Home » Entertainment » Kgf Movie Goes On To The Soon
Entertainment

KGF : కేజీఎఫ్ 3 సినిమా కూడా ఉంటుంద‌ట‌.. య‌ష్ సీక్రెట్స్ బ‌య‌ట‌పెట్టాడుగా..!

Authored By
Sam C
The Telugu News | Updated on: April 28, 2022 11:01 am
Advertisement

KGF: ఇటీవ‌లి కాలంలో విడుద‌లై బాక్సాఫీస్‌ని షేక్ చేసిన చిత్రం కేజీఎఫ్ 2. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ కేజీఎఫ్ 2 చిత్రం అందాటుకుని దూసుకుని వెళుతోన్న సంగతి తెలిసిందే. కన్నడ రాక్ స్టార్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెల్సిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘కేజీఎఫ్’ మూవీ విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. విడుదలైన ప్రతి ఏరియాలో ఈ సినిమా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. హిందీలో అయితే తొలి రోజు నుంచే ఈ సినిమా దూకుడు మామూలుగా లేదు.

Advertisement

కేజీఎఫ్ 3పై అంచనాలు..

‘కేజీఎఫ్’ రెండో పార్ట్ చివర్లో ఈ మూవీకి మరో సిక్వెల్ రాబోతుందనే దర్శకుడు ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చాడు.బాహుబ‌లి 1,2 సినిమాలు చేసిన‌ట్లుగానే ఇప్పుడు కెజి.ఎప్‌.1,2 చిత్రాలు వ‌చ్చాయి. కెజి.ఎఫ్‌.2కు వూహించ‌ని స‌క్సెస్ సాధించిపెట్టారు ప్రేక్ష‌కులు. దాంతో యష్ ఈ సినిమాపై స‌రికొత్త కామెంట్ చేశారు. నేడు క‌న్న‌డ టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కేజీఎఫ్ 3 చిత్రం కూడా వుంటుంద‌ని హిట్ ఇచ్చారు. షూటింగ్ జ‌రిగిన‌ప్పుడు దర్శకుడు ప్రశాంత్‌తో చాలా సీన్స్ గురించి చర్చించాం. కొన్ని వ‌ర్క‌వుట్ కాలేదు. అవ‌న్నీ ఇప్ప‌టికీ హైలైట్ అవుతాయ‌నే న‌మ్మ‌క‌ముంది.

kgf movie goes on to the soon

Advertisement

వాటిని మూడో పార్ట్‌లో పెడ‌తామ‌ని ఆలోచిస్తున్నాం. అయితే కేజీఎఫ్ 3 వ‌ర్క‌వుట్ కావ‌డానికి చాలా టైం ప‌డుతుంది. అది ఎప్పుడు ఏమిటి అనేది త్వ‌ర‌లో తెలియ‌జేస్తామ‌ని అన్నారు. ఇప్ప‌టికే ప్ర‌శాంత్ నీల్ బిజీ అయ్యాడు. ప్ర‌భాస్‌తో సినిమా చేబోతున్నాడు. మ‌రి ఆ సినిమా పూర్త‌య్యాక య‌ష్‌తో సినిమా వుంటుందేమో చూడాలి. కేజీఎఫ్ 3 కథ విషయానికి వస్తే… ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ సినిమా చివర్లో రాఖీభాయ్ సముద్రంలో పడిపోతాడు. విలన్లు రాఖీభాయ్ ఉన్న షిప్ ను క్షిపణులతో టార్గెట్ చేశారు. సీన్ కట్ చేస్తే.. రాఖీ రక్తపు మరకల్లో సముద్రం నీళ్లలో కన్పిస్తాడు. బంగారమంతా సముద్రంలో కలిసిపోతుంది. దీంతో రాఖీబాయ్ బ్రతికి ఉంటాడని.. సబ్ మైరన్ ద్వారా గోల్డ్ ను సముద్రంలో దాచి ఉంటాడనే టాక్ విన్పిస్తోంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి