Janaki Kalaganaledu 30 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 నవంబర్ 2021, మంగళవారం 182 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకిని గుడిలో చూసి తనకు స్టడీ మెటిరియల్ ఇద్దామని అనుకుంటాడు కానీ.. ఇంతలో జానకి కనిపించదు. దీంతో ఫోన్ చేస్తాడు కానీ.. జానకి ఫోన్ మరిచిపోతుంది. దీంతో రామా ఎత్తి జానకి గుడికి వెళ్లింది అంటాడు. సరే అయితే నేను జానకితో మాట్లాడి స్టడీ మెటిరియల్ ఇస్తాను అంటాడు. వద్దు వద్దు.. మీరు జానకితో అస్సలు మాట్లాడకూడదు అంటాడు రామా. ముందు మీరు స్వీటు కొట్టుకాడికి రండి.. నేను చెబుతాను అంటాడు రామా. దీంతో సరే అని అభి బయలుదేరబోతాడు.
ఇంతలో అభిని జ్ఞానాంబ పిలుస్తుంది. జానకి తెగ టెన్షన్ పడుతుంది. టైమ్ ఎంతైంది అని అడుగుతుంది. దీంతో 11 అయింది అని చెబుతాడు. జానకి ఇంటికి వెళ్దాం పదా అంటుంది జ్ఞానాంబ. వెంటనే స్వీటు కొట్టు కాడికి వెళ్తాడు అభి. జరిగిన స్టోరీ మొత్తం చెబతాడు రామా. దీంతో అభి షాక్ అవుతాడు. ఏంటండి మీరు చెప్పేది అంటాడు అభి. మా అమ్మకు తెలియదండి. మా అమ్మకు తెలియకుండా సివిల్స చదివిస్తున్నాను.. అని చెబుతాడు. కానీ.. ఐపీఎస్ చదవడం తన కల కదండి అంటాడు. అవును.. తను ఐపీఎస్ కాకపోతే తన ప్రాణం వదిలేసుకున్నట్టే అంటాడు అభి.
అందుకే.. ఒకరోజు చూసుకొని అమ్మకు జానకి కల గురించి నేనే చెబుతాను.. అంటాడు రామా. ఎలాగైనా జానకి కల నెరవేర్చేలా చేస్తాను అంటాడు రామా. మీరు గ్రేట్ అండి. మీలాంటి భర్త దొరకడం నిజంగా అదృష్టం అంటాడు అభి. తర్వాత పుస్తకాలు రామాకు ఇచ్చి వెళ్తాడు అభి. సరే అండి.. అంటాడు.
ఇంతలో అక్కడికి జానకి వస్తుంది. పుస్తకాలను చూస్తుంది. షాక్ అవుతుంది. ఇవి ఏంటి అని అడుగుతుంది జానకి. మీ ఐపీఎస్ చదువు పుస్తకాలు అంటాడు రామా. మీ పాఠాలు చెప్పే బడిలో ఇచ్చారట. అభి గారు వచ్చి ఇచ్చి వెళ్లారు అంటాడు. అభి గుడికి వచ్చాడు అని జానకి చెప్పేసరికి.. నాకు తెలుసు అన్నీ అంటాడు రామా.
మీరు పాఠాలు చదువుకోవడానికి ఎందుకు రావట్లేదు అని అడగడానికి వచ్చాడు అని చెబుతాడు రామా. దీంతో అభికి ఫోన్ చేస్తుంది. నేను ఐపీఎస్ కోచింగ్ తీసుకోవట్లేదు అని చెబుతుంది జానకి. చదవాలన్న ఆలోచన కూడా వదిలేశాను. నాకిప్పుడు ఈ ఇంటి కోడలుగా బాధ్యతలు మాత్రమే ముఖ్యం.
అది కాదు జాను ఐపీఎస్ చదవడం నీ కల కదా.. అంటే కన్న ప్రతి కల నెరవేరాలనేది లేదు కదా. నాకు ఇప్పుడు ఈ ఇంటి కోడలుగా ఉండటమే ముఖ్యం.. నువ్వు ఇంకోసారి ఇలా నాదగ్గరికి వచ్చి చదువు ప్రస్తావన కానీ.. ఐపీఎస్ ప్రస్తావన కానీ తీసుకురావద్దు అని చెప్పి పుస్తకాలను సంచిలో పెట్టి చికితకు ఇచ్చి వాటిని షాపులో పెట్టిరా అని చెబుతుంది.
వాటిని స్వీట్ షాపులో చుట్టడానికి అవసరం అవుతాయి అని అంటుంది జానకి. వద్దు అంటాడు రామా. ఇంతలో జ్ఞానాంబ వస్తుంది. ఏమైంది అంటుంది. దీంతో జానకి, రామా టెన్షన్ పడతారు. పనికిరాని పుస్తకాలు ఉంటే వాటిని స్వీటు కొట్టుకు పంపిస్తున్నా అంటుంది జానకి. దానికి అంత టెన్షన్ ఎందుకు అంటుంది జ్ఞానాంబ.
రేపు సునంద వాళ్ల ఇంటికి ఫంక్షన్ కు వెళ్లాలి. అందరూ రెడీ అయి ఉండండి అంటుంది జ్ఞానాంబ. సరే అని జానకి, మల్లిక చెబుతారు. కట్ చేస్తే సునంద ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటుంది. అక్కడికి పోలీసులు వస్తారు. ఇక్కడ జ్ఞానాంబ అంటే ఎవరు అని అడుగుతాడు ఎస్ఐ. నేనే.. ఎందుకండి అని అంటుంది జ్ఞానాంబ.
మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటాడు పోలీసు. నా భార్య చీమకు కూడా హాని చేయదు. అటువంటి నా భార్యను ఏ నేరం మీద అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతాడు గోవిందరాజు. వీళ్లింట్లో ఫంక్షన్ కు పూత రేకులను పంపించారా అని అడుగుతాడు పోలీసు. దీంతో అవునండి అంటాడు రామా. ఫంక్షన్ కు వచ్చిన వాళ్లలో 10 మందికి ఫుడ్ పాయిజన్ అయి ఆసుపత్రిలో ఉన్నారు అని చెబుతాడు. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.