
Janaki Kalaganaledu 25 August 2022 Full Episode
Janaki Kalaganaledu 25 August 2022 Episode ; బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కలగనలేదు. ఈ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 374 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… డాక్టర్ మల్లికా ప్రెగ్నెంట్ కాదని అందరికీ తెలియజేస్తుంది. దాంతో మండిపడిపోతున్న జ్ఞానంబ మల్లిక అని గట్టిగా అనగానే మల్లిక నిద్రలోంచి లేచి వద్దు అత్తయ్య గారు, వద్దు అత్తయ్య గారు, వద్ద అత్తయ్య గారు ఇంకోసారి ఇలా చేయను నన్ను పుట్టింటికి పంపించకండి అని కలకంటుంది. విష్ణు ఒక్కసారిగా లేసి ఏమైంది నీకు రేపు దేవుడి దగ్గర నుంచి తాడు తీసుకొచ్చి కడతాను అని అంటాడు. మల్లికా మాత్రం తెల్లవారుజామున వచ్చిన కళ నిజమవుతుంది అని అనుకుంటూ భయపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మల్లికా టీవీ చూస్తూ సంతోష్ పడిపోతూ ఉంటుంది. జానకి మాత్రం హడావిడిగా పనులు చేస్తూ కాలేజీకి వెళ్లడానికి సిద్ధమవుతూ ఉంటుంది.
రామ మాత్రం జానకిని టైం అయిపోతుంది తొందరగా రండి అని పిలుస్తూ ఉంటాడు. జానకి కాలేజీ కి వెళ్తూ మల్లికకు టిఫిన్ పెట్టి అన్ని జాగ్రత్తలు చెప్పి గోవిందరాజుకి కాళ్ళకి దండం పెట్టి వెళ్తుండగా.. మల్లిక జానకిని నాకు ఇడ్లీ తినాలనిపించడం లేదు అని అంటుంది. అప్పుడు గోవిందరాజు కావాలంటే నువ్వు చేసుకుని తిను తనని కాలేజీకి వెళ్ళనివ్వు.. అని చెప్తుంది. సరే నేను చేసి పెట్టి వెళ్తానులే పాపం నో రారా అడిగింది అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ నువ్వు ఎల్లమ్మ నేను చేసి పెడతాలే అని అంటుంది. అప్పుడు జానకి వెలిపోతుంది. నేను వెళ్లి తీసుకొస్తాను అని అంటుంది జ్ఞానాంబ. అప్పుడు మల్లికా మనసులో సంబరపడిపోతూ బయటికి మాత్రం డ్రామాలాడుతూ ఉంటుంది. గోవిందరాజు మాత్రం మల్లికను వేటకారం చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే జానకి రామ కాలేజీకి వెళ్తుండగా… ఒక ముసలావిడ రోడ్డుమీద పండ్ల తట్టను ఎత్తుకోలేకపోతుంటే జానకి ఆమెకు సహాయం చేస్తుంది.
Janaki Kalaganaledu 25 August 2022 Full Episode
జానకిని ఆ ముసలావిడ దీవిస్తుంది. దాంతో రామ జానకిని పొగుడుతూ ఉంటారు. కట్ చేస్తే మల్లిక పండ్లు తింటూ ఉంటుంది. గోవిందరాజు వచ్చి మల్లికను చూస్తూ కామెడీ చేస్తాడు. అంతలో జ్ఞానంభ పిలిచి డ్రైఫ్రూట్స్ ఎలా తినాలో చెప్తుంది. దాంతో మల్లిక తెగ సంబరపడిపోతూ అక్కడే అన్ని కలిపి మెక్కుతూ ఉంటుంది. గోవిందరాజు మాత్రం మల్లికను గ్రహాలు నీకు అనుకూలంగా మారినట్లు ఉన్నాయి నీకు తెగ కలిసి వచ్చేసింది. అని అంటాడు. మల్లిక, గోవిందరాజు కూడా పనులు చెబుతూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ నేను కొట్టుకు వెళ్తానండి రామకి పక్కన ఊర్లో ఏదో పని ఉందట అని చెప్పి వెళ్తుంది. కట్ చేస్తే… జెస్సి సాంప్రదాయంగా రెడీ అయి వచ్చి జానకిని మా పెళ్లి జరిగేలా నువ్వే హెల్ప్ చేయక్క అని అడుగుతుంది. అప్పుడు జానకి అఖిల్ మీద మా అత్తయ్య గారు, మావయ్య గారు చాలా ఆశలు పెట్టుకున్నారు. వాళ్లు అనుగుణంగా అఖిల్ నడవాల్సిందే.
కాబట్టి నువ్వు ఇవన్నీ మర్చిపో అని చెప్తుంది. అప్పుడు జెసి ఎలాగైనా సరే నేను అఖిల్ ని దక్కించుకుంటాను అని అంటుంది. కట్ చేస్తే మల్లిక ఎంత భోగాన్ని అనుభవించుకుంటూ కాలు మీద కాలు వేసుకొని కూర్చుని తింటూ ఉండగా అక్కడికి లీలావతి వస్తుంది. లీలావతి మల్లికను నీ తెలివి తెలివితేటలతో రాజబోగం అనుభవిస్తున్నావే అని అంటుంది. అవును పెద్దమ్మ అంతా నీ వల్లే అని అంటుంది మల్లిక. అప్పుడు లీలావతి మల్లికను ఒక 5000 అప్పుగా కావాలి ఇవ్వవా అమ్మ అని అడుగుతుంది. దాంతో మల్లిక నేను ఇలా రాజభోగం అనుభవించడానికి కారణం నువ్వే కాబట్టి సరే అని తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు లీలావతి ఇప్పుడు సరేగాని ఒకనాటికి నీ కడుపు అబద్ధమని తెలిస్తే ఏం చేస్తావ్ అని అంటుంది. అప్పుడు మల్లికా కడుపు వచ్చిందని డ్రామా ఆడిందాన్ని.. రేపు కడుపు పోయిందని డ్రామా ఆడలేమా.. ఆరోజు వస్తే అంతా జానకి మీదికి నెట్టేస్తాను అని మల్లికా అంటుండగా.. జానకి, రామ వస్తారు. ఇక రేపు ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.