Hunger Crisis: తాలిబన్‌లు ఆక్రమించిన ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నట్లు తెలుస్తున్నది. తాలిబన్‌ల భయంతో వణికిపోతోన్న ఆఫ్ఘన్ వాసులను రానున్న రోజుల్లో దేశంలో ఆహార సంక్షోభం తీవ్రమవనుందనే వార్తలు మరింత కలవరపెడుతున్నాయి. ఇప్పటికే దేశంలో 30 శాతానికిపైగా పౌరులకు రోజుకు కనీసం ఒకపూట భోజనం దొరకని పరిస్థితులు నెలకొన్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తంచేసింది.
ఇదే సమయంలో దేశంలో ప్రస్తుతం ఉన్న ఆహార నిల్వలు కూడా ఈ నెలతోనే పూర్తిగా నిండుకునే ప్రమాదం ఉందని కూడా ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘన్‌లో నెలకొన్న సంక్షోభం రానున్న రోజుల్లో ఓ విపత్తుగా మారకుండా ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఐరాస పిలుపునిచ్చింది.
దేశంలో సంక్షోభ పరిస్థితుల కారణంగా తీవ్ర ఆహారకొరత ఏర్పడింది. దాంతో ఐదేండ్ల కంటే చిన్నారుల్లో సగం మందికిపైగా తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అంతేగాకుండా ముప్పై శాతం మంది పౌరులకు సరైన తిండి దొరకడం లేదని ఐరాస హ్యుమానిటేరియన్ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. వారంతా ప్రతిరోజు భోజనం చేస్తున్నారో లేదో తెలియని పరిస్థితులు ఉందని పేర్కొన్నది. ఆహారం, వైద్య సదుపాయాలు, ఆహారేతర అత్యవసర వస్తువులను తక్షణమే అందించే చర్యల ద్వారా ఆఫ్ఘన్ మరింత విపత్కర పరిస్థితుల్లోకి దిగజారకుండా నిరోధించవచ్చని అభిప్రాయపడింది.
ఆకలితో ఉన్న లక్షల మందిని ఆదుకునేందుకు ఐరాస కృషి చేస్తున్నప్పటికీ.. సెప్టెంబర్ చివరి నాటికి ప్రపంచ ఆహార కార్యక్రమం నిల్వలు నిండుకునే ప్రమాదం ఉండటం ఆందోళన కలిగిస్తున్నదని ఆఫ్ఘన్‌లో ఐరాస హ్యుమానిటేరియన్ విభాగం ప్రతినిధి రమీజ్ అలక్‌బరోవ్ పేర్కొన్నారు. ఇలాంటి కీలక సమయంలో ఆఫ్ఘన్‌కు సహకరించేందుకు మరిన్ని నిధులు కావాల్సి ఉందన్నారు. ప్రస్తుత డిమాండ్ దృష్ట్యా కేవలం దీనస్థితిలో ఉన్న చిన్నారుల ఆహారం కోసమే 200 మిలియన్ డాలర్లు అవసరమని అంచనా వేశారు. ఇందుకు అత్యవసర సహాయం కోసం ఐరాస త్వరలోనే ఓ ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదిలావుంటే, ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి నిధులు ఎక్కువగా అంతర్జాతీయ సంస్థలు, ఇతర దేశాల నుంచే వస్తాయని అంచనా. గతకొన్ని రోజులుగా అక్కడ ఏర్పడ్డ పరిస్థితులతో ప్రపంచబ్యాంకు వంటి సంస్థలు ఆర్థిక సహాయాన్ని నిలిపివేశాయి. వీటితోపాటు విదేశాల్లో ఉన్న నిధులను తాలిబన్‌లు వినియోగించకుండా అమెరికా వంటి దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దాంతో ఆఫ్ఘన్‌కు ఆర్థిక కష్టాలు మొదలైనట్లు తెలుస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో అనేకమంది ఆఫ్ఘన్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.