Home » Entertainment » Jr Ntr 30 Heroine Rashmika Mandanna Remuneration
Entertainment

Rashmika Mandanna : ఎన్టీఆర్‌ 30 లో రష్మిక మందన్నా.. ఎంత డిమాండ్ చేసిందో తెలుసా?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: September 12, 2022, 8:45 pm
Advertisement

Rashmika Mandanna : యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా గురించి రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో వస్తూనే ఉంది. వీరి కాంబో సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ ఎదురు చూస్తున్న అభిమానులకు ఆ వార్తలు మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం ఇది ఒక తెలుగు సినిమా అన్నట్లుగా కాకుండా దేశ వ్యాప్తంగా ఎన్టీఆర్ కి ఉన్న ఇమేజ్ ని మరింతగా పెంచే విధంగా ఉంటుంది అంటూ కొరటాల శివ సన్నిహితులు బలంగా నమ్మకంగా చెబుతున్నారు.

Advertisement

ఇక సినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయమై సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎన్టీఆర్ 30 సినిమా గురించి హీరోయిన్ గురించి మీడియాలో ప్రచారం జరగడం కొత్తేం కాదు గతంలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటించబోతుందంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆలియా భట్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది అంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమె పుష్ప సినిమాతో ఒక రేంజిలో జాతీయ స్థాయిలో గుర్తింపుని దక్కించుకున్న విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమాలో ఆమెను నటింపజేస్తున్నట్లుగా తెలుస్తోంది.

JR ntr 30 heroine Rashmika Mandanna Remuneration

Advertisement

ఈమె అక్కడ చేయడం ద్వారా మంచి బిజినెస్ అయ్యే అవకాశం ఉందని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నాడేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో నటించినందుకు గాను రష్మిక మందన ఏకంగా ఐదు కోట్ల రూపాయల పారితోషకమును తీసుకోబోతుందట. ఈ మధ్య కాలంలో రష్మిక మందన ఈ స్థాయి పారితోషికం తీసుకున్నదే లేదు. అయినా కూడా దర్శకుడు కొరటాల శివ ఎక్కువ డేట్లు ఆమె నుండి ఆశిస్తూ భారీ పారితోషకమును డిమాండ్ చేసినా కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ కే రూ. 5 కోట్లు అంటే కాస్త ఎక్కువే అంటూ ఇండస్ట్రీకి చెందిన కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి