Janvi Kapoor act in Vignesh Shivan movie
Janvi Kapoor : అలనాటి తార శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిది యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన జాన్వీ ప్రస్తుతం హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలోనే టాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది. ప్రస్తుతం జాన్వి టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వ వహిస్తున్న ‘ దేవర ‘ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల అయింది. ఈ పోస్టర్లో జాన్వీ లంగా వోణీలో చాలా అందంగా, కొత్తగా కనిపించింది.
ప్రస్తుతం జాన్వీ కపూర్ దేవర సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. ఈ క్రమంలోనే ఆమెకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ప్రముఖ తమిళ డైరెక్టర్ , నయనతార భర్త విగ్నేష్ శివన్ తన సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ‘ లవ్ టుడే ‘ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ రంగనాథన్ సరసన జాన్వీ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం విగ్నేష్ శివన్ జాన్వీ కపూర్ తో స్వయంగా మాట్లాడాడట. జాన్వి కూడా వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు.
Janvi Kapoor act in Vignesh Shivan movie
ఇక ఈ సినిమాకి ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అయితే కొంతకాలం కిందట కూడా జాన్వీ తమిళంలో నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఆమె తండ్రి బోనీ కపూర్ ఖండించారు. మరి ఈ ఈ వార్తలు అయినా నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇదే నిజమైతే జాన్వి త్వరలోనే తమిళంలో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక తెలుగులో దేవర సినిమా చేస్తుంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్న జాన్వి స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందో లేదో చూడాలి.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.