Jr Ntr Devara : ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టార్ డమ్ మారిపోయింది. తెలుగు స్టార్లు కాస్త గ్లోబల్ స్టార్లు అయ్యారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుకుంటోంది అంటే దానికి కారణం ఒకరు జక్కన్న కాగా.. మరో కారణం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ సినిమా కోసం వాళ్లు చాలా కష్టపడ్డారు. దాని ప్రతిఫలమే ఆర్ఆర్ఆర్ సూపర్ సక్సెస్.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అందరి చూపు.. జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్ తదుపరి సినిమాలపై పడింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక.. రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు. అయితే.. ఈ రెండు సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులే కాదు.. యావత్ ప్రపంచమే ఎదురు చూస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు దీటుగా ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఈ సినిమాల్లో ఆర్ఆర్ఆర్ కంటే కూడా పవర్ ఫుల్ రోల్స్ లో ఇద్దరూ నటిస్తున్నట్టు తెలుస్తోంది.గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ డ్యుయల్ రోల్ చేస్తున్నారు. తండ్రి, కొడుకుగా నటిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో తండ్రిగా నటిస్తున్నారు. అయితే.. గేమ్ చేంజర్ సినిమాకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్లస్ పాయింట్ అని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మామూలుగా ఉండదట.
రచ్చ రచ్చే అంటున్నారు. ఆర్ఆర్ఆర్ ను మించి ఉంటుంది అంటున్నారు. ఇక.. దేవర సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అదిరిపోతుందట. దేవర సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నే జనాలు గుర్తు పెట్టుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దుతున్నారట. మొత్తం మీద ఆర్ఆర్ఆర్ గ్లోబల్ సక్సెస్ తర్వాత ఆ సినిమాను మించి ఉండేలా తమ తదుపరి సినిమాల కోసం మరింత కష్టపడుతున్నారు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. చూద్దాం మరి వీళ్ల కష్టం ఎంత మేరకు ఫలిస్తుందో?
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.