Janaki Kalaganaledu 7 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 జూన్ 2022, మంగళవారం ఎపిసోడ్ 317 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామా రూ.500 లోనే వస్తువులు కొనుక్కొని వెళ్తాడు. మరోవైపు పోటీలు ప్రారంభం అవుతాయి. అందరూ షాపింగ్ చేశారా అని అడుగుతుంది యాంకర్. మీకు ఇచ్చిన మనీతో మీరు ఈ రౌండ్ లో చేయాల్సిన వంటకాలు, వంటకు కావాల్సిన మెటీరియల్ తెచ్చుకున్నారా అని అడుగుతుంది. దీంతో అందరం తెచ్చుకున్నాం అంటారు. కానీ.. రామా ఇప్పటి వరకు రాడు. నడుచుకుంటూ వస్తుండటంతో అతడికి కాస్త లేట్ అవుతుంది. మధ్యలో కూరగాయలు కొంటూ ఉంటాడు రామా. దీంతో అతడికి లేట్ అవుతుంది. ఓకే రెడీ అంటుంది యాంకర్. ఇంతలో జానకి.. మా భర్త ఇంకా రాలేదు. 5 నిమిషాలు వెయిట్ చేస్తే ఆయన కూడా వచ్చేస్తారు అంటుంది. వాళ్లను రిక్వెస్ట్ చేస్తుంది.
మీరు మాట్లాడేది చాలా వింతగా ఉందండి.. అందరూ వస్తువులు కొనేందుకు అదే షాపునకు వెళ్లినప్పుడు అందరూ వచ్చాక.. తను ఎందుకు రాలేదు ఇంకా అని అంటారు జడ్జిలు. ప్లీజ్ అండి.. అలా అనకండి.. ఆయన ఈపాటికి ఇక్కడికి వచ్చేసి ఉంటారు. ఒక 2 మినట్స్ ప్లీజ్ అంటుంది. ఓకే.. కంటెస్టెంట్లకు ఇచ్చిన టైమ్ లో ఇంకో 5 నిమిషాలు ఉంది కాబట్టి.. మేము ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేస్తాం. అప్పటికీ రాకపోతే మీరు ఇక.. ఈ కాంపిటిషన్ నుంచి వైదొలిగినట్టే అంటుంది జడ్జి. దీంతో థాంక్స్ అండి అంటుంది జానకి. ఇంతలో రామా పరిగెత్తుకుంటూ వస్తాడు. తను తెచ్చిన ఐటెమ్స్ చూసి.. మేము ఇచ్చిన డబ్బులకు అందరూ చాలా ఐటెమ్స్ తీసుకొచ్చారు. కానీ.. మీరేంటి చాలా తక్కువ ఐటెమ్స్ తీసుకొచ్చారు అని ప్రశ్నిస్తుంది యాంకర్.
దీంతో రామాకు ఏం చెప్పాలో అర్థం కాదు. ఏముంది.. ఇచ్చిన వెయ్యి రూపాయలలో 200 ఖర్చు చేసి.. మిగిలినవి పాకెట్ లో వేసుకొని ఉంటాడు అని అంటుంది ఓ కంటెస్టెంట్. దీంతో జానకికి కోపం వస్తుంది. రామా గారి గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు.. అని అడుగుతుంది జానకి.
ఎంతో చదువుకున్న మీకు ఆమాత్రం కూడా తెలియదా అని జానకి సీరియస్ అవుతుంది. ఎక్స్ క్యూజ్ మీ.. ఇక్కడ విషయం మేము ఇచ్చిన అమౌంట్ అంతా పర్ చేజ్ చేయకుండా.. మిగిలిన అమౌంట్ ఏం చేశారా అని అడుగుతున్నాం.. అంటుంది యాంకర్.
దీంతో ఆ డబ్బును అతడికి ఇచ్చినట్టు చెబుతాడు. దీంతో కథ మాత్రం బాగా చెప్పావు అంటుంది ఆ కంటెస్టెంట్. ఈరోజుల్లో ఎవరి గురించి వారు ఆలోచించడమే కష్టంగా ఉంది. కానీ.. వేరే వాళ్ల గురించి ఆలోచించేవాళ్లు ఉన్నారా అని అంటుంది. దీంతో ఉంటారు.. మా రామా గారు ఆలోచిస్తారు అని అంటుంది జానకి.
