Jr Ntr Devara : ఆర్ఆర్ఆర్‌కి తాతలా దేవర, గేమ్ చేంజర్ సినిమాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు మళ్లీ పండగే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jr Ntr Devara : ఆర్ఆర్ఆర్‌కి తాతలా దేవర, గేమ్ చేంజర్ సినిమాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు మళ్లీ పండగే

Jr Ntr Devara : ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టార్ డమ్ మారిపోయింది. తెలుగు స్టార్లు కాస్త గ్లోబల్ స్టార్లు అయ్యారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుకుంటోంది అంటే దానికి కారణం ఒకరు జక్కన్న కాగా.. మరో కారణం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ సినిమా కోసం వాళ్లు చాలా కష్టపడ్డారు. దాని ప్రతిఫలమే ఆర్ఆర్ఆర్ సూపర్ సక్సెస్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అందరి చూపు.. జూనియర్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :26 July 2023,10:00 am

Jr Ntr Devara : ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టార్ డమ్ మారిపోయింది. తెలుగు స్టార్లు కాస్త గ్లోబల్ స్టార్లు అయ్యారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుకుంటోంది అంటే దానికి కారణం ఒకరు జక్కన్న కాగా.. మరో కారణం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ సినిమా కోసం వాళ్లు చాలా కష్టపడ్డారు. దాని ప్రతిఫలమే ఆర్ఆర్ఆర్ సూపర్ సక్సెస్.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అందరి చూపు.. జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్ తదుపరి సినిమాలపై పడింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక.. రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు. అయితే.. ఈ రెండు సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులే కాదు.. యావత్ ప్రపంచమే ఎదురు చూస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు దీటుగా ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఈ సినిమాల్లో ఆర్ఆర్ఆర్ కంటే కూడా పవర్ ఫుల్ రోల్స్ లో ఇద్దరూ నటిస్తున్నట్టు తెలుస్తోంది.గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ డ్యుయల్ రోల్ చేస్తున్నారు. తండ్రి, కొడుకుగా నటిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో తండ్రిగా నటిస్తున్నారు. అయితే.. గేమ్ చేంజర్ సినిమాకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్లస్ పాయింట్ అని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మామూలుగా ఉండదట.

Jr ntr devara Movie Updates

Jr ntr devara Movie Updates

Jr Ntr Devara : డ్యుయల్ రోల్ లో నటిస్తున్న రామ్ చరణ్

రచ్చ రచ్చే అంటున్నారు. ఆర్ఆర్ఆర్ ను మించి ఉంటుంది అంటున్నారు. ఇక.. దేవర సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అదిరిపోతుందట. దేవర సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నే జనాలు గుర్తు పెట్టుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దుతున్నారట. మొత్తం మీద ఆర్ఆర్ఆర్ గ్లోబల్ సక్సెస్ తర్వాత ఆ సినిమాను మించి ఉండేలా తమ తదుపరి సినిమాల కోసం మరింత కష్టపడుతున్నారు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. చూద్దాం మరి వీళ్ల కష్టం ఎంత మేరకు ఫలిస్తుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది