Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. హీరోయిన్ గా సాలిడ్ బ్రేక్ రాకున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ లో దూసుకుపోతున్నారు. మిలియన్ల కొద్దీ ఉన్న ఫ్యాన్స్ ని నిరాశ పరచకుండా గ్లామర్ తో నాన్ స్టాప్ ట్రీట్ పంచుతున్నారు. సినిమాల కన్నా కూడా జాన్వీ కపూర్ తన గ్లామర్‌తోనే ఎక్కువగా క్రేజ్ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో కుర్రకారు మనసులు కొల్లగొడుతుంది. తాజాగా ఈ బ్యూటీ కేక పెట్టించే అందాలు చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది.
మెరిసిపోతున్న అందాలకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం జాన్వీ స్టన్నింగ్ పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శ్రీదేవి కూతురు కావడంతో ఆమెకు సౌత్ లో హైప్ వచ్చిపడింది. ఇక ఆమె తెలుగు చిత్రం చేస్తున్నారంటూ పలుమార్లు కథనాలు ఇప్పటికే వెలువడ్డాయి. తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ మూవీతో ఆమె ఎంట్రీ ఖాయం అంటున్నారు. ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీలో జాన్వీ హీరోయిన్ గా నటిస్తున్నారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

Janhvi Kapoor : జాన్వీ అందాల ఆరబోత..
జాన్వీ కెరీర్ పరిశీలిస్తే అందానికి మారు పేరైన శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్.. అందం, ఆహార్యంలో అచ్చు అమ్మ పోలికే. చూడగానే మనసులు దోచే సోయగాలు ఆమె సొంతం. అయినప్పటికీ ట్రెండ్ కి తగ్గట్టుగా జాన్వీ తనని తాను మార్చుకుంటున్నారు. ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. దారుణంగా ఫోటో షూట్స్ చేస్తూ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కూడా అందరి మతులు కొల్లగొడుతున్నాయి.