Faria Abdullah : చీరకట్టులో తీన్మార్ స్టెప్పులేసిన ‘జాతిరత్నాలు’ హీరోయిన్.. వీడియో వైరల్..

Authored By mallesh | The Telugu News | Published on: October 7, 2021, 8:20 am

Faria Abdullah : ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకుంది బ్యూటిఫుల్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. నవీన్ పొలిశెట్టి హీరోగా డైరెక్టర్ కె.వి.అనుదీప్ డైరెక్షన్‌లో వచ్చిన ‘జాతిరత్నాలు’ చిత్రంలో కథానాయికగా నటించి మంచి పేరు సంపాదించుకుంది ఫరియా. కొవిడ్ సెకండ్ వేవ్ టైంలో రిలీజైన ఈ సినిమా బెస్ట్ ఎంటర్ టైనర్‌గా నిలిచింది.ఒకే ఒక్క చిత్రంతో హీరోయిన్ ఫరియాకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. పక్కా హైదరాబాదీ భాషలో ‘జాతిరత్నాలు’ చిత్రంలో ‘చిట్టి’గా ప్రేక్షకులను అలరించింది ఫరియా. ఈ పొడుగు కాళ్ల సుందరి డ్యాన్స్ మూమెంట్స్ కూడా బాగానే చేస్తుంది.

jatiratnalu Actress Faria Abdullah teenmar Dance Video Viral

jatiratnalu Actress Faria Abdullah teenmar Dance Video Viral

అయితే ‘జాతిరత్నాలు’ సినిమాలో డ్యాన్స్ మాత్రమే కాదు నటనకు కూడా స్కోప్ లభించింది ఈ భామకు. ఫన్నీ గర్ల్‌గా ‘చిట్టి’ పాత్ర పోషించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది ఫరియాల అబ్దుల్లా. సోషల్ మీడియాలో అప్పట్లో ఈమె జాతిరత్నాలు సినిమాలో ‘చిట్టి’ సాంగ్‌కు చేసిన డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అయింది. ఈ సంగతులు అలా ఉంచితే.. తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లినట్లుంది ఫరియా.

jatiratnalu Actress Faria Abdullah teenmar Dance Video Viral

jatiratnalu Actress Faria Abdullah teenmar Dance Video Viral

Faria Abdullah : ‘తీన్మార్’ సౌండ్ విని కంట్రోల్ చేసుకోలేకపోయా..

సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో ఓపెనింగ్‌కు వెళ్లిన ఫరియా…అక్కడ తీన్మార్ సౌండ్ విని ఆగలేకపోయింది. నడి రోడ్డుపైనే చీరకట్టులోనే నాలుగు స్టెప్స్ వేసింది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆగలేకపోయానని ఫరియా కామెంట్ చేసింది. అయితే, చీరకట్టులోనూ తీన్మార్ స్టెప్పులేయడాన్ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వస్తున్న ‘ఢీ’ సినిమా సీక్వెల్‌లో నటిస్తోందని తెలుస్తోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp