Janaki Kalaganaledu 3 september 2021 friday episode 120 highlights
Janaki Kalaganaledu 3 september 2021 friday episode 120 highlights
Janaki Kalaganaledu 3 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 3 సెప్టెంబర్ 2021, శుక్రవారం రిలీజ్ అయింది. ఈ రోజు ఎపిసోడ్ 120 హైలైల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి ముగ్గు వేస్తానని చెప్పినా.. వినకుండా.. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తానే ముగ్గు వేస్తానని చెబుతుంది జ్ఞానాంబ. అందరినీ రెడీ అవ్వమని చెప్పు.. అని చెబుతుంది.
Janaki Kalaganaledu 3 september 2021 friday episode 120 highlights
అందరూ వచ్చారు కానీ.. మల్లిక ఏది.. అని అడుగుతుంది జ్ఞానాంబ. తన గురించి ఎవరికి తెలియదు. అందరూ సంతోషంగా ఉంటే.. తను ప్రశాంతంగా ఎక్కడ ఉంటుంది. ఏ కడుపు నొప్పో అని చెప్పి వ్రతానికి రాకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తుంది అని చెబుతుంది జ్ఞానాంబ. అన్నట్టుగానే బయటికి వచ్చిన మల్లిక.. కడుపు నొప్పి.. అంటూ మెలికలు తిరిగిపోతుంటుంది.
Janaki Kalaganaledu 3 september 2021 friday episode 120 highlights
ఏంటమ్మా.. ఏమైంది మల్లిక.. అని అడుగుతాడు జ్ఞానాంబ భర్త. కడుపు నొప్పి మామయ్య గారు.. భరించలేనంత కడుపు నొప్పి.. అంటుంది మల్లిక. ఇందాకా బాగానే ఉన్నావు కదా అమ్మాయి.. ఇంతలోనే ఏమైంది.. అని అడుగుతుంది జ్ఞానాంబ. ఇదేమైనా రైలా.. బస్సా.. చెప్పి రావడానికి.. అని చెబుతుంది మల్లిక.
Janaki Kalaganaledu 3 september 2021 friday episode 120 highlights
మరి.. ఇప్పుడు ఎలా.. అంటే.. నేను ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటా.. అని చెబుతుంది మల్లిక. తన ఎత్తుగడలు తెలుసుకున్న అందరూ.. తెగ నవ్వేస్తారు. అందరూ ఎంత ఆపినా కూడా ఆగరు. నవ్వుతూనే ఉంటారు. ఎందుకు నవ్వుతున్నారు.. అని మల్లిక అడగడంతో నీకు ఇప్పుడు కడుపునొప్పి వస్తుందని అమ్మ ముందే చెప్పింది కానీ.. ముందు నువ్వు పదా.. అని అంటాడు విష్ణు.
Janaki Kalaganaledu 3 september 2021 friday episode 120 highlights
నాకు నిజంగానే కడుపు నొప్పి అండి.. నా మాట ఎందుకు నమ్మడం లేదు.. అని అంటుంది మల్లిక. మన కుటుంబం కోసం.. మనమంతా బాగుండాలలని చేస్తున్న వ్రతం ఇది. అలా చేయొద్దు.. మల్లిక.. పదా.. వెళ్దాం అంటుంది జానకి. అయినా కూడా మల్లిక వినదు. నేను రాలేను.. అనగానే.. అది మన మాట వినదు కానీ.. ముందు దాన్ని ఎత్తి ట్రాక్టర్ లో పడేయ్.. అంటుంది జ్ఞానాంబ. దీంతో సరేనమ్మా.. అంటూ మల్లికను ఎత్తి.. ట్రాక్టర్ లో పడేస్తాడు. ఆ తర్వాత అందరూ ట్రాక్టర్ ఎక్కగానే.. ట్రాక్టర్ ను నడుపుతాడు జ్ఞానాంబ భర్త.
Janaki Kalaganaledu 3 september 2021 friday episode 120 highlights
ట్రాక్టర్ ఎక్కాక కూడా.. నేను రాను.. అంటూ మారాం చేస్తుంది మల్లిక. మరోవైపు జానకి మాత్రం తన భర్త రామాను చూస్తూనే మురిసిపోతుంటుంది. అందరూ ట్రాక్టర్ దిగాక.. పొలంలో నడుచుకుంటూ వెళ్తుంటారు. జాగ్రత్తగా నడుస్తూ వెళ్లి తోటకు చేరుకుంటారు.
Janaki Kalaganaledu 3 september 2021 friday episode 120 highlights
అక్కడ తోటలో ఉన్న.. పనివాళ్లు.. అన్ని ఏర్పాట్లు చేస్తారు. పూజకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాక.. ఏమండి.. పూజారి గారికి చెప్పారా? అని అడుగుతుంది జ్ఞానాంబ. అయ్యో.. జ్ఞానాంబ నేను పూజ హడావుడిలో పడి.. పూజారికి చెప్పడం మరిచిపోయా.. అంటాడు.
Janaki Kalaganaledu 3 september 2021 friday episode 120 highlights
ఏంటండి మీరు.. పూజారి గారికి చెప్పడం మరిచిపోవడం ఏంటి? మీ మతిమరుపు గురించి తెలిసి కూడా నేను మీకు చెప్పాను చూడు.. అనగానే.. అమ్మా.. పూజారికి నేను చెప్పాను.. ఆయన వచ్చేస్తూ ఉంటారు.. అనగానే.. అప్పటికే పూజారి వచ్చేస్తాడు. పూజ మొదలు పెడతాడు.
Janaki Kalaganaledu 3 september 2021 friday episode 120 highlights
Janaki Kalaganaledu 3 september 2021 friday episode 120 highlights
మల్లిక, జానకి.. ఇద్దరినీ పిలుస్తుంది జ్ఞానాంబ. మీ కాళ్లకు పసుపు రాస్తాను.. ఇద్దరూ కూర్చొండి అని అంటుంది జ్ఞానాంబ. అత్తయ్య గారు వద్దండి.. అంటుంది జానకి. పర్వాలేదు జానకి అని జ్ఞానాంబ అన్నాకూడా.. వినకుండా.. జానకియే జ్ఞానాంబకు పసుపు రాస్తుంది. అబ్బా.. చాన్స్ మిస్ అయిందే అని మల్లిక తెగ బాధపడుతుంది.
Janaki Kalaganaledu 3 september 2021 friday episode 120 highlights
పోలేరమ్మ ప్రతి సంవత్సరం నా కాళ్లు పట్టుకుంటుంది.. ఈసారి మిస్ అయింది. ఏం కాదులే.. కొత్త కోడలు నా కాళ్లు పట్టుకుంటుంది కదా.. అని అనుకుంటుంది మల్లిక.
Janaki Kalaganaledu 3 september 2021 friday episode 120 highlights
మల్లికకు పసుపు రాసేందుకు.. జానకి రాగానే.. జానకి నువ్వు ఏం అనుకోకు. ప్రతి సంవత్సరం అత్తయ్య గారు కాళ్లకు పసుపు రాసేవారు. ఆమె రాస్తేనే నాకు మంచి జరుగుతుంది. నువ్వు ఏం అనుకోకు జానకి అంటుంది మల్లిక. దీంతో సరేలే జానకి.. నేను రాస్తానులే అని అంటుంది జ్ఞానాంబ. తీసుకొని కాళ్లకు పసుపు రాస్తుంటుంది. ఏంటి మల్లిక.. నాతో పసుపు రాయించుకోవాలని తెగ ఆరాటపడుతున్నావు. నీ కాళ్లు పట్టుకుంటున్నాననా? నాకు కోడలు అంటే.. కూతురుతో సమానం. వాళ్ల కాళ్లు పట్టుకోవడంలో నాకు నామూషి ఏంటి.. అంటూ పెద్ద షాక్ ఇస్తుంది జ్ఞానాంబ.
Janaki Kalaganaledu 3 september 2021 friday episode 120 highlights
పూజారి వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన పూజ చేస్తుంటాడు. అందరూ కంకణాలు కట్టుకోండి.. అని చెబుతాడు పూజారి. దీంతో అందరూ కంకణాలు కట్టుకుంటారు.
Janaki Kalaganaledu 3 september 2021 friday episode 120 highlights
ఇంతలోనే.. ఐదుగురు మత్తయిదువులు వస్తారు. నమస్కారమండీ.. జ్ఞానాంబ గారు అని అని అంటారు. నమస్కారం.. రండి.. కుర్చోండి అని చెబుతుంది. అందరూ కలిసి అక్కడ కూర్చుంటారు.
Janaki Kalaganaledu 3 september 2021 friday episode 120 highlights
నా కుటుంబం ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండేలా దీవించు తల్లి.. అని కోరుకుంటుంది జ్ఞానాంబ. ఇంతలోనే ఏమండి.. ఆకలేస్తుందండి.. అంటుంది మల్లిక. పూజ అవ్వనీయు.. అంటాడు విష్ణు.
Janaki Kalaganaledu 3 september 2021 friday episode 120 highlights
Janaki Kalaganaledu 3 september 2021 friday episode 120 highlights
పూజకు వచ్చిన ముత్తయిదువులకు తాంబూలం ఇస్తుంది జానకి. మల్లిక కూడా వెళ్లి తాంబూలం ఇస్తుంది. ఆ తర్వాత మమ్మల్ని ఆశీర్వదించండి.. అని రామా, మల్లిక.. వాళ్ల దగ్గరికి వెళ్తారు. దీంతో.. జ్ఞానాంబ, తన భర్త.. ఇద్దరూ వాళ్లను ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత మనదే… అంటాడు విష్ణు.
Janaki Kalaganaledu 3 september 2021 friday episode 120 highlights
అంత సీన్ లేదు. మీ అమ్మ కాళ్లు నేను పట్టుకోవడమా? అస్సలు పట్టుకోను.. అంటుంది మల్లిక. వెంటనే తనను ముందుకు నెట్టేస్తాడు విష్ణు. దీంతో డైరెక్ట్ గా వెళ్లి జ్ఞానాంబ కాళ్ల మీద పడుతుంది మల్లిక. విష్ణు కూడా వెళ్లి వాళ్ల ఆశీర్వాదం తీసుకుంటాడు.
Janaki Kalaganaledu 3 september 2021 friday episode 120 highlights
కట్ చేస్తే పూజారి కూడా పూజ అయిపోయిందండి.. ఇక నేను వెళ్లొస్తాను.. అంటాడు. దీంతో రామాను పూజారికి దక్షణ ఇవ్వమంటుంది. దీంతో తాంబూలం ఇచ్చి పూజారిని పంపిస్తారు. ఆ తర్వాత తోటలోనే ఆటా పాటలతో ఎంజాయ్ చేస్తారు అందరూ.
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
This website uses cookies.