Janaki Kalaganaledu 26 May Today Episode : మల్లిక ప్లాన్ రివర్స్.. రూ.లక్ష గోవిందా.. రామా, జానకికి షాకిచ్చిన జ్ఞానాంబ

Janaki Kalaganaledu 26 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 మే 2022, గురువారం ఎపిసోడ్ 309 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన పెద్ద కోడలు, పెద్ద కొడుకును పెళ్లికి పంపిద్దాం అంటాడు గోవిందరాజు. దీంతో వాళ్లెందుకు మేము వెళ్తాంలే అంటుంది మల్లిక. దీంతో పెద్ద కొడుకు, పెద్ద కోడలును పంపించడం సాంప్రదాయం అంటాడు గోవిందరాజు. ఏమంటావు జ్ఞానం.. రామా, జానకిని పెళ్లికి పంపిద్దామా అని అడిగితే సరే అంటుంది జ్ఞానాంబ. మరోవైపు మల్లిక తన ప్లాన్ ను అమలు చేయడానికి రెడీ అవుతుంది. నీలావతికి ప్లాన్ చెప్పినట్టుగా.. తను దాచుకున్న లక్ష రూపాయలను బీరువాలో నుంచి తీస్తుంది. అవసరం అయితే 20 రూపాయలు వడ్డీకి ఇచ్చి అయినా సంపాదించొచ్చు కానీ.. జానకి పెళ్లికి వెళ్లకుండా ఎలాగైనా ఆపాలి అని అనుకుంటుంది మల్లిక.

janaki kalaganaledu 26 may 2022 full episode

నీలావతి పంపించే వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ.. ఇంకా రాడు. కొంతసేపు ఆగండి.. మీ అందరికీ ఎలా పుల్లలు పెడతానో అని అనుకుంటుంది మల్లిక. ఈ అటుకుల చిట్టిబాబు చచ్చినోడు ఇంకా రావట్లేదు ఏంటి అని అనుకుంటుంది. అప్పుడే కారు దిగుతాడు చిట్టిబాబు. అతడిని చూస్తుంది మల్లిక. చిట్టిబాబు నువ్వేనా అంటుంది. నట సునామి అటుకుల చిట్టిబాబు అంటుంది. నీలావతి పెద్దమ్మ చెప్పిన సీన్ గుర్తుంది కదా అంటుంది. దీంతో నేను ఒక్కసారి సీన్ విన్నానంటే.. ఇక మామూలుగా ఉండదు.. బీభత్సమే అంటాడు. నిన్ను నమ్మి లక్ష రూపాయలు ఇస్తున్నాను అంటుంది. తర్వాత లోపలికి వెళ్తాడు చిట్టిబాబు.

చిట్టిబాబు లోపలికి వెళ్లి.. జ్ఞానాంబ గారు అని పిలుస్తాడు. దీంతో జ్ఞానాంబతో పాటు గోవిందరాజు, రామా, జానకి అందరూ అక్కడికి వస్తారు. నాపేరు అటుకుల చిట్టిబాబు అండి. పెళ్లికి 2000 మందికి స్వీట్లు ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాను అంటాడు.

దీంతో మిమ్మల్ని ఈ ఊళ్లో ఎప్పుడూ చూడలేదే అంటుంది జ్ఞానాంబ. మాది ఇదే ఊరు. మీ కొట్లో పూతరేకులు బాగుంటాయని చెబితే అడ్రస్ వెతుక్కుంటూ వచ్చాను అంటాడు. ఎల్లుండి మా అమ్మాయి పెళ్లి.. మాకు 5 రకాల స్వీట్లు పంపించండి అంటాడు. ఇదిగోండి.. లక్ష రూపాయల అడ్వాన్స్ అంటాడు.

అయితే.. పెళ్లి అవతల ఎల్లుండి అన్నారు కదా. మా పెద్ద కొడుకు, కోడలు పెళ్లికి వెళ్తున్నారు. ఆర్డర్ అందించలేం అంటాడు గోవిందరాజు. కానీ.. జ్ఞానాంబ గారి హస్తవాసు మంచిదని విన్నాను అంటాడు చిట్టిబాబు. ఆడపిల్ల పెళ్లి అంటున్నారు కదా.. సెంటిమెంట్ గా ఫస్ట్ మన దగ్గరికే వచ్చారు అంటుంది మల్లిక.

