నువ్వు జాగ్రత్త అంటుంది. అందరికీ దూరంగా అమెరికా వెళ్తున్నాం.. అని చెబుతుంది. నువ్వు ఎక్కడున్నా మంచిగా ఉండాలి అక్క అంటాడు వారణాసి. మళ్లీ అమెరికా నుంచి ఎప్పుడు వస్తారు అక్క.. అనగానే తెలియదురా.. ఇక రావద్దనే కోరుకో అంటుంది దీప.
karthika deepam 20 october 2021 full episode
కట్ చేస్తే.. మోనిత విడుదలైనట్టు పేపర్ లో చదువుతుంది సౌందర్య. సరిగ్గా కార్తీక్ ఫ్యామిలీ యూఎస్ వెళ్లే సమయంలోనే మోనిత రిలీజ్ కావాలా? అని అందరూ భయపడతారు. ఈ పేపర్ ను పిల్లలు చూస్తే ఇంకేమైనా ఉందా? అని అనుకుంటారు. ఇంతలో దీప.. పిల్లలను పిలిచి.. పేపర్ చూపించి.. మోనిత ఆంటి రిలీజ్ అయి ఈరోజు వస్తున్నట్టు రాశారు అని చెబుతుంది దీప. దీంతో ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
This website uses cookies.