ఇది కాంపిటిషన్. ఇలా చేస్తే కాంపిటిషన్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది అని అంటుంది యాంకర్. ఇదంతా టీవీలో జ్ఞానాంబ చూస్తుంటుంది. మల్లిక అయితే చాలా సంతోషిస్తుంది. దీంతో రామా పదండి వెళ్లిపోదాం.. నేను ఓడిపోయాను అంటాడు రామా.
దీంతో రిజల్ట్స్ రాకముందే మీరు ఇలా బాధపడకండి. గెలుపో.. ఓటమో ధైర్యంగా ఫైట్ చేద్దాం అంటుంది జానకి. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మన జడ్జీలు అంటుంది యాంకర్. దీంతో ఇందులో చెప్పడానికి ఏముంది.. మేము ఇచ్చిన అమౌంట్ మీ అంతట మీరే దానం చేయడం కరెక్ట్ కాదు కాబట్టి.. మీరు ఈ రౌండ్ లో ఎలిమినేట్ అయ్యారు అంటుంది జడ్జి.
దీంతో రామా, జానకి అక్కడి నుంచి వెళ్లిపోబోతుంటారు. ఇంతలో చెఫ్ కాంపిటిషన్ హెడ్ జడ్జికి ఫోన్ చేస్తాడు. అతడు తమ వాలంటీర్ అని.. ఈ రౌండ్ ఉద్దేశం మానవత్వం కూడా అని చెబుతాడు. రామా ఓ ప్రాణం కాపాడటమే ముఖ్యం అని భావించాడు. కానీ.. డిస్ క్వాలిఫై అయ్యాడు అంటాడు.
అమ్మకు కష్టం ఉంది అనగానే ఏమాత్రం ఆలోచించలేదు. ఓటమి అంటే భయం లేదా అని అడుగుతాడు. దీంతో నేను ఒక పల్లెటూరు వ్యక్తిని. వాళ్ల అమ్మ ఆరోగ్యం బాగోలేదు అనగానే నేను చేయాలనుకున్న సాయం మాత్రమే నాకు గుర్తొచ్చింది.. అంటాడు రామా.
మనకు జన్మనిచ్చిన అమ్మ. ఆవిడ గురించి ఆలోచించాలి కదా. అమ్మను బాగా చూసుకుంటే చాలు.. ముక్కోటి దేవతలను మొక్కినంత పుణ్యం వస్తుంది అంటాడు రామా. దీంతో అందరూ చప్పట్లు కొడతారు. రామ చంద్ర.. రెండో రౌండ్ కు మీరు కాంపిటిషన్ లేకుండా సెలెక్ట్ అయ్యారు అంటాడు. దీంతో జ్ఞానాంబ సంతోషిస్తుంది. మల్లికకు మాత్రం షాక్ తగులుతుంది.
ఆ తర్వాత రామా, గోవిందరాజు ఒకేసారి ఇద్దరూ ఫోన్లు చేస్తారు. తర్వాత గోవిందరాజు చేస్తాడు. ఒరేయ్ రాముడు.. నువ్వు సెలెక్ట్ అయ్యావురా చూశాను. రేపటి నుంచి అసలు పోటీలు మొదలు అవుతాయట కదా. నేను, మీ అమ్మ టీవీలో చూస్తూ మురిసిపోయాం అంటాడు గోవిందరాజు.
దీంతో అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వండి అంటాడు రామా. దీంతో జ్ఞానాంబ మాట్లాడుతుంది. చాలా సంతోషంగా ఉంది నాన్న. ఓవైపు పోటీలో డబ్బు అవసరం ఉంది అని తెలిసికూడా.. మరోవైపు తన తల్లి కోసం సాయం చేశావు చూడు.. అదే గొప్ప గెలుపు అంటుంది జ్ఞానాంబ.
తర్వాత జరగబోయే పోటీల్లో కూడా నువ్వు ఇలాగే గెలవాలి అంటుంది జ్ఞానాంబ. మరోవైపు రామా, జానకి చాలా ఆనందంగా ఉంటారు. జానకి గారు ఈ రోడ్డు ఎంత విశాలంగా ఉందో కదా అంటాడు రామా. అవును అండి. దీన్ని ఔటర్ రింగ్ రోడ్ అంటారు అంటుంది జానకి.
తర్వాత ఇద్దరూ కలిసి అక్కడ ఫోటోలు దిగుతుంటారు. దీంతో అక్కడికి ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ. ఫోటోలు తీయకూడదు అంటాడు. తీయండి డబ్బులు అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.