JR NTR – Pranathi : జూనియర్ ఎన్టీఆర్ ప్రణతి ఇప్పటికీ ఆ విషయంలో బాధపడుతున్నారట.!? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

JR NTR – Pranathi : జూనియర్ ఎన్టీఆర్ ప్రణతి ఇప్పటికీ ఆ విషయంలో బాధపడుతున్నారట.!?

 Authored By prabhas | The Telugu News | Updated on :1 January 2023,6:00 pm

JR NTR – Pranathi : టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది జూనియర్ ఎన్టీఆర్ ప్రణతిల జంట. ఎంతో అన్యోన్యంగా బెస్ట్ కపుల్ గా కనిపిస్తారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల భార్యలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. హీరోకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటూ ఉంటారు. బయట కూడా చాలా హంగామా చేస్తూ ఉంటారు అలాంటిది సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటుంది ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి.

సోషల్ మీడియా కి దూరంగా ఉంటూ తెలుగింటి ఇల్లాలుగా లక్ష్మి ప్రణతి నడుచుకుంటూ ఉంటుంది. బయట అంతగా కనిపించని లక్ష్మీప్రణతి ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కూడా చాలా పద్ధతిగా వస్త్రాలను ధరించి నందమూరి ఫ్యామిలీ అంటే ఏంటో నిరూపించుకుంటుంది. అయితే ఎంతో బ్యూటిఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న లక్ష్మీ ప్రణతి జీవితంలో ఇప్పటికీ ఓ విషయం కారణంగా బాధపడుతున్నారట.

JR NTR and Pranathi suffering from that matter

JR NTR and Pranathi suffering from that matter

ఇద్దరు పిల్లలతో కొనసాగుతున్న వీళ్ళ వివాహిక జీవితంలో పాప పుట్టలేదని లక్ష్మీ ప్రణతి బాధపడుతూ ఉంటుందంట. మొదటినుంచి ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిలకు ఇంట్లో ఆడపిల్ల ఉండాలని ఎంతో ఆశగా ఉండేదట. మొదట కొడుకు పుట్టగానే రెండోసారి ఆడపిల్ల పుడుతుందని చాలా ఆశగా ఎదురు చూశారట. రెండోసారి కూడా కొడుకు పుట్టడంతో వాళ్ల కోరిక నెరవేరలేదని బాధపడుతూ ఉంటారట. ఇప్పటికీ ఎన్టీఆర్ నాకు కూతురు లేదని బాధపడుతూ ఉంటారట. లక్ష్మీ ప్రణతి కూడా ఆడపిల్ల ఉంటే ఇంట్లో చాలా బాగుండేది అని అత్తగారికి చెప్పుకొని ఫీలవుతూ ఉంటుందట.

Advertisement
WhatsApp Group Join Now

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది