Home » Entertainment » Jr Ntr Devara Movie Release Date Postponed
Entertainment

Jr Ntr : దేవర రిలీజ్ డేట్ కష్టాలు .. అటు చూస్తే గ్లోబల్ స్టార్, ఇటు చూస్తే ఐకాన్ స్టార్..!

Authored By
aruna
The Telugu News | Published on: January 30, 2024, 3:00 pm
Advertisement

Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్ ‘ దేవర ‘ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లుగా తెలుస్తుంది. అయితే దేవర సినిమా రిలీజ్ డేట్ సమస్యగా మారినట్లు తెలుస్తోంది. రోజురోజుకూ సోషల్ మీడియాలో దేవర రిలీజ్ డేట్ వైరల్ అవుతుంది. ఏప్రిల్ 5కి విడుదల అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయానికి దేవర విడుదల అవుతుందా లేదా అని ప్రశ్నగా మారింది. సోషల్ మీడియాలో అయితే దేవర రిలీజ్ డేట్ గురించి న్యూస్ వైరల్ అవుతుంది. అయిన చిత్ర యూనిట్ ఈ విషయంపై స్పందించలేదు. సినిమా ఏప్రిల్ 5 కి విడుదల అవుతుందా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

దీంతో అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. దేవర సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని, ఆ కారణంగానే సినిమా రిలీజ్ డేట్ లేట్ అవ్వవచ్చాని అంటున్నారు. అయితే అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు కాబట్టి దేవర సినిమా ఖచ్చితంగా ఏప్రిల్ 5 విడుదల అవుతుందని భావిస్తున్నారు. అయితే ఏప్రిల్ 5న సినిమా విడుదల కాకపోతే ఆగస్టులో కనుక రిలీజ్ అయితే ఆ సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా విడుదలకు సిద్ధంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమాకి భారీ క్రేజ్ ఉంది. ఆ సమయంలో దేవర సినిమా పుష్ప సినిమాకి పోటీగా వచ్చే అవకాశం లేదు. ఆగస్టు తర్వాత సెప్టెంబర్ లో ‘ గేమ్ ఛేంజర్ ‘ సినిమా రానుంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాకి గ్లోబల్ వైడ్ గా మంచి హైప్ ఉంది.

ఒకవేళ అక్టోబర్లో విడుదల చేస్తే దసరా అని గేమ్ ఛేంజర్ సినిమాని ఆ సమయానికి విడుదల చేయవచ్చు. ఇక నవంబర్ డిసెంబర్లో ప్రభాస్ రాజాసాబ్ సినిమా విడుదల అవ్వవచ్చు. అందుకే దేవర సినిమా ఏప్రిల్ లో విడుదల కాకపోతే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనూ దేవర సినిమాని కచ్చితంగా ఏప్రిల్ లో విడుదల చేస్తారని అందరూ భావిస్తున్నారు. ఏప్రిల్లో విడుదల కాకపోతే దేవర వచ్చే సంవత్సరం విడుదల చేసుకోవాల్సి వస్తుంది. దీంతో దేవర సినిమాకి రిలీజ్ డేట్ కష్టాలు చాలా ఉన్నాయని తెలుసుకోవాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి