janaki kalaganaledu 31 january 2022 episode
Janaki Kalaganaledu 31 Jan Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 31 జనవరి 2022, ఎపిసోడ్ 225 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి బాంబును డిఫ్యూజ్ చేయడంతో పోలీసులు మెచ్చుకుంటారు. తనను పొడగ్తల్లో ముంచెత్తుతారు. ఆత్రేయపురం ప్రజల ముందు తనను గొప్పగా మెచ్చుకోవడంతో జ్ఞానాంబ ఫ్యామిలీ మొత్తం సంతోషిస్తుంది. ఇన్ని ధైర్యసాహసాలు ఉన్న అమ్మాయి ఈ ఊళ్లో ఉండటం ఈ ఊరివాళ్లు చేసుకున్న అదృష్టం అని అంటాడు పోలీస్. తన ధైర్య సాహసాలు ఈ ఊరికే పరిమితం కాకూడదని పోలీసు అంటాడు. అందుకే తను పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరితే బాగుంటుందని చెబుతాడు.
janaki kalaganaledu 31 january 2022 episode
అందుకే జానకిని పోలీస్ డిపార్ట్ మెంట్ తరుపున ఐపీఎస్ చదివించాలని అనుకుంటున్నట్టు పోలీస్ చెబుతాడు. జానకి ఓకే అంటే వెంటనే డీజీపీతో మాట్లాడి ఐపీఎస్ చదివించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని.. ఉచితంగా కోచింగ్ కూడా ఇప్పిస్తామని చెబుతాడు పోలీస్. జానకికి ఈ విషయం సంతోషంగానే అనిపించినా.. అక్కడ ఎటువంటి హామీ ఇవ్వలేకపోతుంది. జ్ఞానాంబ మాత్రం ఎందుకో ఈ విషయంలో కాస్త తడబడుతుంది. నేను ఇప్పుడే మీకు ఎటువంటి హామీ ఇవ్వలేను అంటుంది జానకి. ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి అంటూ ఆత్రేయపురం ప్రజలు జానకిని అంటుంటారు. దీంతో జానకికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో లీలావతి వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది.
జానకి తన అత్త గారి ముందు చదువుకుంటా అని ఎలా చెబుతుంది. జ్ఞానాంబకు కావాల్సింది వేలిముద్ర కోడలు కదా అంటూ మాట్లాడుతుంది. ఈ విషయంలో నన్ను ఇప్పుడే ఇబ్బంది పెట్టకండి.. అని పోలీసులను వేడుకుంటుంది జానకి. దీన్ని అంత తేలికగా వదలకూడదు. ఎలాగైనా ఇరికించాలి అని అనుకుంటుంది లీలావతి.
ఆ తర్వాత జానకికి డిపార్ట్ మెంట్ తరుపున సన్మానం చేస్తారు. తనకు శాలువా కప్పుతారు. సెల్యూట్ చేస్తారు. దీంతో జానకి కూడా వాళ్లకు సెల్యూట్ చేస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి జ్ఞానాంబ ఫ్యామిలీ వెళ్లబోతుండగా మీడియా వాళ్లు వచ్చి జ్ఞానాంబను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు.
మీ కోడలు భవిష్యత్తును మీరు శాసిస్తున్నారని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. మీ కోడలు ఐపీఎస్ చదవకూడదని మీరు మీ కోడలుకు నిబంధనలు పెట్టారా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు. దీంతో లేదండి.. అదేం లేదు. మా అత్తయ్య గారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు.. అని చెబుతుంది జానకి.
కానీ.. వాళ్లను వెళ్లనీయరు. ఆగండి అని మీ తమ్ముడిలాగానే మీ కొడుకు జీవితం కూడా అవుతుంది అని భయపడుతున్నారా? మీ నిర్ణయాలతో మీ కోడలును భయపెడుతున్నారు అనేదానికి మీ సమాధానం.. అని అడుగుతారు. ఇంతలో మధ్యలోకి వచ్చిన లీలావతి… కావాలని జ్ఞానాంబ మీద లేనిపోని వన్నీ చెబుతుంది.
పైకి జ్ఞానాంబను కాపాడుతున్నట్టుగా నటించి.. జ్ఞానాంబ, జానకి గురించి అన్ని విషయాలు మీడియాకు చెబుతుంది. మా ఫ్యామిలీ విషయాలు నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పినా కూడా వినకుండా లీలావతి అన్ని విషయాలు మీడియాకు చెబుతుంది.
ఆ తర్వాత అందరూ ఇంటికి వస్తారు. జ్ఞానం.. ఆ విలేఖరులు ఏదో తెలియక మాట్లాడారు. దాని గురించి కూడా నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావా అని గోవింద రాజు అంటాడు. దీంతో ఇదంతా ఎవరికి అవసరమో.. వాళ్లే పూసగుచ్చినట్టు అడిగించి ఉంటారు అంటుంది మల్లిక. అంటే ఏంటి మల్లిక నువ్వు అనేది జానకి గారు విలేఖరులతో అడిగించారు అంటావా అంటాడు రామా.
అంతే కదా బావ గారు అంటుంది మల్లిక. సందర్భం వచ్చింది కదా అని ఇలా మాటలు మాట్లాడటం కాదు. నేను ఎప్పుడూ అత్తయ్య గారి పరువు పోయేలా నేను ప్రవర్తించను అంటుంది జానకి. నిన్ను చదువుకోవద్దని అత్తయ్య గారు నీ దగ్గర మాట తీసుకున్న విషయం మన ఇంట్లో వాళ్లకు తప్ప ఇంకెవరికీ తెలియదు కదా. మరి విలేఖరులకు ఎలా తెలిసింది అని అడుగుతుంది మల్లిక.
అందరిలో తలదించుకునే పరిస్థితి వచ్చినందుకు అత్తయ్య గారు బాధతో కుమిలిపోతుంటే.. జానకి ఏం తెలియని అమాయకురాలు అని సమర్థిస్తున్నారు ఏంటండి.. అని గోవిందరాజుతో అంటుంది మల్లిక. జానకి గారు ఐపీఎస్ చదివితే సమాజానికి మంచి సేవ చేస్తారని పోలీస్ శాఖ మొత్తం కోరుకుంటోంది. సాక్షాత్తూ వాళ్లే మన ఇంటికి వచ్చి బతిమిలాడారు కూడా.. అని జ్ఞానాంబతో చెబుతాడు రామా.
అమ్మ నీ మనసులో ఉన్న భయాలన్నింటినీ తీసేసి జానకి గారిని ఐపీఎస్ చదివిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంటాడు రామా. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.