Janaki Kalaganaledu 22 April Today Episode : జ్ఞానాంబకు షాకిచ్చిన రామా.. జానకికి ఫీజు కట్టేందుకు ఇంట్లో డబ్బులు వాడుతాడా? జ్ఞానాంబ మళ్లీ షాకింగ్ నిర్ణయం

Janaki Kalaganaledu 22 April Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 ఏప్రిల్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 285 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మల్లిక నేను ముగ్గేస్తాను. నువ్వు వెళ్లి అందరికీ టీ పెట్టు అంటుంది జానకి. దీంతో ఆర్డర్ వేస్తున్నావా అంటుంది మల్లిక. నువ్వు పెద్ద కోడలువి కాబట్టి నా మీద పెత్తనం చేస్తున్నట్టుగా ఉంది అంటుంది మల్లిక. దీంతో ఎందుకు అలా మాట్లాడుతున్నావు. ఇలా ఇవ్వు. నేను ముగ్గేస్తాను అంటుంది జానకి. దీంతో సరే తీసుకో అంటుంది మల్లిక. ఇంతలో జ్ఞానాంబ వచ్చి ఆగు మల్లిక.. బుద్ధి ఉందా నీకు. జానకితో పనులు చేయిస్తావా? ఇక నుంచి జానకితో ఏ పనులు చేయించినా మర్యాదగా ఉండదు. నోరు మూసుకొని ఇంటి పని, వంట పని అన్నీ నువ్వే చేయాలి అంటుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu 22 april 2022 full episode

దీంతో మారిపోయారు అత్తయ్య మీరు.. మారిపోయారు అంటుంది మల్లిక. దీంతో అవును.. నా పెద్ద కోడలును నెత్తిన పెట్టుకున్నాను. ఇన్నాళ్లు తన గురించి తెలియక పనులు చేయించాను. ఇప్పుడు తెలిశాక నేను పనులు ఎందుకు చేయిస్తాను అంటుంది జ్ఞానాంబ. అవసరమైతే నేను చేస్తాను తప్ప.. నా పెద్ద కోడలును పని చేయనివ్వను అంటుంది  జ్ఞానాంబ. ఈ ఇంట్లో నువ్వు కేవలం ఒక వస్తువులాగానే ఉంటావు. నా ఇంటి విషయాలతో నీకు సంబంధం ఉండదు. నా ఇంటి విషయాలకు సంబంధించిన విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటుంది. ఇంతలో రామా వస్తాడు. ఇన్ని రోజులు మీరు బయట ఉండి చాలా కష్టాలు పడ్డారని.. మీతో కొన్ని రోజుల పాటు ఏ పనులూ చేయించకూడదని నిర్ణయం తీసుకున్నారట. చూశారా.. మా అమ్మ ఎంత గొప్పగా ఆలోచించారో అని జానకితో అంటాడు రామా.

అమ్మ నేను కొట్టుకు వెళ్లివస్తాను అని చెప్పి అమ్మ చెప్పినట్టు వినండి అని జానకికి చెప్పి కొట్టుకు వెళ్తాడు రామా. అత్తయ్య గారు అంటూ ఏదో మాట్లాడబోతున్నా జ్ఞానాంబ వినదు. ఇంతకుముందే చెప్పా కదా ఇక వెళ్లు అంటుంది. అది కాదు అన్నా కూడా వినదు జ్ఞానాంబ.

మరోవైపు యోగి.. జానకి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలో తనకు అర్థం కాదు. ఇంతలో ఊర్మిల తనకు మజ్జిగ తీసుకొస్తుంది. మజ్జిగను తాగకుండా పక్కన పెట్టస్తాడు. ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదు ఊర్మిల అంటాడు. రేపు మనం జానకి వాళ్ల ఇంటికి వెళ్లాలి అంటుంది ఊర్మిల.

దీంతో ఆ జ్ఞానాంబ ఇంటికి మనం వెళ్లడం ఏంటి. ఆవిడకు మన మీద పీకల్లోతూ కోపం ఉంది. వాళ్లకు నాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉంది అంటాడు. ఎల్లుండి మన బాబు బారసాల. వాళ్లను వెళ్లి కుటుంబ సమేతంగా పిలవాలి కదా అంటుంది.

Janaki Kalaganaledu 22 April Today Episode : యోగికి నచ్చజెప్పిన ఊర్మిల

మనం వెళ్లి పిలిస్తే వాళ్లు వస్తారా? అసలు మాట్లాడే అవకాశమే ఇవ్వదు ఆ జ్ఞానాంబ అంటాడు యోగి. అందుకని ఈ దూరాన్ని అలాగే పెంచుకుంటూ పోతామా? కోపతాపాలు వచ్చాయని బంధాలు తెంచేసుకుంటామా అంటుంది ఊర్మిల. ఆ ఇంటితో ప్రేమను పెంచుకోవాలి కానీ.. పగను కాదు అంటుంది ఊర్మిల.

వెళ్లి వాళ్లను పిలవడం మన బాధ్యత అని యోగికి నచ్చజెప్పుతుంది ఊర్మిల. మరోవైపు జానకి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అభి తనకు ఫోన్ చేస్తాడు. ఏంటి జాను.. నువ్వు కోచింగ్ సెంటర్ కు నైట్ టైమ్ కూడా వెళ్లడం లేదా అని అడుగుతాడు.

దీంతో ఇంట్లో పనుల వల్ల వెళ్లడం కుదరలేదు అంటుంది. నైట్ కూడా వెళ్లకపోతే ఎలా కుదురుతుంది అంటాడు. వారం రోజుల్లో ఫీజు కూడా కట్టాలి. లక్ష రూపాయలు అని చెబుతాడు. ఇంతలో రామా వస్తాడు. రామాకు ఆ విషయం చెబుతుంది జానకి. దీంతో ఆ డబ్బులు ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తాడు రామా.

ఎలాగోలా కట్టేద్దాం అండి. మీరేం టెన్షన్ పడకండి అంటాడు రామా. మీరు ఐపీఎస్ అవ్వాలని అనుకుంటున్నారని అమ్మకు తెలిస్తే ఇంకా సంతోషిస్తుంది. మీరేం టెన్షన్ పడకండి. మీ చదువు గురించి.. ఫీజు గురించి నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు రామా.

కట్ చేస్తే.. తెల్లారుతుంది. రామా 3 లక్షలలో ఒక లక్ష కావాలని జ్ఞానాంబను అడుగుతాడు. అమ్మ.. విశ్వనాథం గారింట్లో పెళ్లికి ఇచ్చిన ఆర్డర్ కు సంబంధించిన డబ్బులు అవి. ఇంతలో జ్ఞానాంబ ఏదో చెప్పబోతుంది. కూర్చో అంటుంది. ఏం లేదు నాన్న.. మన ఊరు ఒకప్పటి కంటే ఇప్పుడు బాగా పెరిగింది అంటుంది.

మన స్వీటు కొట్టు మన ఊరికి దూరం అయిపోయింది అని చెబుతుంది. జనాలు ఎక్కువగా ఉండే ప్లేస్ లో అక్కడ కొట్టు పెడదాం అని చెబుతుంది. దీంతో సరే అంటాడు. ఆలస్యం చేయకుండా.. ఈ రెండు మూడు రోజుల్లో మంచి కొట్టు చూసి.. ఈ డబ్బును అడ్వాన్స్ గా ఇచ్చేద్దాం. అప్పటి వరకు ఈ డబ్బును నీ దగ్గరే అట్టి పెట్టు అంటుంది జ్ఞానాంబ.

దీంతో సరే అంటాడు రామా. కానీ.. జానకి కోసం ఫీజు ఎలా కట్టాలా అని ఆలోచిస్తుంటాడు. ఈ డబ్బును ఏ అవసరానికి వాడకు అని మరీ చెబుతుంది. దీంతో సరే అమ్మ అంటాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Papaya | రాత్రిపూట బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…

38 minutes ago

Cumin nutrition | జీలకర్ర ఎక్కువగా తింటున్నారా.. ఆరోగ్య ప్రయోజనాల వెంట కొన్ని ప్రమాదాలు కూడా

Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…

2 hours ago

Tulasi Kashayam | తులసి కషాయం ఆరోగ్యానికి అమృతం లాంటిది .. వర్షాకాలంలో రోగనిరోధకత పెంచే పానీయం

Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…

3 hours ago

Zodiac Signs | పండగ సమయంలో మూడు రాశులపై కేతువు అనుగ్రహం ..ఆర్థిక లాభాలు, అదృష్టం కురిసే చాన్స్

Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…

4 hours ago

Vivo | వివో నుంచి కొత్త బ్లాక్‌బస్టర్ ..Vivo T4R 5G స్మార్ట్‌ఫోన్ ₹17,499కే!

Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…

13 hours ago

Jupitar Price | జీఎస్టీ రేట్లు తగ్గడంతో టీవీఎస్ బైకులు, స్కూటీల ధరలు భారీగా తగ్గింపు .. కొత్త ధరల వివరాలు ఇదే!

Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…

14 hours ago

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

16 hours ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

18 hours ago