Janaki Kalaganaledu 28 April Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 ఏప్రిల్ 2022, గురువారం ఎపిసోడ్ 289 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యోగి, ఊర్మిల ఇద్దరూ తన కొడుకును తీసుకొని జ్ఞానాంబ ఇంటికి వస్తారు. మల్లిక వాళ్లను చూస్తుంది. జ్ఞానాంబ గారు అని ఊర్మిల పిలుస్తుంది. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. గోవింద రాజు కూడా వస్తాడు. రామా, జానకి కూడా వస్తారు. జానకి వాళ్లను చూసి షాక్ అవుతుంది. వీళ్లు ఎందుకు వచ్చారు అని అనుకుంటుంది మల్లిక. ఇంతకుముందు ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా.. కూర్చోబెట్టి మాట్లాడేవారు కానీ.. ఇప్పుడు మీరు లోపలకి పిలవలేదంటే మా ఆయన చేసిన తప్పు ఎంత పెద్దదో నాకు అర్థం అవుతోంది అంటుంది ఊర్మిల.
ఇంతలో మల్లిక అందుకుంటుంది. ఇంకా ఇప్పుడు ఏం చేద్దామని వచ్చారో ఏంటో అంటుంది. ఏమండి.. లోపలికి రమ్మని చెప్పండి అంటుంది జ్ఞానాంబ. దీంతో గోవిందరాజు.. వాళ్లను లోపలికి పిలుస్తాడు. కూర్చోని మాట్లాడుదాం అంటాడు. దీంతో వాళ్లు లోపల అడుగు పెట్టబోయేసరికి ఆగండి అంటాడు రామా. దీంతో అందరూ షాక్ అవుతారు. వాళ్ల దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చారు అంటాడు. దీంతో బావ గారు రేపు మా అబ్బాయి బారసాల అంటాడు యోగి. అమ్మ.. మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాం అంటుంది ఊర్మిల. ఓహో.. మేనల్లుడి బారసాల ఫంక్షన్ కు జానకిని పిలవడానికి వచ్చారా.. సిగ్గుండాలి అంటుంది మల్లిక.
అత్తయ్య గారు సాక్షాత్తూ మా నాన్నగారే మాకు పుట్టారని సంబుర పడుతున్నాం. మా బిడ్డకు మీ అందరి ఆశీస్సులు కావాలి. మీరంతా తప్పకుండా రావాలి అత్తయ్య గారు అంటాడు యోగి. మా అమ్మ తప్పున నిర్ణయాన్ని నేను చెబుతున్నాను. జానకి గారి వాళ్ల నాన్న గారే ఈ బిడ్డ రూపంలో పుట్టాడు అని మీరు అనుకుంటున్నారు కాబట్టి.. బారసాల ఫంక్షన్ కు జానకి గారు మాత్రమే వస్తారు అంటాడు రామా.
దీంతో అందరూ షాక్ అవుతారు. మేము ఎవ్వరం రావట్లేదు అంటాడు రామా. దీంతో జానకి కూడా షాక్ అవుతుంది. అదేంటి అన్నయ్య గారు అలా అంటున్నారు. శుభమా అని బారసాల ఫంక్షన్ చేస్తుంటే.. మీరందరూ వచ్చి దీవిస్తే వీడికి బాగుంటుంది అంటుంది ఊర్మిల.
దీంతో మీ ఆయన మా అమ్మకు చేసిన అవమానం ఎప్పటికీ మా గుండెల్లో రగులుతూనే ఉంటుంది అంటాడు రామా. మా ఆయన చేసింది తప్పే.. అందుకు మేమూ బాధపడుతున్నాం. పశ్చాతాపంతో మీ అమ్మగారిని క్షమాపణ అడగడానికి వచ్చాం అంటుంది ఊర్మిల.
దీంతో కానీ.. నేను క్షమించను. మా అమ్మను ఎవరైనా ఒక్క మాట అంటేనే నేను ఊరుకోను. అలాంటి మా అమ్మ పరువు తీసి అంత మానసిక క్షోభ పెడితే నేను ఊరుకుంటానా అంటాడు రామా. అంత తేలికగా క్షమిస్తానా. ప్రాణం పోయేంత వరకు క్షమించను అంటాడు రామా.
చూడండి బావ గారు అనబోతుంటే నువ్వు మాట్లాడకు అంటాడు రామా. మా ఇంటికి వచ్చే అర్హత.. మాతో మాట్లాడే అర్హత నువ్వు కోల్పోయావు. ఇంకోసారి నువ్వు ఇలా వస్తే.. అస్సలు బాగోదు అంటాడు రామా. చూడమ్మా.. నా కోపాన్ని చాలా అదుపు చేసుకున్నాను. రేపు బారసాల ఫంక్షన్ కు జానకి గారు ఒక్కరే వస్తారు. మీరిక బయలు దేరండి. వెళ్లండి అంటాడు రామా.
దీంతో అమ్మతో ఒక్క నిమిషం మాట్లాడి వెళ్లిపోతాను అన్నయ్య గారు అంటుంది ఊర్మిల. దీంతో రామా లోపలికి రమ్మని చెప్పు అంటుంది జ్ఞానాంబ. దీంతో ఊర్మిల.. ` జ్ఞానాంబ దగ్గరికి వెళ్తుంది. అమ్మ.. ఒక అమ్మలా ప్రేమించడంలోనూ.. క్షమించడంలోనూ మీకు ఎవ్వరూ సాటి కాదు. అందుకే మా తరుపున జరిగిన తప్పును క్షమించి.. మీరంతా కుటుంబ సమేతంగా వస్తారని ఆశించి వచ్చాను.
రేపు కూడా అదే ఆశతో ఎదురు చూస్తూ ఉంటాము. మీరు రాకపోతే బారసాల ఫంక్షన్ జరగదు. మీ కుటుంబం అంతా వచ్చేవరకు.. నా బిడ్డకు సంబంధించిన ఏ ఫంక్షన్ చేయను… క్షమించండి అని చెప్పి ఊర్మిల అక్కడి నుంచి బయటికి వెళ్లిపోబోతూ.. జానకి దగ్గర ఆగుతుంది.
జానకి తనతో మాట్లాడాలని అనుకుంటుంది కానీ.. జ్ఞానాంబను చూసి ఆగిపోతుంది. దీంతో ఊర్మిల అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. చూశారా అత్తయ్య గారు ఆవిడ తెలివితేటలు. మనం ఎవ్వరం వెళ్లకపోతే.. ఫంక్షన్ ఆపేస్తానని చెప్పింది. వామ్మో.. చావు తెలివితేటలు అంటుంది మల్లిక.
ఆ తర్వాత అక్కడి నుంచి యోగి, ఊర్మిల వెళ్లిపోతారు. ఆ తర్వాత రామా, జానకి అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీ మేనల్లుడి బారసాల విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే మాత్రం ఈ క్షణమే ఆ ఆలోచనను తీసేయండి అంటాడు రామా.
దీంతో జానకి షాక్ అవుతుంది. ఎందుకంటే.. మా అమ్మను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించిన మీ అన్నయ్యను నేను ఈ జన్మలో క్షమించను అంటాడు రామా. మరోవైపు గోవింద రాజు.. జ్ఞానాంబను ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు. అయినా మనం వెళ్లకుండా జానకి ఎలా వెళ్తుంది చెప్పు అంటాడు గోవింద రాజు.
దీంతో డ్రైవర్ ను ఇచ్చి మన కారులో పంపించండి అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.