Janaki Kalaganaledu 8 Dec Today Episode : జ్ఞానాంబను మరోసారి మోసం చేసి ఐపీఎస్ కోచింగ్ కు వెళ్లబోతూ.. అడ్డంగా బుక్కయి పోయిన జానకి

Janaki Kalaganaledu 8 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 డిసెంబర్ 2021, బుధవారం ఎపిసోడ్ 188 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి తన గాజులు తాకట్టు పెట్టి.. అఖిల్ కు గిటార్ కొనిచ్చిందని మల్లిక.. జ్ఞానాంబతో చెబుతుంది. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. జానకిన అడుగుతుంది. నువ్వు అఖిల్ కు గిటార్ కొనిచ్చావా అని అడుగుతుంది. దీంతో రామా కలుగజేసుకొని.. జానకి గారు అలా ఎందుకు చేస్తారు. అఖిల్ ఏదో అబద్ధం చెబుతున్నట్టున్నాడు అని అంటాడు రామా. కానీ.. లేదండి.. ఆ గిటార్ నేనే కొనిచ్చాను అంటుంది జానకి. దీంతో అందరూ షాక్ అవుతారు. చెప్పు జానకి.. ఏం చెప్పమంటావు.. మల్లిక చెప్పిన దానికి ఏం సమాధానం చెప్పాలి చెప్పు అంటుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu 8 december 2021 full episode

అత్తయ్య గారు నేను చేసింది తప్పే క్షమించండి.. అంటుంది. అత్తయ్య గారు మీ పెద్దరికాన్ని ఎదిరించి ప్రవర్తించాలని మాత్రం కాదు అంటుంది జానకి. మరి దీన్ని ఏమంటారు. నకు చెప్పకుండా.. నాకు తెలియకుండా వాడికి గిటార్ కొనివ్వడాన్ని ఏమంటారు అంటుంది జ్ఞానాంబ. మానసిక క్షోభకు గురికాకుండా.. అఖిల్ ను కాపాడటం కోసం ఈ పని చేశాను అంటుంది జానకి. అఖిల్ కు గిటార్ కొనివ్వకపోతే అతడు బాధపడుతున్నాడని నేనే కొనిచ్చాను అంటుంది. పిల్లలకు ఏది అడిగితే అది కొనివ్వడం కరెక్ట్ కాదు. వాళ్లు చెప్పేది ఒకటి ఉంటుంది.. చేసేది ఒకటి ఉంటుంది.. అంటుంది జ్ఞానాంబ. నాకు ఇంకా కోపం తెప్పించిన విషయం ఏంటంటే… నీ చేతి గాజులను తాకట్టు పెట్టడం అంటుంది జ్ఞానాంబ. నీ తల్లిదండ్రుల తాలూకు ప్రేమ జ్ఞాపకాలు అవి. ఒకరకంగా అత్తారింటి పరువును కూడా తాకట్టు పెట్టడం అంటుంది జ్ఞానాంబ.

నా కోడలు గర్వంగా తల ఎత్తుకొని ఉండాలి తప్పితే ఇలా తల దించుకునే పరిస్థితి రాకూడదని నేను అనుకుంటున్నాను.. అంటుంది. వెంటనే డబ్బులు రామాకు ఇచ్చి నీ భార్య గాజులను వెంటనే విడిపించుకొని తీసుకురా అంటుంది జ్ఞానాంబ. సరే అమ్మ అంటాడు రామా. చూడు జానకి.. నువ్విలా దాచి పెట్టడం.. నేను క్షమించడం ఇదే చివరి సారి కావాలి.. అంటుంది జ్ఞానాంబ.

ఇంకోసారి నువ్వు నాదగ్గర ఇంకేదైనా విషయాన్ని దాచిపెట్టావని తెలిసిందో నిన్ను ఈ జన్మలో కూడా క్షమించను. అలాగే నీ మొహం కూడా చూడను.. గుర్తుపెట్టుకో అంటుంది జ్ఞానాంబ. అరేయ్ అఖిల్.. ఆటలు పాటలు కడుపు నింపవు.. ఒళ్లు దగ్గర పెట్టుకొని చదువుకో.. మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Janaki Kalaganaledu 8 Dec Today Episode : మల్లికకు మరో సారి షాక్ ఇచ్చిన జ్ఞానాంబ

వెక్కిరించబోయి బోల్తాపడినట్టు.. చివరాఖరికి నేనే బోల్తా పడ్డాను.. అని మల్లిక అనుకుంటుంది. మరోవైపు రామాకు.. జానకి సారీ చెబుతుంది. ఎందుకండి అంటాడు రామా. అఖిల్ విషయం గురించి అంటుంది. దాంట్లో బాధేముంది అంటాడు. భార్యాభర్తలు అంటే ఒకే మనసు అని.. వాళ్ల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవని అనుకున్నా.. అంటాడు రామా.

అఖిల్ విషయంలో చెప్పకపోవడం ఏంటని రామా బాధపడతాడు. ఇంతలో అఖిల్ వచ్చి నన్ను క్షమించు అంటాడు. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను వదిన అంటాడు. కానీ.. రామాకు అస్సలు ఏం అర్థం కాదు. వదినకు నువ్వు అసలు ఎందుకు క్షమాపణ చెప్పావు అంటాడు రామా.

దీంతో అసలు విషయం చెబుతాడు అఖిల్. ఇంకెప్పుడు అలా చేయకు అఖిల్ అంటాడు రామా. అమ్మకు మన మీద ఉన్నది కోపం కాదు.. ప్రేమ అంటాడు. సారీ అన్నయ్య అని చెబుతాడు. ఆ తర్వాత జానకి బాధపడుతుంది. నువ్వు అమ్మ దగ్గర దాచిన ఐపీఎస్ కల గురించి ఎలా చెబుతావు అంటూ రామా అడుగుతాడు.

మరోవైపు జానకిని ఎంత బుక్ చేసినా.. మీ అమ్మ మాత్రం జానకిని క్షమించేస్తుంది.. అని విష్ణుతో చెబుతుంది మల్లిక. ఏం చేసినా జానకిని అత్తయ్య గారు ఇంట్లో నుంచి పంపించడం లేదు అంటుంది మల్లిక. ఎలాగైనా జానకిని ఇంట్లో నుంచి పంపించేలా ప్లాన్ చేయాలని అనుకుంటుంది మల్లిక.

మళ్లీ జానకి గారు కేకుల తయారీ నేర్చుకోవడానికి రాజమండ్రి వెళ్తారు అని రామా.. జ్ఞానాంబకు చెబుతాడు. కానీ.. జ్ఞానాంబ మాత్రం ఇక వద్దు అంటుంది. నిజానికి.. జానకి మళ్లీ ఐపీఎస్ కోచింగ్ కోసం వెళ్తుంది. కానీ.. ఇక నుంచి కేకుల తయారీకి జానకి వెళ్లాల్సిన అవసరం లేదు అని జ్ఞానాంబ అనేసరికి రామా షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

6 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

6 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

8 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

9 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

11 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

11 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

12 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

13 hours ago