Janaki Kalaganaledu 26 May Today Episode : చిట్టిబాబు ఆర్డర్ ను ఒప్పుకున్న జ్ఞానాంబ

కుదరదు అంటే పాపం అపశకునం అని అనుకుంటారు కదా. ఆడపిల్ల తండ్రి బాధపడటం ఎందుకు అని అంటుంది మల్లిక. దీంతో సర్లే నువ్వు ఇక ఉండు అంటాడు గోవింద రాజు. మీరు మరోలా అనుకోకండి. మిమ్మల్ని వెనక్కి పంపించాలనడం మా ఉద్దేశం కాదు. దయచేసి అర్థం చేసుకోండి అంటాడు గోవిందరాజు.

దయచేసి మీరే అర్థం చేసుకోండమ్మా అని అంటాడు చిట్టిబాబు. మీకూ ఆడపిల్లలు ఉండి ఉంటారు. ఇలా తొలిసారి నాకు అపశకునం ఎదురైతే బాగుండదు అంటాడు చిట్టిబాబు. దీంతో మీ ఆర్డర్లు ఇచ్చి పంపిస్తాం.. సంతోషంగా వెళ్లిరండి అంటుంది జ్ఞానాంబ.

దీంతో రామా, జానకి, గోవింద రాజు షాక్ అవుతారు. ఈ స్వీట్లు అన్నీ ఎవరు తయారు చేస్తారు అని అడుగుతాడు గోవిందరాజు. దీంతో రామా వైజాగ్ పెళ్లికి వెళ్లకపోయినా పర్వాలేదు లెండి అంటుంది జ్ఞానాంబ. అది కాదు జ్ఞానం అంటాడు గోవిందరాజు.

మనం ఆ పెళ్లికి వెళ్లకపోతే ఎలా అంటాడు గోవిందరాజు. దీంతో వాళ్లు కాకపోతే మల్లిక, విష్ణు వెళ్తారు లెండి అంటుంది జ్ఞానాంబ. రామాను పిలిచి ఏం ఏం స్వీట్లు చేయాలో చూద్దాం పదా అని రామాను తీసుకొని వెళ్తుంది. మరోవైపు నీలావతి.. మల్లిక తెచ్చే చీర కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

మల్లిక.. నీలావతికి చీర ఇస్తుండగా చూసిన విష్ణు దాన్ని తన ఫోన్ లో రికార్డు చేస్తాడు. నీలావతి వెళ్లిపోగానే.. అక్కడికి వెళ్లిన విష్ణు.. సర్ ప్రైజ్ అయ్యావా మల్లిక అని చెప్పి తనకు ఫోన్ లో వీడియోను చూపిస్తాడు. ఈ వీడియో క్వాలిటీ అదిరిపోయింది కదా అంటాడు.

వీడియో ఎందుకు తీశారు అంటుంది మల్లిక. దీంతో నీ పర్ ఫార్మెన్స్ అమ్మకు చూపిద్దామని అంటాడు. నువ్వే ఎలాగైనా అన్నయ్య, వదినను వైజాగ్ వెళ్లేలా చేయాలి అంటాడు. దీంతో ఏం చేయాలో మల్లికకు అర్థం కాదు. నువ్వు వెంటనే వెళ్లి మా అమ్మను ఒప్పించకపోతే వెంటనే ఈ వీడియోను మా అమ్మకు పంపిస్తాను అంటాడు విష్ణు.

మరోవైపు ఫుడ్ కాంపిటిషన్ కు వెళ్లడం లేదని టెన్షన్ పడతారు రామా, జానకి. అప్పుడే అక్కడికి వచ్చిన జ్ఞానాంబ.. ఏం ఆలోచిస్తున్నావు అంటుంది. రేపు పొద్దున పెళ్లికి ఏం స్వీట్లు చేయాలా అని ఆలోచిస్తున్నావా అని అంటుంది. మరి.. ఏం తయారు చేసి పంపిద్దాం అంటుంది.

ఇంతలో గోవిందరాజు వచ్చి మళ్లీ వాళ్లను పెళ్లికి పంపించు అంటాడు. నేను ఈ ఆర్డర్ తీసుకుంది డబ్బుల కోసం కాదు. అతడు మన మీద పెట్టుకున్న నమ్మకం కోసం అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

3 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

5 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

9 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

12 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

15 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

1 day ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

1 day ago