Jeevitha Rajesekhar : ప్రశ్నిస్తే కేసు పెడతారా? మెగా ఫ్యామిలీపై రాజశేఖర్, జీవిత సీరియస్
ప్రధానాంశాలు:
చిరంజీవితో నాకు ఎప్పుడూ గొడవలు లేవు
జగన్ అంటే నాకు అభిమానం అన్న రాజశేఖర్
నన్ను జగన్ తప్పుగా అర్థం చేసుకున్నారు
Jeevitha Rajesekhar : సినీ హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అప్పట్లో రాజశేఖర్ చాలా సినిమాల్లో హీరోగా నటించారు. ఒకప్పుడు స్టార్ హీరోగానూ ఉన్నారు. ఇప్పటికీ రాజశేఖర్ కు తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్ ఉంది. ఇప్పటికీ ఆయన హీరోగా పలు సినిమాలు తీస్తున్నారు. హీరోయిన్ గా ఉన్న జీవితను పెళ్లి చేసుకున్న రాజశేఖర్ కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వాళ్లు కూడా తండ్రి, తల్లి బాటలోనే ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అయితే.. తాజాగా జీవిత, రాజశేఖర్ ఇద్దరూ ప్రెస్ మీట్ పెట్టారు. ఈసందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ తన తల్లి చనిపోయినప్పటి నుంచి తనకు బాధ్యతలు పెరిగాయని చెప్పారు. తన మీద ఎవ్వరికీ కోపం లేదని, ఎవ్వరి మీద శతృత్వం లేదని.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా మాట్లాడారు. చిరంజీవి గారితో కొన్నేళ్ల కింద చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆయన పార్టీ పెట్టినప్పుడు మా మధ్య కొన్ని గొడవలు వచ్చాయి. దీంతో కొన్ని రోజులు ఇద్దరం మాట్లాడుకోలేదు. కానీ.. ఇప్పుడు అలా లేదు. మా రెండు ఫ్యామిలీలు కలిశాయి. ఇప్పుడు ఆయన నాతో మాట్లాడుతున్నారు.. నేను ఆయనతో మాట్లాడుతున్నా అని చెప్పుకొచ్చారు రాజశేఖర్.
అయితే.. నాకు మిగిలిపోయిన ఒకే ఒక్క బాధ ఏంటంటే జగన్ గారితో వచ్చిన మిస్ అండర్ స్టాండింగ్ అంటూ చెప్పుకొచ్చారు రాజశేఖర్. నేను ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే.. అప్పుడు ఆయన తన తండ్రిని ఉపయోగించుకొని.. అప్పట్లో విజయవాడలో మీటింగ్ పెడితే నేను వెళ్లాను. నేను అక్కడికి వెళ్లడంతో జనాలు నన్న చూశారు. దీంతో వాళ్లకు హాయ్ చెప్పినట్టుగా నేను చేతులు ఊపాను. అది జగన్ గారికి నచ్చలేదు. అప్పుడే చెప్పేసి ఉంటే నేను వెంటనే డైరెక్ట్ గా వెళ్లి ఉండేవాడిని. అంతే తప్ప నేను కావాలని చేయలేదు. కానీ.. జగన్ గారికి, పార్టీకి అది ఒక డిస్టర్బెన్స్ గా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత నాకు ఈ విషయం తెలిసింది. అప్పటి నుంచి నేను జగన్ గారిని కలిసి అసలు జరిగిన విషయం చెప్పాలని అనుకున్నాను. అప్పటి నుంచి జగన్ గారిని కలవడం కోసం ప్రయత్నించాను. చివరకు నాకు ఇవాళ జగన్ గారితో మాట్లాడే అవకాశం లభించింది.. అని రాజశేఖర్ అన్నారు.
Jeevitha Rajesekhar : నేను జగన్ కే మద్దతు ఇస్తున్నా
మనకు ఉన్న నేతలు ఇద్దరేనండి.. ఒకరు చంద్రబాబు.. ఇంకొకరు జగన్. ఇద్దరిలో ఎవరు మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే నేను జగన్ కే మద్దతు ఇస్తున్నా. ఎందుకంటే.. మనం ఎన్నికలప్పుడు ఇచ్చే 3000 డబ్బులు తీసుకుంటే కాదు.. ఎవరు నిజంగా అభివృద్ధి చేస్తున్నారు అనేది చూడాలి. ఏపీలో వైఎస్సార్ తీసుకొచ్చిన పథకాలే ఇప్పటికీ నడుస్తున్నాయి. అప్పు తీర్చడం దగ్గర్నుంచి పిల్లలకు స్కూల్ ఫీజులు ఇస్తున్నారు. మహిళలకు ఆర్థిక సాయం చేస్తున్నారు. నవరత్నాలు అమలు చేస్తున్నారు. జగన్ ఎప్పుడూ ప్రజలు ప్రజలు అంటూ తిరుగుతున్నారు. ఆయనకు ప్రజలు తప్ప మరో పనే లేదు. మన కోసమే బతుకుతున్న జగన్ గారికి మరోసారి అవకాశం ఇద్దాం. ఆయన వైఎస్సార్ కు ఈక్వల్ గా చేస్తారు.. లేదా అంతకంటే ఎక్కువే చేస్తారు అంటూ రాజశేఖర్ చెప్పుకొచ్చారు.