Home » Entertainment » Jr Ntr Birthday Special Devara Movie Song Release Soon
Entertainment

Jr Ntr Birthday : ఎన్టీఆర్ బ‌ర్త్ డేకి దేవ‌ర నుండి అదిరిపోయే గిఫ్ట్.. ఫ్యాన్స్‌కి పూన‌కాలు రావ‌ల్సిందే..!

Authored By
Ramu
The Telugu News | Published on: March 15, 2024, 9:00 pm
Advertisement

Jr Ntr Birthday : ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర అనే చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంతో భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతుంది. రెండు పార్ట్‌లుగా ఈ మూవీని కొర‌టాల తెర‌కెక్కిస్తున్నారు. ఇక చిత్రంలో శ్రీదేవి గార‌ల‌ప‌ట్టి జాన్వీకపూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ మూవీతోనే జాన్వీ తెలుగు ఇండ‌స్ట్రీకి పరిచయం అవుతుంది. తొలిభాగం 2024 ఏప్రిల్ 5న విడుద‌ల కానుండ‌గా, మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి తార‌క్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌ల‌ను రిలీజ్ చేసి మూవీపై అంచానాలు పెంచారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ న్యూస్ బ‌య‌ట‌కు రాగా, అది విని ఫ్యాన్స్ తెగ సంతోష‌ప‌డుతున్నారు.

Advertisement

ఎన్టీఆర్ బర్త్ డే మే 20న కాగా,ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా దేవ‌ర నుండి తొలి సాంగ్ రిలీజ్ చేయ‌నున్నట్టు స‌మాచారం. మే 20కి ముందే సాంగ్‌ని రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాల‌ని దేవ‌ర టీం భావిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. ఇక దేవ‌ర సినిమాలో ఒక సాంగ్ కోసం ఏకంగా 2000 మంది డ్యాన్సర్లతో షూట్ చేసిన‌ట్టు టాక్. ప్రేమ్ ర‌క్షిత్ ఈ పాట‌కి కొరియోగ్ర‌ఫీ అందించ‌గా, సాంగ్ కోసం భారీ సెట్‌ను రామోజీ ఫిలిం సిటీలో డిజైన్ చేశార‌ని స‌మాచారం. ఇక ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ను గోవా, కొచ్చిలో కొన్ని అద్భుతమైన లోకేషన్స్‌లో షూట్ చేశార‌ని తెలుస్తుంది.

మ‌రి ఎన్టీఆర్ బ‌ర్త్‌డేకి ఏ సాంగ్ రిలీజ్ అవుతుందో అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో దేవ‌ర చిత్రం వ‌స్తుండ‌గా, మూవీపై బోలెడ‌న్ని అంచ‌నాలు ఉన్నాయి. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోనుంది. పాత్ర కోసం తారక్ డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించ‌డం ఖాయం అని చెప్ప‌వ‌చ్చు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతుండ‌గా, ఆ అంచ‌నాల‌ని అందుకుంటారో లేదో చూడాలి.

Ramu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి