Home » Entertainment » Vijay Deverakonda Rashmika Shared Their Wedding Photos On Social Media
Entertainment

Virosh Wedding Photos : పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న విజయ్ దేవరకొండ–రష్మిక

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: February 26, 2026, 9:30 pm
Advertisement

Virosh Wedding Photos  టాలీవుడ్‌లో Tollywood అభిమానులు ఎంతోకాలంగా “ఆన్ స్క్రీన్ మోస్ట్ వాంటెడ్ కపుల్” Vijay Devarakonda విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా Rashmika Mandanna జంట ఇప్పుడు నిజజీవితంలోనూ ఒక్కటైంది. రాజస్థాన్‌లోని ఉదయపూర్ నగరంలో ప్రసిద్ధి చెందిన ఉదయపూర్ లోని ITC మెమెంటోలు హోటల్ వేదికగా గురువారం ఉదయం 10:10 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగినట్లు తెలుస్తుంది. ఉదయం వేళ వేదమంత్రాల నడుమ, కుటుంబ సభ్యులు మరియు ఆత్మీయుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఈ జంట కొత్త జీవితాన్ని ఆరంభించింది.

Advertisement

Virosh Wedding Photos : పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న విజయ్ దేవరకొండ–రష్మిక

తెలుగువారి సంప్రదాయానికి అనుగుణంగా మంగళస్నానాలు, ప్రత్యేక పూజలు, కంకణ బంధనం వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గులాబీ రేకులు, సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర జలాలతో వధూవరులకు మంగళస్నానం చేయించడం వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పెళ్లి వేడుకలో ప్రత్యేకత ఏమిటంటే రెండు భిన్న సంప్రదాయాల అందమైన సమ్మేళనం. ఉదయం తెలుగు పద్ధతిలో వివాహం జరగగా సాయంత్రం 4:30 గంటలకు రష్మిక మాతృకయైన కొడవ (కూర్గ్) సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ కార్యక్రమం నిర్వహించినట్లు సమాచారం. రెండు సంస్కృతుల కలయికతో ఈ వేడుక మరింత విశేషంగా నిలిచింది.

Advertisement

Virosh Wedding Photos : తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న విజయ్ దేవరకొండ–రష్మిక

పెళ్లి ఫోటోల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోరికను గుర్తించిన విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వివాహ చిత్రాలను పంచుకున్నారు. రష్మిక కూడా “హాయ్ మై లవ్స్ … నా భర్తను మీకు పరిచయం చేస్తున్నా మిస్టర్ విజయ్ దేవరకొండ” అంటూ ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “మేడ్ ఫర్ ఈచ్ అదర్”, “చూడముచ్చటైన జంట” అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ నూతన దంపతులకు లక్షలాదిగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి